Swetha
గుంటూరు కారం చిత్రానికి సంబంధించి నిత్యం నెట్టింట ఎదో ఒక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అభిమానులకు ఆనందం కలిగించే మరో వార్త సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తోంది.
గుంటూరు కారం చిత్రానికి సంబంధించి నిత్యం నెట్టింట ఎదో ఒక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అభిమానులకు ఆనందం కలిగించే మరో వార్త సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తోంది.
Swetha
థియేటర్ లో విడుదల అయిన ప్రతి చిత్రం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో అడుగు పెట్టాల్సిందే. అయితే, ఈ మధ్య కాలంలో ఇలా థియేటర్ లో విడుదల అయిన చిత్రాలు ఓటీటీలోకి అడుగుపెట్టేటపుడు.. ఆ సినిమాకు సంబందించిన ఎక్స్ట్రా సీన్స్ ను యాడ్ ఆన్ చేస్తూ విడుదల చేస్తున్నారు. ఇటీవల థియేటర్ లో భారీ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఓ చిత్రం కూడా ఇలానే ఓటీటీలో ఎక్స్ట్రా సీన్స్ ను యాడ్ చేసి విడుదల చేశారు. ఇక ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” చిత్రానికి సంబంధించి కూడా ఇదే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. అయితే, ఓటీటీలో విడుదల చేసేటపుడు.. థియేటర్ వెర్షన్ కు మరో రెండు ఆసక్తికరమైన సన్నివేశాలను యాడ్ చేసి.. ఆడియన్సు ముందుకు తీసుకువస్తారని సమాచారం.
త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం “గుంటూరు కారం”. అయితే, ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి ఏవో ఒక విమర్శలు ఈ చిత్రాన్ని చుట్టుముడుతూనే ఉన్నాయి. ఏదేమైనా మొదటి రోజు మిక్సడ్ టాక్ సంపాదించుకున్నా సరే .. రోజులు గడుస్తున్నా కొద్దీ ఫ్యామిలీ ఆడియన్సు నుంచి పాజిటివ్ టాక్ నే సంపాదించుకుంది. పైగా 18 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 240 కోట్ల వరకు గ్రాస్‌ను 122 కోట్లకుపైగా షేర్ వసూళ్లను రాబట్టింది. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా ఏపీ, తెలంగాణలోని చాలా ప్రాంతాలలో గుంటూరు కారం మూవీ లాభాల్లోకి అడుగుపెట్టింది. ఇక నైజాం ప్రాంతంలో దాదాపు నలభై కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ.. ఇప్పటివరకు 34 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇకపోతే వరల్డ్ వైడ్‌గా దాదాపు 135 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది “గుంటూరు కారం”. మరి ఈ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టాలంటే మరో పన్నెండు కోట్లకుపైగా వసూళ్లను సాధించాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటివరకు థియేటర్ లో సందడి చేసిన “గుంటూరు కారం”..త్వరలో ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించనుంది. ఈ క్రమంలో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఒక ఆసక్తికర వార్త సామజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తోంది. థియేటర్ వర్షన్ లో నిడివి ఎక్కువ కావడంతో.. అమ్మ సెంటిమెంట్ తో ఉన్న ఒక సాంగ్ ను, కబడ్డీ ఫైట్ యాక్షన్ సీన్ ను కట్ చేశారట. అయితే, ఇప్పుడు ఓటీటీలో ఈ రెండు సీన్స్ ను కూడా యాడ్ చేసి రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసింది. వీటిలో ముఖ్యంగా కబడ్డీ ఫైట్ సీన్ ఫ్యాన్స్ కు ఎక్కువగా నచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ చిత్రం ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. మహేష్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ వలన.. థియేటర్ లో విడుదలకు ముందే.. నలభై కోట్లకు నెట్‌ఫ్లిక్స్ గుంటూరు కారం డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఇక ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో “గుంటూరు కారం” స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ రిలీజ్ డేట్ పై అధికారికంగా ప్రకటన ఇవ్వనున్నారు.
ఇక త్వరలో గుంటూరు కారం సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. గతంలో మహేష్ ఇంటి వద్ద జరిగిన మీట్ లో దర్శకుడు త్రివిక్రమ్ మిస్ అయిన కారణంగా.. మరోసారి సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఆ తరువాత మహేష్ దర్శకుడు ధీరుడు రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్‌పైకి రానుంది. ఇప్పటికే మహేష్ రాజమౌళి కాంబినేషన్ మీద అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం కొంతకాలం వెయిట్ చేయక తప్పదు. మరి, ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న “గుంటూరు కారం” చిత్రానికి.. ఎక్స్ట్రా రెండు సీన్స్ ను యాడ్ చేసి విడుదల చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.