iDreamPost
android-app
ios-app

OTT News: బ‌డ్జెట్ 15 కోట్లు, OTT డీల్‌ 30 కోట్లు! మ‌మ్ముట్టి మూవీకి బంప‌రాఫ‌ర్‌!

  • Published Feb 24, 2024 | 3:53 PMUpdated Feb 24, 2024 | 3:53 PM

తాజాగా మమ్ముట్టి నటించిన డిఫెరెంట్ ఎక్స్పెరిమెంటల్ మూవీ భ్రమయుగం. అయితే, ఈ మూవీ డిజిటల్స్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసిందంటూ .. కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తాజాగా మమ్ముట్టి నటించిన డిఫెరెంట్ ఎక్స్పెరిమెంటల్ మూవీ భ్రమయుగం. అయితే, ఈ మూవీ డిజిటల్స్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసిందంటూ .. కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 24, 2024 | 3:53 PMUpdated Feb 24, 2024 | 3:53 PM
OTT News: బ‌డ్జెట్ 15 కోట్లు, OTT డీల్‌ 30 కోట్లు! మ‌మ్ముట్టి మూవీకి బంప‌రాఫ‌ర్‌!

మలయాళంలో కేవలం మూడు పాత్రలలో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో తెరకెక్కి.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్ర “భ్రమయుగం”. ఈ సినిమా గురించి ఇప్పటివరకు భారీ టాక్ నడుస్తూనే వచ్చింది. ఈ సినిమా తొమ్మిది రోజుల్లో ఇరవై కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. అయితే మలయాళం లో సూపర్ హిట్ టాక్ సాధించిన ఈ చిత్రం .. తెలుగులో కాస్త ఆలస్యంగా విడుదలైంది. తెలుగులో ఈ సినిమా ఫిబ్రవరి 23న విడుదలై.. మంచి టాక్ ను సంపాదించుకుంది. అంతే కాకుండా ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన సినిమాలలో .. భ్రమయుగం సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా భారీ ధరల్లో ముగిసిందంటూ.. తాజాగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో భ్రమయుగం సినిమా ఓటీటీ డీల్ టాపిక్ ఇంట్రెస్టింగ్ గా మారింది. భ్రమయుగం సినిమా థియేటర్ రిలీజ్ కు ముందే.. విడుదల చేసిన పోస్టర్స్ , ట్రైలర్స్ తో ఆసక్తి నెలకొనడంతో.. అంచనాల ప్రకారమే .. ఈ సినిమా అందరిని అలరించడంతో.. ఇప్పుడు భ్రమయుగం చిత్రం ఓటీటీ రైట్స్ రికార్డు ధరలకు అమ్ముడుపోయినట్లు టాక్ వినిపిస్తుంది. అది కూడా సుమారు రూ. 30 కోట్లకు .. ప్రముఖ ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్ సంస్థ సోని లివ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా.. ఈ సినిమాను మలయాళం , తెలుగుతో పాటు .. కన్నడ, తమిళం భాషలలో కూడా ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్ అయితే.. మార్చి నెల ఎండింగ్ నుంచి భ్రమయుగం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంలో మేకర్స్ నుంచి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక భ్రమయుగం సినిమా కథ విషయానికొస్తే.. ఒక మాంత్రికుడి ఇంట్లో చిక్కుకున్న గాయకుడి కథతో.. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. తేవాన్ అనే వ్యక్తి ఓ గాయకుడు.. అయితే, ఇతను ఓ రోజు అడవిలో దారితప్పిపోయి .. ఒక పురాతన భవనంలో అడుగుపెడతాడు. ఆ భవనంలో ఆ వ్యక్తితో పాటు ఒక వంటవాడు మాత్రమే ఉంటాడు. అయితే,ఆ ఇంటి నుంచి బయటకు రావాలని అతను ఎంత ప్రయత్నించినా రాలేకపోతాడు. అసలు తనను ఆపేది ఎవరు ? ఎందుకు ఆపాలని ప్రయత్నిస్తున్నారు? చివరకు అతను చిక్కుల నుంచి బయటపడతాడా లేదా! అనేదే కథ. ఇక ఈ సినిమాలో నటించిన నటి నటులంతా .. ఆయా పాత్రలకు వంద శాతం న్యాయం చేశారని చెప్పి తీరాలి . మరి ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత “భ్రమయుగం” ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి , తాజాగా ఈ సినిమా ఓటీటీ విషయంలో వచ్చిన అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి