iDreamPost
android-app
ios-app

సరికొత్త రికార్డ్‌ సృష్టించిన వెబ్‌ సిరీస్ ‘మీర్జాపూర్-3’.. ఏకంగా 180కి పైగా దేశాల్లో..

  • Published Jul 13, 2024 | 9:55 AM Updated Updated Jul 13, 2024 | 9:55 AM

Mirzapur 3: ఇటీవల చాలా మంది మూవీ లవర్స్ ఎక్కువగా ఓటీటీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. వారం వారం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ సందడి చేస్తున్నాయి.

Mirzapur 3: ఇటీవల చాలా మంది మూవీ లవర్స్ ఎక్కువగా ఓటీటీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. వారం వారం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ సందడి చేస్తున్నాయి.

  • Published Jul 13, 2024 | 9:55 AMUpdated Jul 13, 2024 | 9:55 AM
సరికొత్త రికార్డ్‌ సృష్టించిన వెబ్‌ సిరీస్ ‘మీర్జాపూర్-3’.. ఏకంగా 180కి పైగా దేశాల్లో..

ఒకప్పుడు థియేటర్లలో పడిగాపులు కాస్తూ తమకు నచ్చిన సినిమాలు చూసి ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓటీటీ వచ్చిన తర్వాత ప్రేక్షకులు తమకు ఇష్టమైన సినిమాలు, వెబ్ సీరీస్ లో హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూస్తున్నారు. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే ప్రతి సినిమా, వెబ్ సీరీస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఇప్పటి వరకు ఓటీటీలో ఎన్నో వెబ్ సీరీస్ వచ్చాయి.. ఆడియన్స్ వాటిని చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక  బాలీవుడ్ లో ట్రెండ్ సృష్టించిన ‘మీర్జాపూర్ 3’ సీరీస్ ఇప్పుడు సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఈ నెల 5 న రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ ‘మీర్జా పూర్-3’ వెబ్ సీరీస్ రికార్డు మోత మోగిస్తుంది. అమేజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న మీర్జాపూర్ 3 స్ట్రీమింగ్ అయిన తొలి వారం భారత్ లో అత్యధిక మంది వీక్షించినట్లు ఓటీటీ సంస్థ తెలిపింది. ఇది అమెజాన్ లో ప్రైమ్ లో ఒక సరికొత్త రికార్డు అని వెల్లడించింది. అంతేకాదు మీర్జాపూర్ మూడవ సీజన్ 180 కి పైగా దేశాల్లో ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేసినట్లు తెలిపారు. వీక్ ఎండ్ లో యూకే, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియాతో సహా ప్రపంచ వ్యాప్తంగా 85 కంటే ఎక్కువ దేశాల్లో టాప్ టెన్ లో ట్రెండింగ్ జాబితాలో ‘మీర్జాపూర్ 3’ ఉండటం గమనార్హం. గతంలో వచ్చిన మీర్జాపూర్ 2 రికార్డు ను కూడా బ్రేక్ చేసినట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది.

మీర్జాపూర్ సీజన్ 3 లో గుర్మిత్ సింగ్, ఆనంద అయ్యార్ దర్శకత్వం వహించారు. మీర్జాపూర్ అభిమానులకు మేకర్స్ మరో బహుమతిని అందించారు.. సీజన్ 4. ఈ వెబ్ సీరీస్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మూడో సీజన్ ఈ రేంజ్ లో రికార్డులు బ్రేక్ చేసిందంటే.. మరి నాలుగో సీజన్ ఏ లెవెల్ లో ఉండబోతుందో అని ఆడియాన్స్ ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. మీర్జాపూర్ సీజన్ 3 లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, రసిక దుగల్, శ్వేతా త్రిపాఠి శర్మ, విజయ్ వర్మ, ఇషా తల్వార్, అంజుమ్ శర్మ, ప్రియాంషు, హర్షిత శేఖర్ గౌర్, షిబా చద్దా, మేఘనా మాలిక్, రాజేష్ తైలాంగ్, మను తదితరులు నటించారు.

Jojobet GirişJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom