iDreamPost
android-app
ios-app

Bheema OTT: ఆ OTTలోకి భీమా ఫిక్స్! కానీ.., ధియేటర్ లో మిస్ కాకండి!

  • Published Mar 08, 2024 | 3:22 PM Updated Updated Mar 08, 2024 | 3:36 PM

Bheema OTT Release Date: ఓటీటీ సినిమాలకు ఈ మధ్య ఎక్కువ ఆదరణ లభిస్తుంది. థియేటర్ లో సినిమాలు విడుదల కాకముందే డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసుకుంటున్నారు. ఇక తాజాగా గోపీచంద్ నటించిన భీమా సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి కూడా టాక్ మొదలైంది.

Bheema OTT Release Date: ఓటీటీ సినిమాలకు ఈ మధ్య ఎక్కువ ఆదరణ లభిస్తుంది. థియేటర్ లో సినిమాలు విడుదల కాకముందే డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసుకుంటున్నారు. ఇక తాజాగా గోపీచంద్ నటించిన భీమా సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి కూడా టాక్ మొదలైంది.

  • Published Mar 08, 2024 | 3:22 PMUpdated Mar 08, 2024 | 3:36 PM
Bheema OTT: ఆ OTTలోకి భీమా  ఫిక్స్! కానీ.., ధియేటర్ లో మిస్ కాకండి!

ఇప్పుడు ఆడియన్స్ అంతా థియేటర్ లో విడుదల అయ్యే సినిమాల కోసం ఎలా ఎదురుచూస్తున్నారో.. ఓటీటీలో విడుదల అయ్యే సినిమాల కోసం కూడా అదే రేంజ్ లో ఎదురుచూస్తున్నారు. దాదాపు నెల రోజుల లోపే .. బడా హీరోల చిత్రాలు సైతం ఓటీటీ లో ఎంట్రీ ఇస్తున్నాయి. అయితే, కొన్ని సినిమాలు విడుదలయ్యి ఒక్క రోజు కూడా కాకముందే ఓటీటి ఎంట్రీపై డిస్కషన్స్ నడుస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహా శివరాత్రి సందర్బంగా మార్చి8న థియేటర్ లో.. గోపిచంద్ నటించిన “భీమా” సినిమా గ్రాండ్ గా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా గురించి అంతటా .. పాజిటివ్ టాక్ నడుస్తున్న క్రమంలో .. అప్పుడే ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఏ ప్లాట్ ఫార్మ్ కొనుగోలు చేసిందనే వివరాలు తెలుసుకుందాం.

టాలీవుడ్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఒరియెంటెడ్ చిత్రం భీమా. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా గోపీచంద్ కనిపించాడు. ఈ సినిమాకు హర్ష దర్శకత్వం వహించారు. కన్నడ ఇండస్ట్రీలో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎ హర్ష.. భీమా సినిమాతో తెలుగులో డెబ్యూ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ చిత్రాన్ని భీమా చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై.. కెకె రాధామోహన్ నిర్మించారు.. ప్రస్తుతం ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ నడుస్తుంది. అయితే, ఇంకా సినిమా థియేటర్ లో విడుదల అయ్యి ఒక్క రోజు కూడా కాకముందే .. ఈ సినిమా ఓటీటీ ఎంట్రీపై డిస్కషన్స్ నడుస్తున్నాయి. “భీమా” ఓటీటీ హక్కుల కోసం ఓటీటీ సంస్థలు భారీగానే పోటీ పడినట్లు సమాచారం. ఈ క్రమంలో భీమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ సంస్థ హాట్ స్టార్ కొనుగోలు చేసిందట. అలాగే శాటిలైట్ రైట్స్‌ను బుల్లితెర టీవీ ఛానెల్ స్టార్ మా కొనుగోలు చేసిందట. ఓటీటీ అండ్ శాటిలైట్ హక్కులు అన్ని కలిపి మొత్తంగా రూ. 20 కోట్ల వరకు అమ్ముడు పోయినట్లు సమాచారం. ఇక మూవీ రూల్స్ ప్రకారం సినిమా థియేటర్ లో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వాలి. దీనిని బట్టి చూస్తే.. ఏప్రిల్ మొదటి వారంలో “భీమా” సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ సినిమా ఓటీటీ ఎంట్రీపై మేకర్స్ నుంచి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

కాగా, భీమా సినిమా గోపిచంద్ కు కమ్ బ్యాక్ హిట్ మూవీ అంటున్నారు ఆడియన్స్. అంతేకాకుండా భీమా సినిమాలో గోపీచంద్ అదరగొట్టాడని, నటన పరంగా దాదాపుగా క్యారక్టర్ లో జీవించాడని ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటూ రివ్యూస్ ఇస్తున్నారు. మరి, ఈ సన్నివేశాలను చూడాలంటే థియేటర్ లో ఈ సినిమాను ఎక్స్పీరియెన్స్ చేయాల్సిందే. కాగా, భీమా సినిమాలో గోపీచంద్ కు జోడిగా మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించారు. వీరితోపాటు సినిమాలో ముఖేష్ తివారి, వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్, నరేష్ కీలక పాత్రలు పోషించారు. మరి, భీమా సినిమా ఓటీటి ఎంట్రీ గురించి వస్తున్న వార్తలపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişJojobetPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetCasibom Güncel Giriş