iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేసిన హృతిక్ రోషన్ ఫైటర్! తిట్టిపోస్తున్న తెలుగు ఆడియన్స్!

  • Published Mar 21, 2024 | 1:22 PM Updated Updated Mar 21, 2024 | 1:22 PM

ఓటీటీలో వరుసగా సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో థియేటర్ లో సూపర్ హిట్ సాధించిన సినిమాల ఓటీటీ ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల హృతిక్, దీపికా జంటగా నటించిన ఫైటర్ సినిమా.. ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఓటీటీలో వరుసగా సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో థియేటర్ లో సూపర్ హిట్ సాధించిన సినిమాల ఓటీటీ ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల హృతిక్, దీపికా జంటగా నటించిన ఫైటర్ సినిమా.. ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

  • Published Mar 21, 2024 | 1:22 PMUpdated Mar 21, 2024 | 1:22 PM
OTTలోకి వచ్చేసిన హృతిక్ రోషన్ ఫైటర్! తిట్టిపోస్తున్న తెలుగు ఆడియన్స్!

ఓటీటీ సినిమాలకు ఆదరణ బాగా లభిస్తోంది. దీనితో మూవీ మేకర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఓటీటీలో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. థియేటర్ లో విడుదల కాబోయే సినిమాలకు కూడా ముందుగానే.. భారీ ధరలకు డిజిటల్ రైట్స్ అమ్ముడు పోతున్నాయి. ఇక థియేటర్ లో సినిమా రిలీజ్ అయిన రెండు నుంచి మూడు నెలల లోపే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో సినిమాలు సందడి చేస్తున్నాయి. థియేటర్ లో సినిమాలను మిస్ అయిన ప్రేక్షకులంతా ఓటీటీ ఎంట్రీ కోసమే ఎదురుచూస్తున్నారు. పైగా కొన్ని సినిమాలైతే.. థియేటర్ లో విడుదలైన నెల రోజుల లోపే ఓటీటీకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో హృతిక్ రోషన్, దీపిక పదుకొణె జంటగా నటించిన.. “ఫైటర్” సినిమా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.

సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో .. హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటించిన సినిమా “ఫైటర్”. రిషబ్ సాహ్ని ఇందులో విలన్‌గా యాక్ట్ చేశారు. కాగా, ఈ చిత్రంలో అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషించారు. ఏరియల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం.. పుల్వామా ఎటాక్, బాలాకోట్ వైమానిక దాడుల ఆధారంగా తీసుకుని రూపొందించారు దర్శకుడు. ఈ సినిమా జనవరి 25న థియేటర్ లో విడుదలై.. ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.350 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా 8 వారాల తర్వాత.. ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ సినిమా ఇప్పుడు కేవలం హిందీ భాషలోనే అందుబాటులో ఉండడంతో.. సౌత్ ఆడియన్స్ కాస్త డిస్సపాయింట్ అవుతున్నారు. మిగిలిన భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ.. కోరుతున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే, ఫైటర్ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత.. ఈ సినిమా డైరెక్టర్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఈ మూవీ డైరెక్టర్ సిద్ధార్ద్ చేసిన కామెంట్స్ పై .. ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైటర్ సినిమా కొంతవరకు ప్రేక్షకులను నిరాశపరిచిన మాట నిజమే అయితే, ఈ విషయానికి గల కారణాలు ఏంటని.. దర్శకుడిని ప్రశ్నించగా.. సిద్దార్ధ్ ఇలా మాట్లాడారు.. “ఇలాంటి కథతో ఇండియాలో ఇప్పటివరకూ సినిమా రాలేదు. దీన్ని చాలా కొత్తగా తీశాం. ఇలాంటి సినిమాను ఆడియన్స్ ఇప్పటివరకూ చూసి ఉండరు. అందుకే ఏంటి ఈ యుద్ధ విమానాలన్నీ ఏం చేస్తున్నాయి అని థియేటర్లో వింతగా చూసి ఉంటారు. అయినా మన దేశంలో దాదాపు 90% మంది ఇప్పటివరకూ విమానమే ఎక్కి ఉండరు. అలాంటోళ్లకి ఈ సినిమాలో ఏం జరుగుతుందో ఏం అర్థమవుతుంది? కానీ ఒకసారి సినిమాను సరిగ్గా చూస్తే అర్థమవుతుంది,” అంటూ సమాధానం ఇచ్చారు. దీనితో ఆ సమయంలో ఈ సినిమా దర్శకుడిపై సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ చేశారు. ఇక ప్రస్తుతం “ఫైటర్” సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారం అవుతోంది. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.