iDreamPost
android-app
ios-app

OTTలో 25 లక్షల మంది చూసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..!

  • Published May 04, 2024 | 10:40 AM Updated Updated May 04, 2024 | 10:40 AM

My Dear Donga: నేరుగా ఓటీటీలో విడుదలైన ఓ తెలుగు సినిమా దూసుకుపోతుంది. ఇప్పటికి 25 లక్షల మంది ఈ సినిమాను చూశారు. ఇంతకు ఆ మూవీ ఏంటి.. స్ట్రీమింగ్‌ వివరాలు మీ కోసం

My Dear Donga: నేరుగా ఓటీటీలో విడుదలైన ఓ తెలుగు సినిమా దూసుకుపోతుంది. ఇప్పటికి 25 లక్షల మంది ఈ సినిమాను చూశారు. ఇంతకు ఆ మూవీ ఏంటి.. స్ట్రీమింగ్‌ వివరాలు మీ కోసం

  • Published May 04, 2024 | 10:40 AMUpdated May 04, 2024 | 10:40 AM
OTTలో 25 లక్షల మంది చూసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..!

ఈమధ్య కాలంలో ఓటీటీలకు క్రేజ్‌ పెరిగింది. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అందుకు ప్రధాన కారణం ఓటీటీలు అని చెప్పవచ్చు. ఇంట్లో కూర్చునే.. బోలేడన్ని కొత్త సినిమాలు చూసి ఎంజాయ్‌ చేయవచ్చు. భాషతో సమస్య లేకుండా సబ్‌టైటిల్స్‌తో మ్యానేజ్‌ చేయవచ్చు. ఇక ఓటీటీలకు డిమాండ్‌ పెరుగుతుండటంతో.. ఆయ సంస్థలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం మంచి మంచి కంటెంట్‌ను తీసుకుని వస్తున్నాయి. ఇక కొన్నిచిత్రాలైతే నేరుగా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయంటే.. వాటికి ఏ రేంజ్‌లో క్రేజ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు.

భవిష్యత్తులో ఇది మరింత పెరిగే ఛాన్‌ ఉంది అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. ఇప్పుడు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సెలబ్రిటీలంతా ఓటీటీలకు జై కొడుతున్నారు. ఈ క్రమంలో నేరుగా ఓటీటీలో విడుదలైన తెలుగు సినిమా ఒకటి.. ప్రస్తుతం టాప్‌ ట్రెండింగ్‌లో ఉంది. మీరు కనక ఆ మూవీని మిస్సై ఉంటే ఇప్పుడు చూసేయండి. ఇంతకు అది ఏ సినిమా.. ఎక్కడ చూడాలంటే..

My Dear Donga

ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లతో దూసుకుపోతున్న అభినవ్ గోమఠం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మై డియర్ దొంగ. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు బీఎస్ సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో నేరుగా విడుదలైన ఈ చిత్రం.. ఘన విజయం సాధించింది. దాంతో ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా ఉంటుందని మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. ఇక ఇప్పటి వరకు సుమారు 25 లక్షల మంది ఈ సినిమాను చూశారు. దాంతో తాజాగా చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ కూడా నిర్వహించింది. మీరు కనక మిస్సై ఉంటే.. ఈ వీకెండ్‌లో ఈ సినిమా చూసి సరదాగా ఎంజాయ్‌ చేయండి.

మైడియర్‌ దొంగ కథ విషయానికి వస్తే..

విశాల్‌ అనే డాక్టర్‌తో సుజాత అనే యువతి రిలేషన్‌లో ఉంటుంది. కానీ ఆ వైద్యుడు ఆమెను ఇగ్నోర్‌ చేస్తుంటాడు. అది అర్థమైన బాధలో ఇంటికి వస్తుంది సుజాత. అప్పటికే ఇంట్లో దొంగ పడ్డాడు. అతడి పేరు సురేష్ (అభినవ్ గోమఠం). అతడిని చూసి ముందు షాక్ అయినా… ఫ్యామిలీ బ్యాగ్రౌండ్స్ సిమిలర్‌గా ఉండటంతో మెల్లగా మాటల్లో పడుతుంది. అంతలో టైమ్ రాత్రి 12 కావొస్తుంది. సుజాత బర్త్ డే కావడంతో విశాల్, ఆమె బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి (దివ్య శ్రీపాద), ఆమె బాయ్ ఫ్రెండ్ వరుణ్ (శశాంక్ మండూరి) ఇంటికి వస్తారు. దాంతో సురేష్ వెళ్ళిపోతానంటే ఉండమని చెబుతుంది. మరి బర్త్‌డే పార్టీలో ఏం జరిగింది.. సుజాత ఎందుకు సురేష్‌ని ఇష్టపడుతుంది.. చివరకు ఏమైంది అనే కథాంశంతో మై డియర్‌ దొంగ తెరకెక్కింది.