iDreamPost
android-app
ios-app

HotStar: ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్లు ఇవే.. ఆ 4 చాలా స్పెషల్?

సాధారణంగా అందరూ మంచి వెబ్ సిరీస్ చూడాలి అనుకుంటారు. చూశాక బాగోకపోతే డిజప్పాయింట్ అవుతారు. అందుకే మీకోసం కొన్ని బెస్ట్ వెబ్ సిరీస్లు తీసుకొచ్చాం.

సాధారణంగా అందరూ మంచి వెబ్ సిరీస్ చూడాలి అనుకుంటారు. చూశాక బాగోకపోతే డిజప్పాయింట్ అవుతారు. అందుకే మీకోసం కొన్ని బెస్ట్ వెబ్ సిరీస్లు తీసుకొచ్చాం.

HotStar: ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్లు ఇవే.. ఆ 4 చాలా స్పెషల్?

సాధారణంగా ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాలు మాత్రమే కాకుండా.. వెబ్ సిరీస్లు చూసేవాళ్లు కూడా బాగా పెరిగిపోయారు. నిజానికి సినిమాల కంటే వెబ్ సిరీస్ లకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత అది నచ్చకపోతే మనసు కకావికలం అయిపోతుంది. టైమ్ వేస్ట్ చేశామనే భావన కలుగుతుంది. అందుకే తెలిసిన వాళ్లని కూడా అడుగుతూ ఉంటారు మంచి వెబ్ సిరీస్ ఉంటే చెప్పు అని. అలాంటి వారి కోసం కొన్ని బెస్ట్ వెబ్ సిరీస్లు తీసుకొచ్చాం. అవి బెస్ట్ అని ఎందుకు అంటున్నాం అంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అవి మోస్ట్ వాచ్డ్ వెబ్ సిరీస్లు కాబట్టి. మరి.. ఆ లిస్ట్ ఏంటి? వాటిలో ఏ వెబ్ సిరీస్లు చూడచ్చో తెలుసుకోండి.

లేబుల్:

సౌత్ లోనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ లలో లేబుల్ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా.. ఒక మంచి క్రైమ్ డ్రామా ఇది. ఆడుకునే వయసులో ఒక కుర్రాడి జీవితంలో జరిగిన ఒక ఘటన.. ఆ ప్రాంతం జనాల తలరాతనే మార్చేస్తుంది. తమ ప్రాంత ప్రజల గుర్తింపు మార్చేందుకు తన ప్రాణాన్నే పణంగా పెడతాడు. తన ఆశయం కోసం ఆ కుర్రాడు ఎంత కష్టపడ్డాడు? ఎంతమందిని ఎదిరించాడు? చివరికి అనుకున్నది సాధించాడా.. లేదా? అనేదే కథ. ఈ సిరీస్లో ఎన్నో ట్విస్టులు, మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఒకసారి చూడటం మొదలు పెడితే ముగించే వరకు ఆపడం కష్టమనే చెప్పాలి.

అతిథి:

ఈ సిరీస్ తో వేణు తొట్టెంపూడి తన కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ అతిథి వెబ్ సిరీస్ ఎంతో బాగా నచ్చుతుంది. వేణు తొట్టెంపూడి యాక్టింగ్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ఒక ఊరిలో దెయ్యాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఆ ప్రాంతానికి ఎవరు వెళ్లినా ప్రాణాలతో తిరిగిరారు అని కథలు కథలుగా చెప్తారు. అయితే అసలు అక్కడ దెయ్యాలు ఉన్నాయా? వేణు తొట్టెంపూడి ఆ ఊరికి చివరన ఎందుకు ఉంటున్నాడు? దారి తప్పిపోయిన వాళ్లంతా వేణు మ్యాన్షన్ కే ఎందుకు వస్తుంటారు? మనిషిలో ఉండే వివిధ రకాల ఎమోషన్స్ ని ఈ కథాంశంగా ఎందుకు తీసుకున్నారు? వంటి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే మీరు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అతిథి వెబ్ సిరీస్ చూడాల్సిందే.

సైతాన్:

సైతాన్ అనేది ఒక క్రైమ్ డ్రామా.. ఒక వేశ్య కుమారుడు తన జీవితంలో జరిగిన విషయాలను వివరిస్తూ కథను ముందుకు తీసుకెళ్తాడు. అతని జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి? అసలు అతను ఎందుకు క్రిమినల్ గా మారతాడు. హోమ్ మినిస్టర్ మీద అతను అటాక్ ఎందుకు చేస్తాడు? తర్వాత తన లైఫ్ ఎన్ని మలుపులు తిరుగుతుంది. క్రిమినల్ గా మారి అతను సాధించింది ఏంటి? అసలు వీళ్ల కుటుంబం చుట్టూనే ఎందుకు కష్టాలు తిరుగుతూ ఉంటాయి? వంటి ఆసక్తికర అంశాలు, ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఈ సైతాన్ వెబ్ సిరీస్ లో ఉంటాయి. ఇందులో వైలెన్స్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.

తాజా కబర్:

తాజా కబర్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన వెబ్ సిరీస్. ఇది ఒక థ్రిల్లర్ ఫాంటసీ డ్రామా వెబ్ సిరీస్. ఒక పబ్లిక్ టాయిలెట్ కేర్ టేకర్ జీవితం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ సాగుతూ ఉంటుంది. అతను ఒక వేశ్యను ప్రేమిస్తాడు. ఆమెను ఆ మురికి కూపం నుంచి బయటకు తీసుకురావాలి అనుకుంటాడు. కానీ, అతని దగ్గర తిండికే తికానా ఉండదు. అనుకోకుండా ఒక వృద్ధురాలికి సహాయం చేస్తాడు. ఆమె అతనికి ఒక ఫోన్ ఇస్తుంది. ఆ ఫోన్ అతని లైఫ్ లోకి వచ్చిన తర్వాత కటిక దరిద్రం నుంచి కోట్లు ఖర్చుచేసే స్థాయికి ఎదుగుతాడు. అసలు ఆ ఫోన్ అతని లైఫ్ ని ఎలా మార్చింది? కోటీశ్వరుడు అయ్యాక అతను లైఫ్ ఎన్ని మలుపులు తిరిగింది? కోట్లు వచ్చిన తర్వాత అతనికి ఎదురైన కష్టాలు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే మీరు ఈ వెబ్ సిరీస్ ని చూడాల్సిందే. మరి.. ఈ నాలుగు వెబ్ సిరీస్ లలో మీరు ఏదైనా చూసుంటే.. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

హాట్ స్టార్ లో మోస్ట్ వాచ్డ్ వెబ్ సిరీస్లు:

  • లేబుల్
  • మ్యాన్షన్ 24
  • అతిథి
  • ఆఖరీ సచ్
  • మథగం
  • సైతాన్
  • కేరళ క్రైమ్ ఫైల్స్
  • సాస్ బహూ ఫ్లెమింగో
  • సేవ్ ది టైగర్స్
  • తాజా కబర్

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom