iDreamPost
android-app
ios-app

OTTలోకి లవ్ రివేంజ్ డ్రామా.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..?

  • Published Feb 04, 2024 | 1:23 PM Updated Updated Feb 04, 2024 | 2:30 PM

ప్రేమ కథలను సినీ ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఇండస్ట్రీలో నెవ్వర్ ఎండింగ్ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అదీ లవ్ స్టోరీనే. పుంఖాను పుంఖాలుగా ప్రేమ కథలు తెరపైకి ఎక్కినా.. బోరు కొట్టించని విధంగా తీస్తే సినీ లవర్స్ హిట్ టాక్ ఇచ్చేస్తారు.. అందుకు ఈ మూవీ ఉదాహరణ. ఇది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రేమ కథలను సినీ ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఇండస్ట్రీలో నెవ్వర్ ఎండింగ్ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అదీ లవ్ స్టోరీనే. పుంఖాను పుంఖాలుగా ప్రేమ కథలు తెరపైకి ఎక్కినా.. బోరు కొట్టించని విధంగా తీస్తే సినీ లవర్స్ హిట్ టాక్ ఇచ్చేస్తారు.. అందుకు ఈ మూవీ ఉదాహరణ. ఇది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

  • Published Feb 04, 2024 | 1:23 PMUpdated Feb 04, 2024 | 2:30 PM
OTTలోకి లవ్ రివేంజ్ డ్రామా.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..?

వీకెండ్ వస్తుందంటే ఏ మూవీ ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని సెర్చ్ చేస్తున్నారు సినీ లవర్స్. సినిమా బాగుందని ఎవరైనా సజెష్ చేసినా.. అలాగే ఫ్రెండ్ సర్కిల్‌లో ఓ మూవీ గురించి పిచ్చాపాటిగా చర్చ జరుగుతున్నా.. ఏంటా ఆ పిక్చర్ అంటూ ఆరా తీస్తున్నారు. భాష తెలియకపోయినా.. డబ్బింగ్ వర్షన్ లేకపోయినా.. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌లో మేనేజ్ చేస్తున్నారు. లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌లపై ఓ లుక్ వేస్తున్నారు. ఈ వీక్ లో వచ్చిన సినిమాలు, సిరీస్ లను చూసేయాల్సిందే. ఎందుకంటే మళ్లీ వచ్చేవారం కొత్తవి వస్తాయి.. అవి చూడాలిగా మరీ. ఇప్పుడు అలాంటి లవ్ రివేంజ్ డ్రామా ఓటీటీలోకి వచ్చేసింది.

లవ్ మూవీస్‌కు యూత్‌లో ఎప్పుడూ క్రేజే. ఈ ప్రేమకథలను డిఫరెంట్‍గా తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. అలాంటి ఓ మూవీనే కైవా. ఇది కన్నడ సినిమా. ధన్ వీర్, మేఘా శెట్టి జంటగా తెరకెక్కిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 8న విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం కన్నడ వర్షన్‌లో మాత్రం లభ్యమౌతుండగా.. తెలుగు వర్షన్ వస్తుందా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు ప్రైమ్. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూసేయోచ్చు.  1980 బ్యాక్ డ్రాప్ లో ఉంటుందీ చిత్రం. హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి మధ్య ప్రేమ కథగా తెరకెక్కించాడు దర్శకుడు జయతీర్థ జయన్న.

ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే..1980లో కైవా (ధన్ వీర్) ఉపాధి వెతుక్కుంటూ బెంగుళూరుకు వస్తాడు. అక్కడ టైప్ రైటర్‌గా పనిచేస్తున్న సల్మా (మేఘా శెట్టి) ప్రేమలో పడతాడు. అయితే ఓ అపార్థం కారణంగా కైవా, సల్మాల ప్రేమ కథలో మలుపు చోటుచేసుకుంది. సల్మాపై ముగ్గురు దాడి చేస్తారు. ఆమెపై దాడి చేసే వ్యక్తులను మట్టుపెట్టాలని అనుకుంటాడు. అందుకు గోవిందన్న సహాయం తీసుకుంటాడు కైవా. సల్మాను పెళ్లి చేసుకుని.. ఆమెపై దాడి చేసిన ఇద్దర్ని చంపి.. పోలీసుల చేతికి చిక్కుతాడు. మరీ అతడు జైలు నుండి బయటకు వచ్చాడా లేదా.. ఇంతకు ఈ గోవిందన్న ఎవరూ అన్నదీ సినిమా చూస్తే తెలుస్తుంది. మరెందుకు ఆలస్యం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.. చూసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet