iDreamPost
android-app
ios-app

OTTలోకి జిగర్ తండ 2.. ఎప్పుడంటే?

రాఘవ లారెన్స్- ఎస్ జే సూర్య లీడ్ రోల్స్ ప్లే చేసిన జిగర్ తండ 2 సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా సత్తా చాటింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

రాఘవ లారెన్స్- ఎస్ జే సూర్య లీడ్ రోల్స్ ప్లే చేసిన జిగర్ తండ 2 సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా సత్తా చాటింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

OTTలోకి జిగర్ తండ 2.. ఎప్పుడంటే?

ఇటీవల రిలీజ్ అయిన సినిమాల్లో బాగా టాక్ సొంతం చేసుకున్న మూవీ జిగర్ తండ డబుల్ ఎక్స్. ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని భాషల్లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఎదురుచూశారు. సినిమా ప్రమోషన్స్ అప్పుడే లారెన్స్ ఎంతో బలంగా చెప్పాడు ఈ చిత్రం అందరికీ బాగా నచ్చుతుందని. అనుకున్నట్లుగానే అంత మంచి విజయాన్ని అందుకుంది. అందుకే ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఎదురుచూశారు. ఇప్పుడు వాళ్ల చిత్రబృందం ప్రేక్షకులకు శుభవార్త చెప్పింది.

జిగర్ తండ 2 సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఎదురుచూశారు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు వరుణ్ తేజ్ చేసిన గద్దలకొండ గణేశ్ సినిమా అంత నచ్చింది కాబట్టి. 2014లో వచ్చిన జిగర్ తండ 1 ఆ చిత్రానికి రీమేకే గద్దలకొండ గణేశ్. ఇప్పుడు ఈ డబుల్ ఎక్స్ సినిమాకి కూడా అంతే మంచి ఆదరణ లభించింది. డైరెక్టర్- హీరో రాఘవ లారెన్స్ లీడ్ రోల్ లో.. ప్రముఖ డైరెక్టర్ ఎస్జే సూర్య ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించాడు. వీళ్లిద్దరు డబుల్ ఎక్స్ లో చేస్తున్నారు అని తెలిసినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ లారెన్స్, సూర్య.. డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు ఇరగదీశారు. నవంబర్ 10 ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో విడుదల చేశారు. ఈ మూవీతో పోటీకి దిగిన కార్తీ జపాన్ చిత్రం రేసులో నిలవలేకపోయింది.

ముఖ్యంగా తమిళ్ లో జిగర్ తండ 2కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదైలన 10 రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్ లో చేరింది. జపాన్ వైఫల్యం కూడా జిగర్ తండ 2కు మంచి కలెక్షన్స్ ని రాబట్టంది. కార్తిక్ సుబ్బరాజు ఎంచుకున్న పాయింట్ కు చాలా మంచి అప్లాజ్ లభించింది. ప్రేక్షకులు అంతా ఈ మూవీని మాస్టర్ పీస్ అంటూ పొగుడుతున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఇప్పుడు జిగర్ తండ 2 ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. సినిమాకి మంచి రెస్పాన్స్ రాగానే ఓటీటీ రిలీజ్ ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ తో ముందుగానే చేసుకున్న ఒప్పంద ప్రకారం డిసెంబర్ 8కే ఓటీటీలోకి రాబోతున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి జిగర్ తండ 2 సినిమా మీరు చూసుంటే.. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి