iDreamPost
android-app
ios-app

OTT లోకి వచ్చేసిన ‘గుంటూరు కారం’ , ‘కెప్టెన్ మిల్లర్’

  • Published Feb 09, 2024 | 12:27 PM Updated Updated Feb 09, 2024 | 12:27 PM

ప్రస్తుతం అందరి చూపు ఓటీటీలో విడుదల కాబోయే చిత్రాలవైపే. థియేటర్ లో సినిమాలను మిస్ అయిన చాలా మంది .. ఆ సినిమాలు ఎప్పుడు ఓటీటీలో అడుగుపెడతాయ అని చూస్తూ ఉంటారు. ఇక ఈరోజున ఇద్దరి స్టార్ట్ హీరోల చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ప్రస్తుతం అందరి చూపు ఓటీటీలో విడుదల కాబోయే చిత్రాలవైపే. థియేటర్ లో సినిమాలను మిస్ అయిన చాలా మంది .. ఆ సినిమాలు ఎప్పుడు ఓటీటీలో అడుగుపెడతాయ అని చూస్తూ ఉంటారు. ఇక ఈరోజున ఇద్దరి స్టార్ట్ హీరోల చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

  • Published Feb 09, 2024 | 12:27 PMUpdated Feb 09, 2024 | 12:27 PM
OTT లోకి వచ్చేసిన ‘గుంటూరు కారం’ , ‘కెప్టెన్ మిల్లర్’

సంక్రాంతి కానుకగా జనవరి 12న తమిళంలో విడుదలైన చిత్రం ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’. అదే సమయంలో మరో హీరో సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోవడంతో .. ఈ చిత్రం ఓ మోస్తరు వసూళ్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక తెలుగులో సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదలైన చిత్రం .. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో.. సూపర్ స్టార్ మహెష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’. ఒక నార్మల్ టాక్ తో మొదలై బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకున్న చిత్రంగా .. నిలిచింది ఈ చిత్రం. అయితే, ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు నేటి నుంచి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ప్రసారం అవుతున్నాయి. థియేటర్ లో ఈ సినిమాలను మిస్ అయిన వారు ఇక ఇప్పుడు ఈ చిత్రాలను చూడాల్సిందే మరి.

తమిళ హీరో ధనుష్ “కెప్టెన్ మిల్లర్” చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రానికి అరుణ్ మతీశ్వరన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పాటలకు, యాక్షన్ సన్నివేశాలకు మంచి టాక్ సంపాదించుకుంది. సంక్రాంతి సందర్బంగా కేవలం తమిళంలో మాత్రమే విడుదల అయిన ఈ చిత్రం. ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా గత అర్దరాత్రి నుంచి ప్రసారం అవుతోంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది. అయితే ఈ చిత్రం హిందీలో స్ట్రీమింగ్ కాలేదు. దీనితో బాలీవుడ్ ఫ్యాన్స్ కాస్త అసంతృప్తి చెందుతున్నారు.

ఇక మహేష్ నటించిన “గుంటూరు కారం” సినిమా విషయానికొస్తే.. ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పి తీరాలి. మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జయరామ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా గురించి ఇప్పటివరకు నిత్యం ఎన్నో వార్తలు వింటూ వస్తున్నాం. ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తి ఎదురుచూశారు. ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గత అర్దరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో అందుబాటులో ఉంది. కాబట్టి, థియేటర్ లో ‘కెప్టెన్ మిల్లర్’ , ‘గుంటూరు కారం’ చిత్రాలను మిస్ అయిన ప్రేక్షకులు .. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఈ చిత్రాలను చూడవచ్చు. ఇక ఇప్పుడు ఈ రెండు చిత్రాలు ఓటీటీలో ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటాయో వేచి చూడాలి. మరి, ఈ రెండు చిత్రాల ఆన్ లైన్ స్ట్రీమింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş