iDreamPost
android-app
ios-app

OTTలో మహా శివరాత్రి స్పెషల్ సినిమాలు.. ఇవి చూస్తూ జాగారం చేసేయచ్చు!

  • Published Mar 07, 2024 | 4:13 PM Updated Updated Mar 07, 2024 | 9:39 PM

Maha Shivaratri OTT Movies: మహాశివరాత్రి సందర్బంగా భక్తులంతా ఆరోజు రాత్రి .. భక్తి శ్రద్దలతో జాగారం చేస్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు టెక్నాలజీ మారుతూ వస్తుంది కాబట్టి .. ఈ జాగారాన్ని శివుడి సినిమాలను చూస్తూ చేసేయొచ్చు.

Maha Shivaratri OTT Movies: మహాశివరాత్రి సందర్బంగా భక్తులంతా ఆరోజు రాత్రి .. భక్తి శ్రద్దలతో జాగారం చేస్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు టెక్నాలజీ మారుతూ వస్తుంది కాబట్టి .. ఈ జాగారాన్ని శివుడి సినిమాలను చూస్తూ చేసేయొచ్చు.

  • Published Mar 07, 2024 | 4:13 PMUpdated Mar 07, 2024 | 9:39 PM
OTTలో మహా శివరాత్రి స్పెషల్ సినిమాలు.. ఇవి చూస్తూ జాగారం చేసేయచ్చు!

ఓటీటీ లలో ఉండే సినిమాల గురించి తెలుసుకోవడం అంటే .. ఎంత సేపు కొత్త సినిమాలే కాకుండా .. ఒకప్పటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల గురించి కూడా అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. టెక్నాలజీ ఎంత మారినా .. ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా .. పాత కాలం నాటి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు.. అందరికి ప్రత్యేకమే. ఈ క్రమంలోనే మహా శివరాత్రి సందర్బంగా .. ఓటీటీలో బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఈ మధ్య విడుదలైన శివుడిని కొలిచే సినిమాల వరకు.. ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి, ఏ ఏ ప్లాట్ ఫార్మ్ లో ఏ ఏ సినిమాలు ఉన్నాయో.. చూద్దాం.

సాధారణంగా మహా శివ రాత్రి పండుగ అంటే.. అందరు శివుడిని భక్తి శ్రద్దలతో పూజిస్తూ.. ఉపవాసం, జాగారం ఉంటూ ఉంటారు. ఒకప్పుడు జాగారం అంటే .. వీధి నాటకాలు , కథలు , కాలక్షేపాలు ఉండేవి .కానీ, ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు.. కళలు కూడా కనుమరుగైపోతున్నాయి. ఇక ఈ క్రమంలో ఇప్పుడు ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అంటే.. సినిమాలు. కాబట్టి, ఇప్పుడు ఓటీటీ లో .. మహా శివ రాత్రి జాగారం సందర్బంగా .. చూడదగిన సినిమాలేంటో చూద్దాం.

1) మహాభక్త సిరియాళ – డిస్నీ ప్లస్ హాట్ స్టార్

2) భక్త కన్నప్ప – అమెజాన్ ప్రైమ్/యూట్యూబ్

3) భక్త సిరియాళ – యూట్యూబ్

4) భక్త శంకర – డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలుగు

5) భక్త మార్కండేయ – యూట్యూబ్ (తెలుగు)/డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (కన్నడ)

6) శ్రీ మంజునాథ – ఎరోస్ నౌ ఓటీటీ/యూట్యూబ్

7) ఉమాచండీ గౌరీశంకరుల కథ – ఈటీవీ విన్/యూట్యూబ్

8) కాళహస్తి మహత్యం – యూట్యూబ్

9) శివలీలలు – యూట్యూబ్

10) దక్షయజ్ఞం – యూట్యూబ్

11) జగద్గురు ఆదిశంకర – యూట్యూబ్

12) మావూళ్లో మహాశివుడు – యూట్యూబ్

13) శివకన్య – ఎరోస్ నౌ ఓటీటీ /యూట్యూబ్

14) మహాశివరాత్రి – జీ5/యూట్యూబ్

15) శివరాత్రి మహత్యం – జియో సినిమా/యూట్యూబ్

ఈ సినిమాలు మాత్రమే కాకుండా .. ప్రపంచంలోని 18 శక్తి పీఠాలు గురించి చెప్పే.. “సర్వం శక్తిమయం” అనే వెబ్ సిరీస్ కూడా .. మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఈ వెబ్ సిరీస్ జీ5, ఆహా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ కు తెలుగు ప్రముఖ రచయిత, డైరెక్టర్ బీవీఎస్ రవి క్రియేటర్‌గా వ్యవహరించారు. కాగా ఈ సినిమాకు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఒక వ్యక్తి తన సమస్యల పరిష్కారానికి కుటుంబంతో కలిసి శక్తిపీఠాలు దర్శించుకుంటాడు. ఈ క్రమంలో ఎదురైన సమస్యలు, పరిస్థితులు, దేవుడి మీద కలిగిన నమ్మకం, అతనిలోని మార్పు ఏంటి! అనే అంశాల చుట్టూ ఈ సినిమా కథ ఉంటుంది. అంతే కాకుండా మరో వైపు .. దేవుడిపై నమ్మకం ఉంచకూడదు అనే పాయింట్‌తో బుక్ రాయడానికి వచ్చిన నాస్తికుడు.. ఆస్తికుడిగా ఎలా మారాడు అనే అంశాన్ని కూడా ఈ సినిమాలో చూపించారు. మరి, ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.