Swetha
మలయాళ సినిమాలు ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటున్నాయో తెలియనిది కాదు. ఈ క్రమంలో ఎన్నో సినిమాలు అటు థియేటర్స్ లోను ఇటు ఓటీటీ లోను రిలీజ్ అవ్వగా.. ఇక ఇప్పుడు మరొక సినిమా ఓటీటీ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అదేంటో చూసేద్దాం.
మలయాళ సినిమాలు ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటున్నాయో తెలియనిది కాదు. ఈ క్రమంలో ఎన్నో సినిమాలు అటు థియేటర్స్ లోను ఇటు ఓటీటీ లోను రిలీజ్ అవ్వగా.. ఇక ఇప్పుడు మరొక సినిమా ఓటీటీ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అదేంటో చూసేద్దాం.
Swetha
మలయాళ సినిమాలు ఏ మ్యాజిక్ చేస్తున్నాయో తెలియదు కానీ, ప్రేక్షకులంతా ఎంతో ఇంట్రెస్ట్ గా ఈ సినిమాలను చూస్తున్నారు. తెలుగు ఆడియన్స్ మధ్య ఈ సినిమాలకు పెరుగుతున్న క్రేజ్ ను చూసిన మలయాళీ మేకర్స్.. వారి సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి మరీ.. థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు, ఇక ఆ సినిమాలకు లభిస్తున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో తాజాగా మరొక మలయాళీ సినిమా ఓటీటీ లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది, మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది.. అనే విషయాలను చూసేద్దాం.
ఆ సినిమా మరేదో కాదు.. “ఆడు జీవితం ది గోట్ లైఫ్” . ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సలార్ సినిమా తో తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరైన నటుడు పృద్విరాజ్ సుకుమారన్. అతను మెయిన్ లీడ్ లో నటించిన సినిమానే ఇది. సింపుల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే.. మంజుమ్మేల్ బాయ్స్ లాంటి ఓ సర్వైవల్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా మార్చిలో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. సుమారు రూ.150 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.థియేటర్ లో రిలీజ్ అయ్యి దాదాపు నెల పైన అయింది కాబట్టి.. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ బాట పట్టింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ సినిమా మే 10 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఆడు జీవితం ది గోట్ లైఫ్ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో పృథ్వి రాజ్ సుకుమారన్ వలస వెళ్లిన ఈ కేరళ కూలి నిజ జీవిత పాత్రను పోషించారు. 1990 లో సౌదీ వెళ్లి అక్కడ వారు ఎలాంటి బానిసత్వానికి గురయ్యారు అనే కథను.. వారి కష్టాలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. కేవలం మలయాళంలోనే కాకుండా ఈ సినిమాకు ఇతర భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే పృథ్వి రాజ్ సుకుమారన్ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. మరి ఈ సినిమా ఓటీటీ లో ఎంతమందిని ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.