iDreamPost
android-app
ios-app

అఫీషియల్: కీడాకోలా OTT రిలీజ్ డేట్ వచ్చేసింది..

  • Published Dec 19, 2023 | 8:32 PM Updated Updated Dec 19, 2023 | 8:32 PM

Keedaa Cola OTT Release Date: తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గానే కాకుండా.. యాక్టర్ గా కూడా మెప్పించిన చిత్రం కీడా కోలా. ఈ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతోంది.

Keedaa Cola OTT Release Date: తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గానే కాకుండా.. యాక్టర్ గా కూడా మెప్పించిన చిత్రం కీడా కోలా. ఈ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతోంది.

  • Published Dec 19, 2023 | 8:32 PMUpdated Dec 19, 2023 | 8:32 PM
అఫీషియల్: కీడాకోలా OTT రిలీజ్ డేట్ వచ్చేసింది..

తరుణ్ భాస్కర్.. ఒక డైరెక్టర్ గానే కాకుండా ఒక యాక్టర్ గా కూడా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. తరుణ్ భాస్కర్ సినిమాలు అన్నీ యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగానే ఉంటాయి. తాజాగా కీడా కోలా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ సినిమాలో కీలక పాత్రలో నటించి తన యాక్టింగ్ స్కిల్స్ తో అందరినీ మెస్మరైజ్ చేశాడు. కీడా కోలా సినిమాకు తెలుగు సినిమా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. థియేటర్లో మూవీ మిస్ అయినవాళ్లు మాత్రమే కాదు.. మూవీ చూసిన వాళ్లు కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆ డేట్ రానే వచ్చింది.

బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు, విష్ణు ఓయ్, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో ఈ కీడా కోలా సినిమా తెరకెక్కింది. ఇది ఫుల్ లెంగ్త్ కామెడీ థ్రిల్లర్. మీరు ఓపెనింగ్ షాట్ నుంచి క్లోజింగ్ షాట్ వరకు నవ్వుతూనే ఉంటారు. అంతేకాకుండా ఈ మూవీలో ట్విస్టులు కూడా గట్టిగానే ప్లాన్ చేశారు. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న చైతన్యరావు, రాగ్ మయూర్… బ్రహ్మానందం కోసం కొన్న కూల్ డ్రింక్ బాటిల్ లో ఒక బొద్దింక వస్తుంది. ఆ బాటిల్ ను చూపించి కంపెనీ నుంచి రూ.5 కోట్లు పరిహారం పొందాలని ప్లాన్ చేస్తారు. అయితే అసలు వారికి ఆ డబ్బు దక్కిందా? వీళ్ల కథలోకి తరుణ్ భాస్కర్, జీవన్ ఎలా వస్తారు? అసలు వీళ్లు అనుకున్న డబ్బుని పొందగలిగారా? లేదా అనే అశంతో ఈ కథ ముందుకు సాగుతుంది. అయితే మూవీలో ఎన్నో గొప్ప గొప్ప సీన్స్ ఉంటాయి. ఉదాహరణకు తరుణ్ భాస్కర్ ఓ సీన్ లో బూతులు తిడుతూ ఉంటే.. బీప్ వేయాల్సిన అవసరం లేకుండా టాప్ తెలుగు సాంగ్ ని వాడిన తీరు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తుంది.

ఒక పాత్ర గొంతు చించుకుని ఆవేశాన్ని వెల్లగక్కుతూ ఉంటే.. మీరు పొట్ట పట్టుకుని నవ్వుతూ ఉంటారు. ఇలాంటి సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. నవంబరు 3న ఈ మూవీ రిలీజ్ అయినప్పటికీ ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. ఇంకా ఎప్పుడు వస్తుందంటూ ప్రేక్షకులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ అధికారిక వివరాలను వెల్లడించారు. ఈ మూవీ ఓటీటీ పార్టనర్ ఆహా. డిసెంబర్ 29 నుంచి కీడా కోలా సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానున్న విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అలాగే ఆహా గోల్డెన్ సబ్ స్క్రిప్షన్ ఉన్న యూజర్స్ కు కీడా కోలా సినిమా ఒకరోజు ముందుగానే అంటే.. డిసెంబర్ 28 నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. మరి.. ఎట్టకేలకు కీడా కోలా సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio