iDreamPost
android-app
ios-app

Maa Oori Polimera 2 OTT: ఓటీటీలోకి పొలిమేర.. ఎప్పుడు? ఎక్కడంటే..

  • Published Dec 01, 2023 | 5:56 PM Updated Updated Dec 01, 2023 | 11:56 PM

Maa Oori Polimera 2 OTT Release Date: మా ఊరి పొలిమేర సినిమాకు ఓటీటీలో మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలోనే.. మా ఊరి పొలిమేర 2 చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేశారు. నవంబర్‌ 3న పొలిమేర 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Maa Oori Polimera 2 OTT Release Date: మా ఊరి పొలిమేర సినిమాకు ఓటీటీలో మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలోనే.. మా ఊరి పొలిమేర 2 చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేశారు. నవంబర్‌ 3న పొలిమేర 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

  • Published Dec 01, 2023 | 5:56 PMUpdated Dec 01, 2023 | 11:56 PM
Maa Oori Polimera 2 OTT: ఓటీటీలోకి పొలిమేర.. ఎప్పుడు? ఎక్కడంటే..

చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయాన్ని సాధించింది ‘మా ఊరి పొలిమేర’ సినిమా. ఓటీటీ అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. కేవలం మౌత్‌ పబ్లిసిటీతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సినిమా టీం ముందుగా అనుకున్నట్లే మా ఊరి పొలిమేర 2ను సిద్ధం చేసింది. పార్ట్‌ 1కు వచ్చిన ఆదరణ దృష్ట్యా పార్ట్‌ 2ను థియేటర్లలో విడుదల చేసింది. ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. థియేటర్లలో చిత్రానికి మంచి స్పందన వచ్చింది.

ప్రేక్షకులతో పాటు రివ్యూవర్లు కూడా మంచి రివ్యూలు ఇచ్చారు. మొదటి రోజే పాజిటవ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షం కురిపించింది. ఈ చిత్రం విడుదలయ్యి నాలుగు వారాలైనప్పటికీ ఇంకా విజయవంతంగా నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు దాదాపు 50 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డును తిరగరాసింది. ఇక, మా ఊరి పొలిమేర 2 థియేటర్లలో విడుదలై ఇప్పటికి నెల రోజులు కావస్తోంది. ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తూ ఉన్నారు.

మా ఊరి పొలిమేర 2 విషయంలో ఓటీటీ ప్రేక్షకుల ఎదురు చూపులకు బ్రేక్‌ పడ్డట్టు కనిపిస్తోంది. ఓటీటీ రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. సాధారణంగా ఓ కొత్త సినిమా థియేటర్లో రిలీజ్ అయి.. భారీ హిట్ కొట్టడమే ఆలస్యం.. ఆ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఆ సినిమా కి సంబంధించి ఓటీటీ అప్ డేట్స్ కోసం ఆరా తీస్తుంటారు. పొలిమేర 2 విషయంలోనూ అదే చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ తెలియడంతో.. ప్రేక్షకులందరూ ఎక్సైటెడ్‌గా ఫీలవుతున్నారు.

ఫ్యాన్సీ అమౌంట్‌కు ఈ మూవీని దక్కించుకున్న డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్.. డిసెంబర్ 8 నుంచి పొలిమేర 2ను ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్ అవుతోంది. అందర్నీ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తోంది. కాగా, ఈ సినిమాలో సత్యం రాజేశ్ , డా. కామాక్షీ భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళీ, బాలదిత్య ప్రధాన పాత్రల్లో నటించారు. ‘మా ఊరి పొలిమేర 2’కు డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. గౌరు గణబాబు సమర్పణలో గౌరీకృష్ణ మూవీని నిర్మించారు. మరి, మా ఊరి పొలిమేర 2 ఓటీటీ రిలీజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibomiptv satın alCasibom