iDreamPost
android-app
ios-app

OTT లో టాప్ 5 కొరియన్ డ్రామాస్.. మీరు అసలు మిస్ కాకుడనివి ఇవే..

  • Published Apr 12, 2024 | 5:25 PM Updated Updated Apr 12, 2024 | 5:25 PM

ఓటీటీ లోకి వచ్చే సినిమాలు, సిరీస్ లు అన్ని ఒక ఎత్తైతే.. కొరియన్ సిరీస్ , సినిమాలు మరొక ఎత్తు. ప్రస్తుతం అంత కొరియన్ ట్రెండ్ నడుస్తుందని చెప్పి తీరాలి. ఈ క్రమంలో ఓటీటీ లో అసలు మిస్ కాకుడని కె డ్రామాస్ ఏంటో ఓ లుక్ వేసేద్దాం.

ఓటీటీ లోకి వచ్చే సినిమాలు, సిరీస్ లు అన్ని ఒక ఎత్తైతే.. కొరియన్ సిరీస్ , సినిమాలు మరొక ఎత్తు. ప్రస్తుతం అంత కొరియన్ ట్రెండ్ నడుస్తుందని చెప్పి తీరాలి. ఈ క్రమంలో ఓటీటీ లో అసలు మిస్ కాకుడని కె డ్రామాస్ ఏంటో ఓ లుక్ వేసేద్దాం.

  • Published Apr 12, 2024 | 5:25 PMUpdated Apr 12, 2024 | 5:25 PM
OTT లో టాప్ 5 కొరియన్ డ్రామాస్.. మీరు అసలు మిస్ కాకుడనివి ఇవే..

కొరియన్ వెబ్ సిరీస్ లకు, సినిమాలకు యూత్ బాగా అట్ట్రాక్ అవుతున్నారు. ఓటీటీ లోకి వచ్చే సినిమాలు, సిరీస్ లపై అందరికి ఆసక్తి కలుగుతున్నా కానీ, కొరియన్ డ్రామాస్ కు మాత్రం ప్రత్యేకమైన అభిమానులు ఉంటున్నారు. ముఖ్యంగా యూత్ అంతా వీటికి ఆకర్షితులు అవుతున్నారని చెప్పి తీరాలి. పైగా కొరియన్ డ్రామాస్ లో ఉండే కంటెంట్ కూడా అంతే అద్భుతంగా ఇండియన్స్ కు మంచి అనుభూతిని కలిగిస్తుందని చెప్పి తీరాలి. దీనితో ఈ కే డ్రామాస్ అందరి మనుషులను గెలుచుకుంటున్నాయి. ఇప్పటికే ఓటీటీలోకి ఎన్నో కొరియన్ డ్రామాస్ వచ్చాయి. మరి వాటిలో ఎక్కువమంది చూసిన కొరియన్ డ్రామాస్ ఏంటో చూసేద్దాం. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ కొరియన్ డ్రామాస్ వివరాలు ఇలా ఉన్నాయి.

1) క్రాష్ ల్యాండింగ్ ఆన్ యు:
ఈ సిరీస్ 2019 లో వచ్చింది. ఇది ఒక రొమాంటిక్ లవ్ వెబ్ సిరీస్. నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య ఉన్న ఘర్షణల గురించి తెలియనిది కాదు. మరి అలాంటిది ఒక నార్త్ కొరియా అబ్బాయి, సౌత్ కొరియా అమ్మాయి మధ్య జరిగిన ఒక ప్రేమ కథ ఎలా ఉండబోతుందో చూడాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. సహజంగానే ప్రేమ కథలు అందరికి నచ్చేస్తూ ఉంటాయి. అలాంటిది కొరియన్ ప్రేమ కథలంటే మరింత ఇంట్రెస్టింగ్ అనిపించడం ఖాయం.

2) ఇట్స్ ఓకే టు నాట్ బి ఓకే :
ఈ వెబ్ సిరీస్ 2020 లో వచ్చింది. ఇది కూడా ఒక రొమాంటిక్ వెబ్ సిరీస్ క్యాటగిరి ఏ.. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో ఈ సిరీస్ కు 8.6 రేటింగ్ వచ్చింది. ఈ సిరీస్ స్టోరీ లైన్ విషయానికొస్తే.. పిల్లలు పుస్తకాలు రాసే ఒక రైటర్, యాంటీ సోషల్ డిజార్డర్ తో బాధపడే ఒక డాక్టర్ వీరిద్దరి మధ్య జరిగే ఒక స్టోరీ ఇది.

3) విన్సెంజో :
ఈ సిరీస్ 2021లో వచ్చింది. ఇది ఒక కామెడీ థ్రిల్లర్.. ఇంటర్నెట్ డేటా బేస్ లో ఈ సిరీస్ కు 8.4 రేటింగ్ వచ్చింది. ఈ సిరీస్ స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఒక ఇటాలియన్ మాఫియాకు లాయర్ గా ఉన్న ఒక కొరియన్ అబ్బాయి.. డబ్బున్న వాళ్లపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు అనేదే ఈ సిరీస్ కథ.

4) స్టార్టప్ :
ఈ వెబ్ సిరీస్ 2020లో వచ్చింది. ఇంటర్నెట్ డేటా బేస్ లో ఈ సిరీస్ కు 8 రేటింగ్ వచ్చింది. ఇది కూడా రొమాంటిక్ జోనర్ కు సంబంధించిందే. సహజంగా స్టార్ట్అప్ కంపెనీలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. అయితే.. ఇలాంటి ఒక స్టార్ట్ అప్ కంపెనీలో జాయిన్ అయ్యి పైకి ఎదగాలనే కొందరు యువత.. అక్కడే వారి ప్రేమను కూడా వెతుక్కునే ప్రయత్నం చేయడమే ఈ సిరీస్ కథ.

5) హాస్పిటల్ ప్లేలిస్ట్:
ఈ సిరీస్ 2020లో వచ్చింది. ఈ సిరీస్ స్టోరీ లైన్ విషయానికొస్తే.. చిన్న నాటి నుంచి స్నేహితులుగా ఉన్న ఐదుగురు యువకులు.. ఒకటే హాస్పిటల్ లో డాక్టర్స్ గా పని చేస్తూ ఉంటారు. అంతే కాకుండా వారికి మ్యూజిక్ అంటే ఎంతో ప్రాణం. వీరి చుట్టూ ఎం జరుగుతుందనేదే ఈ సిరీస్ కథ. ఈ సిరీస్ ఇప్పటికే విజయవంతంగా రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది.

మరి ఇప్పటివరకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కొరియన్ డ్రామాస్ ను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూడాల్సిందే. మరి ఈ కే డ్రామాస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.