iDreamPost
android-app
ios-app

ఆరు వారాలుగా ఓటీటీలో ట్రెండ్ అవుతున్న థ్రిల్లర్ మూవీ! మీరు చూశారా?

  • Author Soma Sekhar Published - 04:13 PM, Sat - 18 November 23

ఓ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో గత ఆరు వారాలుగా ట్రెండింగ్ లోనే ఉంది. మరి ఆ థ్రిల్లర్ మూవీని మీరు చూశారా? ఆ మూవీ ఏంటి? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఓ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో గత ఆరు వారాలుగా ట్రెండింగ్ లోనే ఉంది. మరి ఆ థ్రిల్లర్ మూవీని మీరు చూశారా? ఆ మూవీ ఏంటి? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 04:13 PM, Sat - 18 November 23
ఆరు వారాలుగా ఓటీటీలో ట్రెండ్ అవుతున్న థ్రిల్లర్ మూవీ! మీరు చూశారా?

ఓటీటీలు సినిమా రంగంలోకి ప్రవేశించాక.. ఆడియెన్స్ రెండు విభాగాలుగా విడిపోయారు. థియేటర్ ఫ్యాన్స్, ఓటీటీ ఫ్యాన్స్ గా మారిపోయారు. థియేటర్లో ప్రేక్షకులను నిరాశపరిచిన చిత్రాలు ఓటీటీలో అదరగొట్టిన సందర్భాలు ఇండస్ట్రీలో కోకొల్లలుగా ఉన్నాయి. ఇక ఇంకొన్ని మూవీస్ ఇటు థియేటర్లో అటు ఓటీటీలో దుమ్మురేపాయి. అయితే వెబ్ సిరీస్ లకు ప్రత్యేకించి ఫ్యాన్ బేస్ ఉంది ఈ రంగంలో. ఇదిలా ఉండగా.. ఓ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో గత ఆరు వారాలుగా ట్రెండింగ్ లోనే ఉంది. మరి థ్రిల్లర్ మూవీని మీరు చూశారా? ఆ మూవీ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఓటీటీ.. సినిమా ఇండస్ట్రీని ఓ కుదుపు కుదుపేసిన సరికొత్త ఆవిష్కరణ. ఓటీటీలు వచ్చిన దగ్గరి నుంచి ప్రేక్షకులు సినిమా చూసే విధానం మార్చుకున్నారు. ఎన్నుకోని మరీ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడ్డం మెుదలుపెట్టారు. ఇక ఫ్లాట్ ఫామ్స్ లో థ్రిల్లర్, హార్రర్ మూవీస్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ జోనర్ లో వచ్చిన చిత్రాలు ఓటీటీల్లో అత్యధిక వ్యూస్ సాధిస్తూ.. ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. అలాంటి ట్రెండింగ్ లో ఉన్న ఓ సినిమాని మీరు చూశారా? అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ‘హర్ చాప్టర్ 1’ చిత్రం గత ఆరు వారాలుగా టాప్ 10లో ఉంటూ.. ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ మూవీలో రుహానీ శర్మ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన కథ విషయానికి వస్తే.. సిటీలో జరిగిన హత్యలకు, గతంలో తన ప్రియుడిని పోగొట్టుకున్న కేసుకి లింక్ ఉండటం, ఆ లింక్ ఏంటి? వాటిని ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్నదే సినిమా. ఈ పిక్చర్ ను చాలా గ్రిప్పింగ్ గా తెరకెక్కించాడు దర్శకుడు శ్రీధర్ స్వరాఘవన్. ఏసీపీ అర్చనగా రుహాని శర్మ నటన అందరిని కట్టిపడేస్తుంది. ఈ పాత్రలో నటనకు గాను.. ఆమెపై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. క్లైమాక్స్ కూడా ఎంతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా, రెండో పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకుడు ఎదురుచూసేలా ముగిసింది. ఈ సినిమాకు ఓటీటీ ప్రేమికులు నీరాజనాలు పలుకుతున్నారు. అందుకే ఆరు వారాలుగా ట్రెండ్ అవుతూనే ఉంది. మరి ఈ మూవీని మీరు చూశారా? చూడకపోతే ఇంకెందుకు లేట్.. చూసేయండి మరి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom