Venkateswarlu
HanuMan OTT Streaming Platform & Satellite Rights: హనుమాన్ మూవీ అన్ని అడ్డంకులు దాటుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది. జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
HanuMan OTT Streaming Platform & Satellite Rights: హనుమాన్ మూవీ అన్ని అడ్డంకులు దాటుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది. జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
Venkateswarlu
దేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ‘హనుమాన్’ మూవీ శుక్రవారం విడుదలైంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు హనుమాన్ స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడుతోంది.
ఆన్‌లైన్ సినిమా టికెట్స్ బుకింగ్ సైట్ బుక్ మై షోలో ‘గుంటూరు కారం’ సినిమాకు మించి ‘హనుమాన్’కు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా హనుమాన్ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇక, అసలు విషయానికి వస్తే.. హనుమాన్ విడుదలకు ముందే ఓటీటీ, శాటిలైట్ పార్ట్‌నర్స్ ఫిక్స్ అయ్యాయి. హనుమాన్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ జీ 5’లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇక, శాటిలైట్ పార్ట్‌నర్ విషయానికి వస్తే.. జీ టీవీలో హనుమాన్ ప్రసారం కానుంది.
అయితే, స్ట్రీమింగ్, టీవీ ప్రసారానికి సంబంధించి తేదీలు ఖరారు కాలేదు. హనుమాన్ థియేటర్లలోకి వచ్చిన నెల రోజుల తర్వాత ఓటీటీకి వచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో వచ్చే రెస్పాన్స్‌ను బట్టి ఈ తేదీ అటు,ఇటు అయ్యే అవకాశం కూడా ఉంది. ఓటీటీకి వచ్చిన తర్వాతే టీవీలో ప్రసారం కానుంది. కాగా, హనుమాన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించినట్లు తెలుస్తోంది. ఆయన ఆంజనేయస్వామి పాత్రలో కనిపించనున్నారట.
దీనిపై ప్రశాంత్ వర్మ్‌ను ప్రశ్నించగా.. ట్రైలర్‌లో చూపించిన కళ్లు చిరంజీవివేనని ఒప్పుకున్నారు. అయితే, ఆయనను ఎలా చూపించబోతున్నారని మాత్రం చెప్పలేదు. దీంతో మెగాఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు! జనవరి 8వ తేదీన జరగనున్న హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన విషయం తెలిసిందే. మొత్తానికి ధియేటర్లలో హనుమాన్ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది.. పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ సాధిస్తుందని అంటున్నారు. మరి, హనుమాన్ మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతోందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.