iDreamPost
android-app
ios-app

OTT లో బ్రీత్ మూవీకి సూపర్ క్రేజ్! ఎగబడి చూస్తున్నారు!

  • Published Mar 14, 2024 | 9:45 AM Updated Updated Mar 14, 2024 | 3:48 PM

నందమూరి చైతన్య కృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం బ్రీత్. థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీలో మాత్రం సూపర్ రెస్పాన్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది.

నందమూరి చైతన్య కృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం బ్రీత్. థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీలో మాత్రం సూపర్ రెస్పాన్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది.

  • Published Mar 14, 2024 | 9:45 AMUpdated Mar 14, 2024 | 3:48 PM
OTT లో బ్రీత్ మూవీకి సూపర్ క్రేజ్! ఎగబడి చూస్తున్నారు!

దాదాపు 20 సంవత్సరాల గ్యాప్ తర్వాత నందమూరి హీరో చైతన్య కృష్ణ వెండితెరపై కనిపించారు. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ‘బ్రీత్’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు నందమూరి హీరో. మెడికో థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో వైదిక సెంజలియా హీరోయిన్ గా నటించింది. గతేడాది డిసెంబర్ 2న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. సినిమాపై ఏమాత్రం బజ్ లేకపోవడం, సరైన ప్రమోషన్లు లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఘోర పరాభవాన్ని చవిచూసింది. అయితే మహా శివరాత్రి కానుకగా మార్చి 8న బ్రీత్ మూవీ ‘ఆహా’ ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో పట్టించుకోని జనం.. ఓటీటీలో మాత్రం ఎగబడి చూస్తున్నారు. మరి దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నందమూరి చైతన్య కృష్ణ.. ‘ధమ్’ అనే చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. కానీ ఆ మూవీ హిట్ కాకపోవడంతో.. ఇండస్ట్రీకి దూరమైయ్యాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత బ్రీత్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి చైతన్యపై ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. ఆయన యాక్టింగ్ పై, వీడియోలపై కొందరు విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఇక థియేటర్లలో బ్రీత్ మూవీని ప్రేక్షకులు ఆదరించలేదు. దీంతో జీరో కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే థియేటర్లో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఓటీటీలోకి వచ్చే గ్యాప్ లో చైతన్య కృష్ణపై వచ్చిన ట్రోల్స్ కారణంగా అతడిపై ఓ పాజిటివ్ నెస్ ప్రేక్షకుల్లో ఏర్పడింది.

చైతన్య కృష్ణ దాదాపు 20 సంవత్సరాల తర్వాత సినిమా చేశాడంటే.. అతడికి మూవీస్ పై ఎంత ప్రేమ ఉందో అన్న భావనలోకి సినీ లవర్స్ వచ్చారు. దీంతో ఓటీటీలోకి వచ్చిన బ్రీత్ ను చూడ్డం మెుదలుపెట్టారు. మూవీ బాలేదంటున్నారు? అసలు దాంట్లో ఏముంది? కథేంటి? తెలుసుకుందామని ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న బ్రీత్ ను చూస్తున్నారు మూవీ లవర్స్. దీంతో వ్యూయర్ షిప్ పెరుగుతూ వస్తోంది. మెడికో థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం కథ పరంగా మెచ్చుకోవాల్సిందే. కానీ బ్రీత్ విడుదల సమయానికే యానిమల్, హాయ్ నాన్న లాంటి పెద్ద పెద్ద మూవీలు రిలీజ్ కావడంతో.. ప్రేక్షకులు ఈ చిన్న చిత్రంపై పెద్దగా ఆసక్తిచూపించలేదు. దీంతో థియేటర్లలో దారుణమైన కలెక్షన్లను చవిచూసింది. కానీ ఓటీటీలో మాత్రం రాణిస్తోంది.

ఇదికూడా చదవండి: Om Bheem Bush: ఓం భీమ్ బుష్….శ్రీ విష్ణు ఏం చెయ్యబోతున్నాడు

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss