OTT లో ఈ 5 బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇంకా చూడలేదా !!

OTTలో నిత్యం సినిమాల జాతర జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఒకవేళ ఈ తెలుగు డబ్బింగ్ మలయాళీ సినిమాలను కనుక మిస్ అయితే ఓ లుక్ వేసేయండి. ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

OTTలో నిత్యం సినిమాల జాతర జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఒకవేళ ఈ తెలుగు డబ్బింగ్ మలయాళీ సినిమాలను కనుక మిస్ అయితే ఓ లుక్ వేసేయండి. ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

మలయాళీ సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. అవి తెలుగులో లేకపోయినా సరే ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గానే చూస్తూ ఉంటారు. దీనితో మేకర్స్ కూడా వీటిని తెలుగులో డబ్ చేసి మరి రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ తెలుగు డబ్బింగ్ మలయాళీ సినిమాలను కనుక చూడలేదంటే మంచి సస్పెన్స్ థ్రిల్లర్స్ మిస్ అయినట్టే. పైగా ఈ సినిమాలన్నీ కూడా ఒకే ప్లాట్ ఫార్మ్ లో ఉండడం విశేషం. మరి ఈ సినిమాలేంటి. ఎందుకు చూడాలి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

కురుప్ :

ఇది 2021లో వచ్చిన మలయాళం థ్రిల్లర్ మూవీ. ఇది ఓ క్రిమినల్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. తన లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మరో వ్యక్తిని చంపి పారిపోయిన వ్యక్తి ఆ తర్వాత దానిని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని తప్పులు చేస్తాడు? కొన్ని దశాబ్దాలుగా అతడు పోలీసుల కళ్లుగప్పి ఎలా తప్పించుకున్నాడు. అనేదే ఈ సినిమా. ఈ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.

ది టీచర్ :

ఇది 2022 లో వచ్చిన థ్రిల్లర్ మూవీ. అమలాపాల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా నటించిన మూవీ ఇది. తనను శారీరకంగా, మానసికంగా వేధించిన నలుగురు స్టూడెంట్స్ పై ప్రతీకారంతో రగిలిపోయే టీచర్ కథ ఇది. చివరకు ఆమె అనుకున్నట్లు తన ప్రతీకారాన్ని తీర్చుకుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇరట్టా :

ఓ పోలీస్ అధికారి పోలీస్ స్టేషన్ లోనే కన్నుమూస్తాడు అతని తలపై బుల్లెట్ గాయం ఉంటుంది. ఈ కేసును వ్యక్తిగతంగా తీసుకునే అతని కవల సోదరుడు.. దీనిని ఎలా పరిష్కరిస్తాడన్నదే ఈ మూవీ స్టోరీ. ఆల్రెడీ ఈ సినిమా చాలావరకు చూసే ఉంటారు. మిస్ చేస్తే కనుక ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మిస్ చేసినట్లే.

నాయట్టు :

2021 లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది. ఓ అనవసర కేసులో తమను ఇరికించడంతో ముగ్గురు పోలీస్ అధికారులు పరారీలో ఉంటారు. వాళ్లను పట్టుకోవడానికి కేరళ పోలీస్ మొత్తం గాలిస్తుంటారు. ఆ ముగ్గురి జీవితాలలో ఏమి జరుగుతుంది అనేది ఈ సినిమా కథ. సో ఈ సినిమాను కూడా అసలు మిస్ చేయకుండా చూసేయండి.

జన గణ మన :

జన గణ మన 2022లో వచ్చిన లీగల్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్లో నటించాడు. ఓ ప్రొఫెసర్ మృతి, ఆ కేసును దర్యాప్తు చేసే పోలీస్ అధికారి చుట్టూ తిరిగే స్టోరీ ఇది. తెలుగులోనూ అందుబాటులో ఉంది

ఈ సినిమాలన్నీ కూడా ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. పైగా తెలుగులో ఉన్నాయి కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments