iDreamPost
android-app
ios-app

పెళ్లి తర్వాత మెగా కోడలు లావణ్య ఫస్ట్ వెబ్ సిరీస్.. త్వరలో స్ట్రీమింగ్!

  • Published Jan 03, 2024 | 5:18 PM Updated Updated Jan 03, 2024 | 5:21 PM

Lavanya Tripathi:సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తీసిన కొన్ని చిత్రాలతోనే ఫేమస్ అయిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే, కొంతమంది హీరోయిన్స్ వారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిపోతుంటారు. ప్రేక్షకులు కూడా అక్కడితో వారి కెరీర్ కు బ్రేక్ పడుతుందని భావిస్తారు. కానీ, ఆ హీరోయిన్స్ తిరిగి ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చి ఆడియన్సును సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు.

Lavanya Tripathi:సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తీసిన కొన్ని చిత్రాలతోనే ఫేమస్ అయిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే, కొంతమంది హీరోయిన్స్ వారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిపోతుంటారు. ప్రేక్షకులు కూడా అక్కడితో వారి కెరీర్ కు బ్రేక్ పడుతుందని భావిస్తారు. కానీ, ఆ హీరోయిన్స్ తిరిగి ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చి ఆడియన్సును సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు.

  • Published Jan 03, 2024 | 5:18 PMUpdated Jan 03, 2024 | 5:21 PM
పెళ్లి తర్వాత మెగా కోడలు లావణ్య ఫస్ట్ వెబ్ సిరీస్.. త్వరలో స్ట్రీమింగ్!

ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ బాగా నడుస్తోంది. వెండి తెరపైన నటించి బాగా పేరు తెచ్చుకున్న నటీ నటులు కూడా ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ప్రముఖ నటి నటులు నటించిన వెబ్ సిరీస్ లు ఓటీటీలలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రేక్షకులు కూడా వీటిని ఎంతగానో ఆదరిస్తున్నారు. దీనితో అటు సినీ తారలు కూడా వెబ్ సిరీస్ లలో నటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే, కొంతమంది హీరోయిన్స్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తరువాత నటించడానికి కాస్త గ్యాప్ తీసుకుంటారు. దీనితో ఇంకా వీరి హవా అయిపోయిందని భావిస్తారు ప్రేక్షకులు. కానీ, వారు తిరిగి తెరపైన కనిపించి ప్రేక్షకులకు ఊహించని సర్ప్రైజ్ ను అందిస్తారు. ఈ క్రమంలోనే మెగా వారి కోడలు పెళ్లి తరువాత తిరిగి ఆడియన్సును ఓటీటీ ద్వారా అలరించనుంది.

ఇటీవల మెగా వారి ఫ్యామిలిలో కోడలిగా అడుగుపెట్టింది లావణ్య త్రిపాఠి. మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్1న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా సన్నిహితుల మధ్య ఇటలీలో జరిగింది. అయితే, లావణ్య త్రిపాఠి చివరిగా ‘పులి మేక’ అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. ఆ తర్వాత ఈ అమ్మడు ఎటువంటి చిత్రాలలోనూ కనిపించలేదు. కొంత కాలం తర్వాత హీరో వరుణ్ తేజ్ ను వివాహం చేసుకుని.. మళ్ళీ అభిమానులకు దర్శనమిచ్చింది ఈ భామ. గత కొంతకాలంగా ఎటువంటి చిత్రాల్లో కనిపించకపోవడం, ఇక ఇప్పుడు వివాహం కూడా జరగడంతో.. లావణ్య ఇండస్ట్రీకి దూరం అయిపోతుందనుకున్నారు ప్రేక్షకులు.

అలానే, లావణ్య కూడా పెళ్లి తర్వాత వారి వైవాహిక జీవితానికి.. సంబంధించిన ఫోటోలను మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. తన నెక్స్ట్ అప్ డేట్ గురించి ఎప్పుడు చర్చించలేదు. కానీ, నిజానికి ఈ బ్యూటీ పెళ్లి తరువాత భర్తతో , కుటుంబంతో సమయాన్ని గడపడం కోసం కెరీర్ నుంచి చిన్న బ్రేక్ తీసుకుంది. ఆమె తాజాగా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ ని బట్టి, తిరిగి తెరపైన కనిపించనుందని అనిపిస్తోంది. ఆమె ఈ కొత్త సంవత్సరాన్ని ఒక పర్ఫెక్ట్ నోట్ తో ప్రారంభిస్తున్న అంటూ.. తాను నటిస్తున్న వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది.

కాగా, ఈ వెబ్ సిరీస్ పేరు”మిస్ పర్ఫెక్ట్” . పైగా, ఈ సిరీస్ లో లావణ్యనే లీడ్ రోల్ గా చేస్తుందనే సమాచారం వినిపిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో పరిచయం అయ్యి.. బిగ్ బాస్ లో విన్నర్ గా నిలిచినా అభిజిత్, లావణ్యకు జంటగా నటించనున్నాడు. ప్రస్తుతం లావణ్య చేతిలో ఈ వెబ్ సిరీస్ కాకుండా ‘తనల్’ అనే మరో తమిళ చిత్రం మాత్రమే ఉంది. వేరే ఏ ప్రాజెక్ట్స్ ను ఈ అమ్మడు ఒపుకోవట్లేదంట. మరి, ఈ ఆ తర్వాత తన సినీ కెరీర్ ను కొనసాగిస్తుందా లేదా అనే సందేహాలు ప్రేక్షకులలో మొదలయ్యాయి. ఏదేమైనా, పెళ్లి తర్వాత లావణ్య నటించబోతున్న ఫస్ట్ వెబ్ సిరీస్ కాబట్టి.. ఆడియన్సు కాస్త ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి, లావణ్య త్రిపాఠి షేర్ చేసిన “మిస్ పర్ఫెక్ట్” ఫస్ట్ లుక్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom