iDreamPost
android-app
ios-app

OTTలోకి మంజుమ్మెల్ బాయ్స్.. మలయాళ ఇండస్ట్రీని దున్నేసిన మూవీ ఇది!

Manjummel Boys OTT Release Date: మలయాళం ఇండస్ట్రీని దున్నేసిన సూపర్ హిట్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అనే దానిపై క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

Manjummel Boys OTT Release Date: మలయాళం ఇండస్ట్రీని దున్నేసిన సూపర్ హిట్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అనే దానిపై క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

OTTలోకి మంజుమ్మెల్ బాయ్స్.. మలయాళ ఇండస్ట్రీని దున్నేసిన మూవీ ఇది!

మంజుమ్మెల్ బాయ్స్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా మూవీ మీద బజ్ మాత్రం పోలేదు. ఫిబ్రవరి 22న రిలీజ్ అయిన ఈ మూవీ మార్చి 4 నాటికే రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. నెట్టింట్లో అయితే మా భాషలోకి రీమేక్ చేయండి.. మా భాషలోకి రీమేక్ చేయండి.. అంటూ డిమాండ్ల మీద డిమాండ్లు చేస్తున్నారు. తెలుగులోకి అయితే మంజుమ్మెల్ బాయ్స్ సినిమా వస్తోంది. ఆ విషయంపై మేకర్స్ క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ మీద కూడా నెట్టింట్లో పోరాటాలు జరుగుతున్నాయి.

మలయాళం ఇండస్ట్రీలో ఈ మంజుమ్మెల్ బాయ్స్ అనే సినిమా సృష్టిస్తున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కాదు. ఈ మూవీ రిలీజ్ అయిన 12 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ జోరు తగ్గలేదు. ఈ మూవీకి పాన్ ఇండియా లెవల్లో వచ్చిన, వస్తున్న బజ్ అంతా ఇంతా కాదు. ఈ రేంజ్ రెస్పాన్స్ తర్వాత ఈ మంజుమ్మెల్ బాయ్స్ ని తెలుగులో కూడా రిలీజ్ చేయాలనే డిమాండ్స్ వచ్చాయి. మేకర్స్ దానిపై క్లారిటీ కూడా ఇచ్చారు. మార్చి 15న ఈ మలయాళం బ్లాక్ బస్టర్ తెలుగులో విడుదల కాబోతోంది. ఇప్పుడు అంతా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూపులు మొదలు పెట్టారు. కొంతమంది అయితే డేట్స్ కూడా చెప్పేస్తున్నారు.

అయితే ఈ మంజుమ్మెల్ బాయ్స్ సినిమా ఓటీటీపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ మూవీ రెస్పాన్స్, బాక్సాఫీస్ వద్ద జోరు చూస్తుంటే.. ఇప్పుడల్లా ఓటీటీ ఎంట్రీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ మూవీ ఏప్రిల్ రెండో వారంలో ఓటీటీ ఎంట్రీ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. నార్మల్ ఓటీటీ లాకింగ్ పిరియడ్ చూసినా అదే సమయం అవుతుంది. కాబట్టి మంజుమ్మెల్ బాయ్స్ దాదాపుగా ఏప్రిల్ రెండో వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈలోపు తెలుగులో కూడా ఈ మూవీ రిలీజ్ అవుతోంది కాబట్టి. మలయాళం ఓటీటీ స్ట్రీమింగ్ సమయంలోనే తెలుగులో కూడా వచ్చే ఆస్కారం ఉంది. అయితే డబ్బింగ్ సినిమాలకు కూడా ఓటీటీ లాకింగ్ పిరియడ్ ఉంటే గనుక ఓటీటీలో తెలుగులో మంజుమ్మెల్ బాయ్స్ సినిమా రావడానికి టైమ్ పడుతుంది. అప్పుడు ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటివారంలో మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంటుంది.

కథ ఏంటంటే?:

కేరళకు చెందిన 11 మంది స్నేహితులు ఒక బృందంగా తమిళనాడు టూర్ కు వెళ్తారు. అక్కడ ఉన్న కొడకెనాల్ లోని గుణ కేవ్స్ ని చూసేందుకు వెళ్తారు. ఆ 11 మంది ఫ్రెండ్స్ లో ఒక వ్యక్తి ఆ గుణ కేవ్స్ లోని బిళంలో పడిపోతాడు. అతడిని రక్షించేందుకు సహాయక బృందాలు కూడా వెనకడుగు వేస్తాయి. కానీ, తమ స్నేహితుడిని రక్షించుకునేందుకు మిగిలిన పది మంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రయత్నాలు చేస్తారు. మరి.. ఆ ఫ్రెండ్ ని రక్షించారా? రెస్క్యూ టీమ్స్ కూడా వెనుకడుగు వేసేంత ప్రమాదం ఏముంది? అంత రిస్క్ తీసుకున్న వీళ్లు అనుకున్నది సాధించారా? అనేదే మంజుమ్మెల్ బాయ్స్ సినిమా కథ.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetMeritkingTimebetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobetjojobet girişbahiscasinoMadridbetMadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetcasibomgrandpashabet girişbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabet