iDreamPost
android-app
ios-app

OTTలోకి మేఘా ఆకాష్‌ రొమాంటిక్ లవ్ స్టోరీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Feb 14, 2024 | 3:42 PM Updated Updated Mar 14, 2024 | 4:49 PM

థియేటర్ లో సినిమాల విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో .. అలానే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వాలెంటైన్స్ డే సందర్బంగా తాజాగా మరో సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

థియేటర్ లో సినిమాల విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో .. అలానే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వాలెంటైన్స్ డే సందర్బంగా తాజాగా మరో సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

  • Published Feb 14, 2024 | 3:42 PMUpdated Mar 14, 2024 | 4:49 PM
OTTలోకి మేఘా ఆకాష్‌ రొమాంటిక్ లవ్ స్టోరీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రస్తుతం అందరి కళ్ళు ఓటీటీలో విడుదల అయ్యే సినిమాల మీదే ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం ఎన్నో కొత్త సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో ఎంట్రీ ఇస్తున్నాయి. థియేటర్ లో విడుదల అయ్యి కొన్ని నెలలు కూడా పూర్తవ్వకుండానే .. అత్యంత వేగంగా ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. పైగా ఈ ఓటీటీ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ కూడా భారీగానే ఉంది. దీనితో మేకర్స్ కూడా వెనుక అడుగు వేయట్లేదు. ఈ క్రమంలో తాజాగా వాలెంటైన్స్ డే సందర్బంగా మరో కొత్త సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి, మేఘ ఆకాష్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “సబా నాయగన్”. ఈ చిత్రంతో చాందిని చౌదరి కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం .. ప్రస్తుతం అంతటా పాజిటివ్ టాక్ తో ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కోలీవుడ్‌లో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం “సబా నాయగన్”. ఈ చిత్రానికి సీఎస్‌ కార్తికేయన్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రంలో అశోక్ సెల్వన్ హీరోగా నటించగా.. చాందిని చౌదరి, మేఘా ఆకాష్, కార్తిక మురళీధరన్ హీరోయిన్లుగా నటించారు. అయితే, ఈ చిత్రం డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలై మంచి కల్లెక్షన్లనే రాబట్టింది. ఇక ఇప్పుడు వాలెంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ .. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో .. బుధవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ట్రెండింగ్ లో ఉంది.

ఇక “సబా నాయగన్” సినిమా కథ విషయానికొస్తే.. లవ్ ఫెయిల్యూర్ అయినా ఓ యువకుడు తాగి గొడవచేస్తుండగా .. పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. అతని పరిస్థితిని అర్థంచేసుకున్న పోలీసులు .. అతని ప్రేమ గురించి అడుగుతారు. ఈ క్రమంలో గతంలో తన జీవితంలో ఎదురైన ముగ్గురు అమ్మాయిల ప్రేమ విషయాలను చెప్పుకొస్తాడు. ఈ ముగ్గురిలో హీరో ఎవరిని ప్రేమించాడు అనేదే ఈ సినిమా కథ. వేరు వేరు టైం పీరియడ్స్ లో ఈ ప్రేమ కథలను చూపిస్తూ.. కథను అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. కాగా, నటీ నటులు కూడా ఎంతో అద్భుతంగా తమ నటనకు వంద శాతం న్యాయం చేకూర్చారు. అంతేకాకుండా ఈ చిత్రం థియేటర్ లో విడుదల అయ్యి పదిహేను కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందని సమాచారం.

ఇక చాందిని చౌదరి విషయానికొస్తే తెలుగులో పలు చిత్రాల్లో నటించి.. మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె .. మొదటిసారి తమిళంలో నటించింది. ప్రస్తుతం ఈమె విశ్వక్ సేన్ గామి సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలో ఈ మూవీ విడుదల కానుంది. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లలోను చాందిని మంచి పాత్రలు పోషిస్తుంది. ఇక మేఘ ఆకాష్ కూడా ఛల్ మోహనరంగ, గుర్తుందా శీతాకాలంతో పాటు తెలుగులో పలు చిత్రాల్లో నటించి ..మంచి పేరు తెచ్చుకుంది. ఇక నిన్నిలా నిన్నిలా మూవీతో అశోక్ సెల్వన్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లోను మంచి పాత్రలు చేస్తూ .. మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ ముగ్గురు నటీ నటులు .. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం వీరు నటించిన “సబా నాయగన్” .. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet