Venkateswarlu
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ‘‘ గేమ్ ఆఫ్ థ్రోన్స్’’ తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంలో ...
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ‘‘ గేమ్ ఆఫ్ థ్రోన్స్’’ తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంలో ...
Venkateswarlu
ఓటీటీ కంటెంట్‌ను ఫాలో అయ్యేవారికి ‘‘ గేమ్ ఆఫ్ థ్రోన్స్’’ వెబ్ సిరీస్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ షోకు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ఉంది. తెలుగు నాట కూడా ఈ షోను ఫాలో అయ్యే వారు వేల సంఖ్యలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రతీ సీజన్, ప్రతీ ఎపిసోడ్ ఒకదాన్ని మించి ఒకటి ఉండటంతో షోకు అడిక్ట్ అయిపోయారు. కొత్త సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే, ఈ షో ఇప్పటి వరకు ఇంగ్లీష్ భాషలోనే అందుబాటులో ఉంది.
తెలుగులో ఈ షో చూసే వారికి భాష చాలా ఇబ్బందిగా మారింది. ఈ షో తెలుగులో వస్తే బాగుండు అనుకుంటూ ఉన్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ తెలుగు ప్రేక్షకుల ప్రార్థనలు ఫలించాయి. ఈ షో తెలుగులో అందుబాటులోకి వచ్చింది. నిన్నటి నుంచే జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. దీంతో షో ప్రేమికులు పండుగ చేసుకుంటున్నారు. మాతృ భాషలో మ్ ఆఫ్ థ్రోన్స్ చూసే అవకాశం కలిగినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గేమ్ ఆప్ థ్రోన్స్ షో ఓ ఫాంటసీ షో. 2011లో హెచ్‌బీవోలో మొదటి సారి ఈ షో ప్రారంభం అయింది.
అప్పట్లో ఈ టీవీ సిరీస్ పెను సంచలనాన్ని సృష్టించాయి. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఈ షో ప్రసారం అయింది. మొత్తం 73 ఎపిసోడ్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దాదాపు మూడేళ్ల తర్వాత కొత్త సీజన్ స్టార్ట్ అయింది. ‘‘ హౌజ్ ఆఫ్ డ్రాగన్స్’’ పేరిట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్.. హౌజ్ ఆప్ డ్రాగన్స్ సిరీస్‌లకు సంబంధించిన అన్ని ఇంగ్లీష్ ఎపిసోడ్స్ అమెజాన్ ప్రైమ్.. గూగుల్ ప్లే, ఉడు, నెట్లోఫ్లిక్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ షోకు మంచి రేటింగ్ ఉంది.
కొన్ని రేటింగ్ సంస్థలు ఈ షోకు 9కిపైగా రేటింగ్ ఇచ్చాయి. ఆడియన్స్ రేటింగ్ విషయంలోనూ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రికార్డు సృష్టించింది. కాగా, గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కు మార్క్ మైలాడ్, అలెక్స్ గ్రేవ్స్, డేవిడ్ నట్టర్, మిగువల్ సపోచినిక్, అలిక్ సకరోవ్, జెరిమీ పొడెశ్వా, అలన్ టేలర్, డేనియల్ మినహాన్‌లు దర్శకత్వం వహించారు. ఎమెలియా క్లార్కే, సోఫీ టర్నెర్, మైసీ విలియమ్స్, కిట్ హరింగ్టన్, లేనా హెడే, నటాలియా డార్మర్, పెడ్రో పాస్కల్, పీటర్ డింగ్లేగ్‌లు నటించారు. మరి, ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అయిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ తెలుగులో అందుబాటులోకి రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Finally Here it’s Telugu…🤩#GameOfThrones pic.twitter.com/bKPumc9aP4
— 𝐊𝐚𝐥𝐲𝐚𝐧 𝐏𝐚𝐰𝐚𝐧𝐢𝐬𝐭 (@Pkalyan_12) November 6, 2023