iDreamPost
android-app
ios-app

Gaami OTT: OTTలోకి గామి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

  • Published Mar 27, 2024 | 11:49 AM Updated Updated Mar 27, 2024 | 11:49 AM

విశ్వేక్ సేన్ కెరీర్ లోనే.. బెస్ట్ మూవీ గా నిలిచిన "గామి" సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది. మరి.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఏ ప్లాట్ ఫార్మ్ సొంతం చేసుకుంది. ఎప్పటి నుంచి గామి సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూద్దాం.

విశ్వేక్ సేన్ కెరీర్ లోనే.. బెస్ట్ మూవీ గా నిలిచిన "గామి" సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది. మరి.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఏ ప్లాట్ ఫార్మ్ సొంతం చేసుకుంది. ఎప్పటి నుంచి గామి సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూద్దాం.

  • Published Mar 27, 2024 | 11:49 AMUpdated Mar 27, 2024 | 11:49 AM
Gaami OTT: OTTలోకి గామి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

సాధారణంగా ఏ సినిమాలైనా ఆయా సినిమాల కలెక్షన్స్, థియేట్రికల్ రన్ పూర్తయ్యాక.. నెల రోజుల తర్వాత ఓటీటీలో దర్శనం ఇస్తూ ఉంటాయి. ఇక కొన్ని సినిమాలైతే నెల రోజుల లోపే ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పటికే థియేటర్ లో రిలీజ్ అయిన ఎన్నో సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి. అలాగే, థియేటర్ లో రిలీజ్ సక్సెస్ కానీ సినిమాలు కూడా ఓటీటీ లో మంచి వ్యూవర్ షిప్ తో దూసుకుపోతుంటాయి. ఇక థియేటర్ లో కొన్ని సినిమాలను మిస్ అయిన వారు .. ఆయా సినిమాల ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా .. ఓటీటీ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరి ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఏ ప్లాట్ ఫార్మ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుంది. అనే విషయాలను చూసేద్దాం.

విశ్వక్ సేన్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచిన సినిమా “గామి”. ఈ సినిమాకు విధ్యాద‌ర్ కాగిత ద‌ర్శ‌కుడిగా వ్యవహరించాడు. “గామి” సినిమాతోనే ఈ దర్శకుడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. క్రౌడ్ ఫండింగ్ విధానంలో ఈ సినిమా షూటింగ్ దాదాపు.. ఆరేళ్ళ పాటు కొనసాగింది. కాగా, ఈ సినిమాలో చాందిని చౌదరి, అభియ‌న ముఖ్య పాత్ర‌లు పోషించారు. గామి సినిమా విడుదలైన మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. విశ్వక్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా గామి నిలిచిపోయింది. ఇక ఇప్పుడు గామి సినిమా సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఓటీటీ ఎంట్రీకి రెడీ అయినట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5నుంచి.. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డం భాష‌ల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతున్నారు.

Gaami Into OTT

ఇక గామి సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా మూడు కథలతో పార్లెల్ గా రన్ అవుతూ ఉంటుంది. విశ్వక్ సేన్ ఈ సినిమాలో ఒక అఘోరా. ఓ సమస్య కారణంగా అతని ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. దాని నుంచి బయటపడడానికి .. 36 ఏళ్ల‌కు ఒక్క‌సారి పూసే మాలిప‌త్రి అనే ఔష‌ద మొక్క అతనికి అవసరం. దీనితో అతను హిమాలయాలకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. మరోవైపు.. అభిన‌య‌.. తన కూతురిని దేవ‌దాసి వృత్తిలోకి తీసుకురావాల‌ని అనుకుంటుంది. కానీ తన కూతురికి ఆ వృత్తి నచ్చదు. ఇక మరోవైపు ఇండియా, చైనా బోర్డ‌ర్‌లోని ఓ మెడిక‌ల్ రీసెర్చ్ సెంట‌ర్‌లో ఓ యువ‌కుడు బందీగా ఉంటాడు. ప్రయోగాల పేరుతో అతడిని.. చిత్రహింసలు పెడుతూ ఉంటారు. దాని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని అతను ప్రయత్నిస్తూ ఉంటాడు. అసలు ఈ మూడు కథలకు సంబంధం ఏమిటి! చాందిని చౌదరి పాత్ర ఎలా ఉంటుంది! విశ్వక్ సేన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అనేవి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి గామి సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.