iDreamPost
android-app
ios-app

హనుమాన్ ఓటీటీ లేటెస్ట్ రికార్డ్

  • Published Mar 23, 2024 | 1:15 PM Updated Updated Mar 23, 2024 | 1:15 PM

Hanuman: ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ధియెట్రికల్ రిలీజ్ అయ్యాక రెండు నెలలకి ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది.

Hanuman: ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ధియెట్రికల్ రిలీజ్ అయ్యాక రెండు నెలలకి ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది.

  • Published Mar 23, 2024 | 1:15 PMUpdated Mar 23, 2024 | 1:15 PM
హనుమాన్ ఓటీటీ లేటెస్ట్ రికార్డ్

యువ హీరో తేజ సజ్జా, నటి అమృత అయ్యర్ ప్రధాన పాత్రలలో నటించగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తాజా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్. ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ధియెట్రికల్ రిలీజ్ అయ్యాక రెండు నెలలకి ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టినట్లు హనుమాన్ సినిమా ఓటీటీలో కూడా అదే ట్రెండ్ ను కొనసాగిస్తుంది.

ప్రముఖ ఫ్లాట్ ఫారమ్ జీ5 లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే మిలియన్ నిమిషాల పాటు ప్లే అయి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం అదే ఫ్లాట్ ఫారమ్ లో రికార్డుల పరంపర కొనసాగిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా ఐదు రోజుల్లోనే 200 మిలియన్ నిమిషాల మార్కును దాటేసింది. ఏది ఏమైనప్పటికీ, సినిమా యునానిమస్ హిట్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రం త్వరలో ఇతర దక్షిణాది భాషల్లో కూడా విడుదల కానుంది. మరి అన్ని భాషలను కలుపుకుని ఓటీటీలో హనుమాన్ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన హనుమాన్, మహేష్ బాబు గుంటూరు కారం వంటి పెద్ద సినిమాతో పోటీ పడి మరీ గెలిచింది. హిందీ వెర్షన్లో కూడా 62 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన హనుమాన్… ఓవర్సీస్ లో కూడా 57 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చందమామ కథలని గుర్తుకు తెచ్చే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులని విపరీతంగా అలరించింది. అంజనాద్రి అనే గ్రామం సెట్ చేసిన తీరు, అద్భుతమైన గ్రాఫిక్స్ తో పాటు తేజ సజ్జ, వరలక్ష్మీ శరత్ కుమార్ ల నటన కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇక చివరిలో సాక్షాత్తు హనుమంతుడు ప్రత్యక్షమయ్యే సన్నివేశానికి అయితే థియేటర్లో ప్రతి ఒక్కరూ గగుర్పొడిచే స్థాయిలో స్పందన వచ్చింది అంటే అది అతిశయోక్తి కానే కాదు.