iDreamPost
android-app
ios-app

OTT News: నిజమైన భార్యభర్తలు.. అద్భుతంగా నటించిన సినిమా OTTలోకి!

  • Published Feb 24, 2024 | 4:28 PM Updated Updated Mar 14, 2024 | 4:45 PM

ప్రస్తుతం థియేటర్ లో విడుదలయ్యే సినిమాలన్నీ నెలలోపే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఏ సినిమా అయినా ఏదైనా ఒక ఓటీటీ పార్ట్నర్ తో డీల్ మాట్లాడుకుని స్ట్రీమింగ్ ప్లాన్ చేస్తుంది. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఓ సినిమా మాత్రం ఒకేసారి మూడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎంట్రీ ఇవ్వనుందట. ఆ సినిమా వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం థియేటర్ లో విడుదలయ్యే సినిమాలన్నీ నెలలోపే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఏ సినిమా అయినా ఏదైనా ఒక ఓటీటీ పార్ట్నర్ తో డీల్ మాట్లాడుకుని స్ట్రీమింగ్ ప్లాన్ చేస్తుంది. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఓ సినిమా మాత్రం ఒకేసారి మూడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎంట్రీ ఇవ్వనుందట. ఆ సినిమా వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 24, 2024 | 4:28 PMUpdated Mar 14, 2024 | 4:45 PM
OTT News: నిజమైన భార్యభర్తలు.. అద్భుతంగా నటించిన సినిమా OTTలోకి!

ఈ మధ్య కాలంలో ఓటీటీ సినిమాలకు పెరుగుతున్న ఆదరణ అంత ఇంత కాదు. జోనర్ తో సంబంధం లేకుండా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న ప్రతి సినిమాను కథను బట్టి ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అలానే, థియేటర్ లో ఆయా సినిమాలు ఎటువంటి టాక్ ను సంపాదించుకున్న సరే.. వాటితో సంబంధం లేకుండా ఓటీటీలో మాత్రం విడుదల చేస్తున్నారు. వీటికి ఆదరణ కూడా బాగానే లభించడంతో.. మూవీ మేకర్స్ కూడా దానికి తగిన విధంగా ప్లాన్ చేసుకుంటూ.. ఆయా చిత్రాల ఓటీటీ డీల్స్ సినిమా విడుదలకు ముందుగానే క్లోజ్ చేసుకుని.. ఓటీటీ పార్ట్నర్స్ ను ఫిక్స్ చేసుకుంటున్నారు. అయితే , ఏ చిత్రనికైనా ఒకసారి ఒకే ఓటీటీ పార్ట్నర్ ఉంటుంది. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిత్రం మాత్రం ఒకేసారి మూడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎంట్రీ ఇవ్వనుందట. ఇప్పుడు అందరికి ఈ వార్త ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. ఇంతకీ అసలు ఈ చిత్రం ఏంటి ! ఏ ఏ ఓటీటీ పార్ట్నర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ! అనే విషయాలను తెలుసుకుందాం.

ఒకేసారి మూడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎంట్రీ ఇవ్వనున్న చిత్రం. “బ్లూ స్టార్”. ఈ సినిమా తమిళంలో జనవరి 24 న థియేటర్స్ లో విడుదల అయింది. కాగా ఈ సినిమాలో అశోక్ సెల్వన్, శంతను , కీర్తి పాండియన్ లాంటి వారు ముఖ్య పాత్రలలో నటించారు. అయితే, అశోక్ సెల్వన్, కీర్తి పాండియన్ గత ఏడాది వివాహం చేసుకున్నారు. జంటగా వీరిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం ఇది. కాగా , ఈ సినిమాను తక్కువ బడ్జెట్ తో రూపొందించినా కూడా.. ఆడియన్సును ఎంటర్టైన్ చేసే విషయంలో మాత్రం ఈ సినిమా ఎక్కడ తక్కువ చేయలేదు. పైగా ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే క్రికెట్, కులాల మధ్య అంతరాలు ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్ తో రూపొందించారు. థియేటర్ లో పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేశారట మేకర్స్.

అయితే, “బ్లూ స్టార్” చిత్రాన్ని ఫిబ్రవరి 29 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు మేకర్స్. అయితే, ఈ సినిమా ఒకేసారి మూడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ కావడమే విశేషం. ఇదే ఇప్పుడు అందరికి కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. ఇంతకీ ఆ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఏవంటే.. టెంట్ కొట్టా, సింప్లీ సౌత్ , అమెజాన్ ప్రైమ్ లలో. ఈ మూడు ప్లాట్ ఫార్మ్స్ లో ఒకేసారి “బ్లూ స్టార్ ” చిత్రం స్ట్రీమింగ్ కానుందట. అంతేకాకుండా ఇటు తెలుగు వెర్షన్ లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక , ఓటీటీలో ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి, “బ్లూ స్టార్” సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.