iDreamPost
android-app
ios-app

OTTలోకి లెజండ్రీ డైరెక్టర్ వెబ్ సిరీస్‍! స్టార్స్ సైతం దీని కోసం వెయిటింగ్!

  • Published Mar 28, 2024 | 1:02 PM Updated Updated Mar 28, 2024 | 1:02 PM

Heeramandi OTT Release: ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతుంది. సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న.. పీరియాడిక్ డ్రామా సిరీస్ "హీరామండి" ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.

Heeramandi OTT Release: ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతుంది. సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న.. పీరియాడిక్ డ్రామా సిరీస్ "హీరామండి" ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.

  • Published Mar 28, 2024 | 1:02 PMUpdated Mar 28, 2024 | 1:02 PM
OTTలోకి లెజండ్రీ డైరెక్టర్ వెబ్ సిరీస్‍! స్టార్స్ సైతం దీని కోసం వెయిటింగ్!

ఇప్పటివరకు ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి. వీటిలో సస్పెన్స్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్ చూడడానికి ఎక్కువ మంది అలవాటు పడిపోయారు. ఈ క్రమంలో పూర్వం జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకుని.. ఎన్నో ప్రతిష్టాత్మకమైన సినిమాలకు దర్శకత్వం వహించిన .. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు.. సంజయ్ లీలా భన్సాలీ.. ఓ పీరియాడిక్ డ్రామా సిరీస్ ను రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ ఇంకా విడుదల కాకముందే .. అంతటా ఈ సినిమాపై భారీగా బజ్ క్రియేట్ అయింది. బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ పేరు “హీరామండి: ది డైమండ్ బజార్”. రెండేళ్ల క్రితమే ఈ సిరీస్ షూటింగ్ మొదలైనా కానీ.. రిలీజ్ మాత్రం ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే, ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఈ సిరీస్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. మరి, ఈ సిరీస్ ఏ ప్లాట్ ఫార్మ్ లో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

హీరామండి వెబ్ సిరీస్ ను.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సిరీస్ లో.. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్, షార్మీన్ సేగల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ గురించి ఇప్పటికే అందరికి భారీగా అంచనాలు నెలకొన్నాయి. హీరామండి వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను గత నెలలో విడుదల చేయగా.. ఆ సమయంలో ఇది ఎంతో మందిని ఆకట్టుకుంది. దీనితో ఈ సిరీస్ మీద విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. ఈ సిరీస్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని అందరూ.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు మేకర్స్ ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు. “హీరామండి: ది డైమండ్ బజార్” డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ .. నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మే 1వ తేదీ నుంచి ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని.. మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

హీరామండి సిరీస్ కథ విషయానికొస్తే.. భారతదేశం బ్రిటిష్ పరిపాలనలో ఉన్న కాలంలో .. అంటే 1940ల కాలం బ్యాక్డ్రాప్ తో ఈ సిరీస్ ను రూపొందించారు. హీరామండీ అనే రెడ్ లైట్ ప్రాంతంలో.. జీవనం సాగించే కొంతమంది డ్యాన్సర్స్ జీవితాల గురించి.. ఈ సిరీస్ లో చూపించారట. ఆ కాలంలో మహిళలు ఎదుర్కున్న ఎన్నో సమస్యలను.. ఈ సిరీస్ లో కళ్ళకు కట్టినట్లు చూపించడం జరిగిందని సమాచారం. ఓ విధంగా “హీరామండి: ది డైమండ్ బజార్”.. బ్రిటిష్ కాలం నాటి పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర ఉద్యమ సమయం నాటి కథ అని ప్రచారంలో ఉంది. మరి, ఈ సిరీస్ విడుదల తర్వాత ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

అయితే, సహజంగానే హీరామండి ప్రాంతానికి.. ఓ ప్రత్యేకత ఉంది. బ్రిటిష్ పాలనకు ముందు ఉన్న మొఘలుల కాలంలో.. ఈ ప్రాంతం అంతా కూడా గాయకులు, డ్యాన్సర్లకు బాగా ఫేమస్. అయితే, బ్రిటీష్ పాలన తర్వాత మాత్రం అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అనుకోని పరిస్థితుల కారణంగా క్రమ క్రమంగా ఆ ప్రాంతం వ్యభిచారానికి ఫేమస్ అయింది. అలా అక్కడ చాలా దారుణాలు జరిగాయి. ప్రస్తుతం హీరామండి అనే ప్రాంతం పాకిస్థాన్‍లోని లాహోర్‌లో ఉంది. మరి, కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా తీసుకుని రాబోతున్న ఈ సిరీస్ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి హీరామండి వెబ్ సిరీస్ ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.