iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చిన 100 కోట్ల సూపర్ హిట్ కామెడీ మూవీ! స్ట్రీమింగ్ ఎందులో అంటే?

  • Author Soma Sekhar Published - 02:02 PM, Fri - 24 November 23

100 కోట్లు వసూల్ చేసిన సూపర్ హిట్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఆ సినిమా ఏది? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.

100 కోట్లు వసూల్ చేసిన సూపర్ హిట్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఆ సినిమా ఏది? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Published - 02:02 PM, Fri - 24 November 23
OTTలోకి వచ్చిన 100 కోట్ల సూపర్ హిట్ కామెడీ మూవీ! స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు వచ్చాక ప్రేక్షకులు సినిమాలు చూసే ధోరణిలో మార్పులు వచ్చాయి. ఇక అభిమానులు రెండు వర్గాలుగా విభజింపపడ్డారు. ఓటీటీ ఫ్యాన్స్, థియేటర్ ఫ్యాన్స్ గా వేరుచేయబడ్డారు. అయితే కథ బాగుంటే ఆ మూవీకి థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు. ఈ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నప్పుడు కూడా అంతే ఆదరణ చూపిస్తున్నారు. ఇక ఇటీవలే విడుదలైన సూపర్ హిట్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే రెండు పార్టులుగా వచ్చిన ఈ చిత్రం తాజాగా మూడో పార్ట్ కూడా విడుదలై.. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దాదాపు రూ. 100 కోట్లు వరకూ వసూలు చేసి.. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మరి ఆ చిత్రం ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ కామెడీ మూవీల్లో ‘ఫుక్రే’ సినిమా ఒకటి. ఇప్పటికే రెండు పార్ట్ లుగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాలను అందుకుంది. దీంతో ముచ్చటగా ఫుక్రే పార్ట్ 3 ని కూడా తెరకెక్కించారు మేకర్స్. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. భారీ విజయాన్ని సాధించింది. వసూళ్ల పరంగా కూడా సక్సెస్ అందుకుంది. ఈ సినిమా సుమారు రూ. 100 కోట్ల వరకూ వసూల్ చేసిందని సమాచారం. కాగా.. థియేటర్లలో రిలీజ్ అయిన సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో పుల్కిత్ సామ్రాట్, వరుణ్ శర్మ, రిచా చద్దా, పంకజ్ త్రిపాఠీలు కీలక పాత్రలు పోషించారు. ఫుక్రే 3 మూవీని అద్భుతమైన వినోదాత్మక చిత్రంగా తెరకెక్కించాడు డైరెక్టర్ మిర్ఘ్ దీప్ సింగ్ లాంబా.

ఇక ఫుక్రే పార్ట్ 3 ను స్టార్ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానీ కలిసి ఎక్సెల్ ఎంటర్ టైనర్ బ్యానర్ లో నిర్మించారు. తాజాగా ఈ మూవీ నవంబర్ 23 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫుక్రే 3 స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలోకి వచ్చిన దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది ఈ చిత్రం. ఇదిలా ఉండగా.. ఫుక్రే 3 సెప్టెంబర్ 7నే రిలీజ్ కావాల్సి ఉండగా.. షారుఖ్ జవాన్ మూవీ విడుదల అవుతుండటంతో.. వెనక్కి తగ్గారు. డిసెంబర్ 1న మూవీని రిలీజ్ చేయాలని భావించారు. కానీ సలార్ వాయిదా పడటంతో.. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. మరి ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీని మీరూ చూసేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss