Swetha
ఓటీటీలో వరుస సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి . ఈ క్రమంలో దేశాన్ని పాలించిన ఓ మాజీ ప్రధాని బయోపిక్ సినిమా థియేటర్ రిలీజ్ తర్వాత ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఓటీటీలో వరుస సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి . ఈ క్రమంలో దేశాన్ని పాలించిన ఓ మాజీ ప్రధాని బయోపిక్ సినిమా థియేటర్ రిలీజ్ తర్వాత ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
భారత దేశ మాజీ ప్రధాని, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‍పేయి గురించి అందరికి తెలిసిందే. అయితే, ఈ నేత జీవితాన్ని ఆధారంగా తీసుకుని.. తెరకెక్కిన సినిమా “మై అటల్ హూ”. ఈ సినిమాలో హిందీలో రూపొందించబడి.. జనవరి 19న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా థియేటర్స్ లో ఓ మోస్తరు వసూళ్లను సొంతం చేసుకుంది. కాగా ఈ చిత్రంలో ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి.. వాజ్‍పేయీ పాత్ర పోషించారు. ఇక ఇప్పుడు “మై అటల్ హూ” సినిమా థియరిట్రికల్ రన్ పూర్తి చేసుకుని.. ఓటీటీలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. మై అటల్ హూ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ సినిమా ఓటీటీ ఎంట్రీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
“మై అటల్ హూ సినిమా” రవి జాదవ్ దర్శకత్వం వహించారు. కాగా, వాజ్‍పేయీ క్యారెక్టర్లో పంకజ్ త్రిపాఠి నటించగా.. పియూష్ మిశ్రా, రాజా రమేశ్‍కుమార్, దయాశంకర్ పాండే, ప్రమోద్ పాఠక్, పాయల్ నాయర్, రాజేశ్ ఖత్రి, ఎక్లాక్ ఖాన్, హర్షద్ కుమార్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాను వినోద్ భానుశాలి, సందీప్ సింగ్, కమరేశ్ భానుశాలి నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఈ క్రమంలో “మై అటల్ హూ సినిమా” ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‍ను జీ5 ప్లాట్‍ఫామ్ వెల్లడించింది. మార్చి 14వ తేదీన ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్నీ ప్రకటిస్తూ “అద్భుతమైన దార్శనికత, నిర్ణయాలతో దేశానికి కొత్త దిశను అటల్ బిహారీ నిర్దేశించారు. మై అటల్ హూ మార్చి 14న జీ5లో ప్రీమియర్ అవుతుంది” అని జీ5 ప్లాట్‍ఫామ్ ట్వీట్ చేసింది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. మాజీ ప్రధాన మంత్రి, చాలా మంది ఇష్టపడే రాజకీయ నేత అయిన అటల్ బిహారీ వాజ్‍పేయి పాలనను, జీవితాన్ని ఈ చిత్రంలో.. కళ్ళకు కట్టినట్లు చూపించారు మేకర్స్. అంతేకాకుండా , ఆయన వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సవాళ్లు, కుటుంబం, స్నేహితులతో ఆయన బంధాలను కూడా ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు. దేశానికి నిస్వార్థ సేవ చేసిన వాజ్‍పేయీ ప్రస్థానాన్ని, ఉన్నత రాజకీయ విలువలు చూపిన ఆయన గురించి ఈ మూవీలో తెరకెక్కించారు. పైగా పాకిస్థాన్‍తో కార్గిల్ యుద్ధం, పోఖ్రాన్ అణు పరీక్ష సహా చాలా అంశాలు ఈ మూవీలో కవర్ చేశారు. ఇక అటల్ బీహారీ వాజ్‍పేయి విషయానికొస్తే.. ఆయన తన రాజకీయ ప్రస్థానంలో చాలా కీలక పదవులు చేపట్టారు. బీజేపీ అగ్రనేతగా వ్యవహరించారు. 1996లో స్వల్ప హయాం తర్వాత 1998 నుంచి 2004 వరకు దేశ ప్రధానిగా ఎన్నో సేవలు అందించారు. మరి, అలాంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర మీద తెరకెక్కిన ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిందే. మరి, “మై అటల్ హూ సినిమా” ఓటీటీ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.