iDreamPost
android-app
ios-app

ఆర్నెళ్ల తర్వాత ఓటీటీలోకి హనీరోజ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Mar 06, 2024 | 11:25 AM Updated Updated Mar 06, 2024 | 11:25 AM

Honey Rose Film Streaming OTT: ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ రంగంలో ఓటీటీ హవా కొనసాగుతుంది. భాషతో సంబంధం లేకుండా కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ సందడి చేస్తున్నాయి.

Honey Rose Film Streaming OTT: ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ రంగంలో ఓటీటీ హవా కొనసాగుతుంది. భాషతో సంబంధం లేకుండా కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ సందడి చేస్తున్నాయి.

  • Published Mar 06, 2024 | 11:25 AMUpdated Mar 06, 2024 | 11:25 AM
ఆర్నెళ్ల తర్వాత ఓటీటీలోకి హనీరోజ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఎంటర్టైన్మెంట్ విషయంలో ఇప్పుడు నయా ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు ధియేటర్ల వద్ద బారులు తీరిన జనం ఉండేవారు.. కానీ ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో కూర్చుని ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ చూసే అవకాశం లభిస్తుంది. దీంతో చాలా మంది ఓటీటీకే జై కొడుతున్నారు. భారతీయ చిత్రాలు మాత్రమే కాదు.. ఇతర భాషా చిత్రాలు, వెబ్ సీరీస్ వారం వారం ఓటీటీలో సందడి చేస్తున్నాయి. క్రైమ్, హర్రర్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా ఎన్నో వెబ్ సీరీస్, మూవీస్ ఓటీటీల ప్రత్యక్షమవుతున్నాయి. ఈ మధ్య కొన్ని నిర్మాణ సంస్థలు డైరెక్ట్ గా ఓటీటీలోనే తమ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఓటీటీలోకి మాలీవుడ్ అందాల భామ హనీరోజ్ నటించిన పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ రాబోతుంది. స్ట్రీమింగ్ ఎక్కడ అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ రంగంలో పెను మార్పులు వచ్చాయి. భాషతో సంబంధం లేకుండా సినీ ప్రేమికులు తమకు ఇష్టమైన సినిమాలు తెగ చూసేస్తున్నారు. ఏ భాషలో తీసినా సరే ఆ మూవీస్ డబ్బంగ్ చేసి ఇతర భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల మాలీవుడ్ సినిమాలు ఎక్కువగా ఇతర భాషల్లోకి డబ్బింగ్ అవుతున్నాయి. తాజాగా మరో మాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ లోకి వచ్చేస్తుంది. మాలీవుడ్ లో తెరకెక్కించిన చిత్రం రాణి : ది రియల్ స్టోరీ సెప్టెంబర్ 2023 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేరళాలో ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్దమైంది. మార్చి 7న మనోరమ మ్యాక్స్ లో ఈ చిత్రం స్ట్రిమింగ్ కాబోతుందని మేకర్స్ సోషల్ మీడియాలో అఫిషియల్ గా ప్రకటించారు. ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతం ఈ మూవీ మలయాళ ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులో ఉండబోతుంది.

శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహంచిన ఈ చిత్రం పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఓ పాపులర్ పొలిటికల్ లీడర్ ని పనిమనిషి హత్య చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆమె జీవితంతో ఎన్నో ఊహించని మలుపులు జరుగుతుంటాయి. ఈ చిత్రంలో మాలీవుడ్ బ్యూటీ భువనతో పాటు అందాల భామ హనీరోజ్ అద్భుతంగా నటించింది. భువన, గురు సోమసుందరం, ఇంద్రస్, అశ్విన్ గోపినాథ్, అశ్వత్ లాల్ , నియత కాదంబి, మాలా పార్వతి, భావన, అనుమోల్,ఊర్వశి ముఖ్య పాత్రల్లో నటించారు. ఆర్నెళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న ఈ చిత్రం చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvoleKingroyal girişcasibomgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobetMatadorbetMeritking