iDreamPost
android-app
ios-app

OTT Movie: రెండేళ్ల తర్వాత OTT లోకి కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Apr 23, 2024 | 4:46 PM Updated Updated Apr 26, 2024 | 6:19 PM

దాదాపు థియేటర్లలో రిలీజ్ ఒకటి రెండు నెలలలోపు ఓటీటీ లోకి వచ్చేస్తూ ఉంటాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రం ఎందుకో ఆలస్యం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ హోస్ట్ కపిల్ శర్మ నటించిన ఒక సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా రెండేళ్ల తర్వాత ఓటీటీ లోకి వచ్చేస్తుంది.

దాదాపు థియేటర్లలో రిలీజ్ ఒకటి రెండు నెలలలోపు ఓటీటీ లోకి వచ్చేస్తూ ఉంటాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రం ఎందుకో ఆలస్యం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ హోస్ట్ కపిల్ శర్మ నటించిన ఒక సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా రెండేళ్ల తర్వాత ఓటీటీ లోకి వచ్చేస్తుంది.

  • Published Apr 23, 2024 | 4:46 PMUpdated Apr 26, 2024 | 6:19 PM
OTT Movie: రెండేళ్ల తర్వాత  OTT లోకి కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

థియేటర్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాలు అనుకున్న టైమ్ కి ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేస్తూ ఉంటాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రం చాలా టైమ్ తీసుకుంటాయి. వాటి కోసం ప్రేక్షకులు ఎదురుచూసి ఎదురు చూసి లైట్ తీసుకుందాం అనుకునే టైమ్ కి .. ఆ సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్ డేట్స్ ఇస్తూ ఉంటారు మేకర్స్. ఆయా సినిమాలు ఓటీటీ లో రిలీజ్ కాకపోడానికి గల కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ.. లేట్ గా ఓటీటీ లోకి వచ్చినా కానీ.. ఓటీటీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ నే అందుకుంటాయి. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం బాలీవుడ్ హోస్ట్.. కపిల్ శర్మ హీరోగా నటించిన “జ్విగాటో” మూవీ ఓటీటీ కి సంబంధించిన అప్ డేట్స్.. ఎట్టకేలకు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మరి ఈ సినిమా ఎక్కడ .. ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుందని అనే విషయాల గురించి తెలుసుకుందాం.

జ్విగాటో సినిమా 2022 లిప్ థియేటర్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు నందితా దాస్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో.. ఫిలిం ఫేర్ అవార్డుతో పాటు.. ఎన్నో అవార్డ్స్ ను సొంతం చేసుకుంది. అలాగే టొరాంటోతో పాటు అనేక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లోను ఈ మూవీ స్ట్రీమింగ్ కు ఎంపికైంది. పైగా ఆస్కార్ లైబ్రరీ లోను ఈ మూవీ స్థానం సంపాదించుకుంది. ఇన్ని అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమాలో ఫుడ్ డెలివరీ బాయ్స్ కు వ్యతిరేకంగా కొన్ని సీన్స్ ఉండడంతో.. డిజిటల్ ప్లాట్ ఫార్మ్ సంస్థలేవీ కూడా ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీనితో ఈ సినిమా డైరెక్టర్ నందితా దాస్ సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్స్ కూడా చేశారు. అప్పట్లో ఆ పోస్ట్స్ అన్ని కూడా తెగ వైరల్ అయ్యాయి. ఎట్టకేలకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేసేందుకు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. నెట్ ఫ్లిక్స్ ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా ప్రకటించింది. జ్విగాటో సినిమాను మే 3 లేదా మే 10 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఇక జ్విగాటో సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో ఒక కంపెనీలో ఫ్లోర్ మేనేజర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. కొన్ని అనుకోని కారణాల చేత అతను తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. ఇక చేసేదేమి లేక కుటుంబం గడవడం కోసం.. ఒక కంపెనీలో ఫుడ్ డెలివరీ బాయ్ గా ఉద్యోగంలో చేరతాడు. అయితే, ఇక్కడ అంతా కూడా రేటింగ్స్ ప్రకారం, జీతం ఇస్తారన్న సంగతి తెలిసిందే.. ఇక ఈ ఉద్యోగంలో అతను ఇమడలేక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు ! అతనికి సహాయం చేయడానికి అతని భార్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది! జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎలా అధిగమించారు. ! ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాలసిందే. మరి ఈ జ్విగాటో సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.