Aditya N
ఇటీవల సినీ ఇండస్ట్రీలో సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. కోలీవుడ్ లో ఇదే కాస్సెప్ట్ తో వచ్చిన అయలాన్ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. కోలీవుడ్ లో ఇదే కాస్సెప్ట్ తో వచ్చిన అయలాన్ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Aditya N
తమిళ యువ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రథాన పాత్రలో నటించగా ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన అయలాన్ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ‘ఇండ్రు నేట్రు నలై’ ఫేమ్ ఆర్ రవికుమార్ దర్శకత్వం వహించారు. తమిళ వర్షన్ లో విజయం సాధించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆగిపోయింది.
తెలుగు డిస్ట్రిబ్యూటర్ తాలూకు పాత న్యాయపరమైన సమస్యల కారణంగా అయలాన్ తెలుగు వెర్షన్ విడుదల కాలేదు. ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సన్ నెక్స్ట్ ప్లాట్‌ఫారమ్ ఇటీవల ప్రకటించింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు వెర్షన్ ఫిబ్రవరి 9న విడుదల కావడం లేదని తెలుస్తోంది. దాన్ని బట్టి అయలాన్ సినిమా చూడాలంటే తెలుగు ప్రేక్షకులు ఇంకొన్ని రోజులు ఎదురు చూడక తప్పదన్న మాట. ఈ వార్త ఒక రకంగా సినీ ప్రేమికులకు చేదు వార్త అనే చెప్పాలి. అయలాన్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించారు. కేజేఆర్ స్టూడియోస్ పతాకం పై కోటపాడి జె రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా శరద్ కేల్కర్, కరుణాకర్, ఇషా కొప్పికర్, భాను ప్రియ, యోగిబాబు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.
అయలాన్ మూల కథ:
ఒక చెడు ఉద్దేశ్యంతో శాస్త్రవేత్త (శరద్ కేల్కర్) తన సబార్డినేట్ (ఇషా కొప్పికర్)తో కలిసి ఒక ప్రమాదకరమైన స్ఫటికంతో ప్రపంచం అంతాన్ని ప్లాన్ చేయాలని ప్లాన్ చేస్తుంటాడు. ఉద్యోగ అవకాశాల కోసం ఓ పల్లెటూరి నుంచి చెన్నైకి వచ్చిన తమిళ్ (శివ కార్తికేయన్) ఆ మిషన్ కు అడ్డు పడతాడు. అతను అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ఒక గ్రహాంతర వాసితో చేతులు కలుపుతాడు తమిళ్. మరి ఆ లక్ష్యాన్ని సాధించాడా లేదా తెలుసుకోవాలి అంటే అయలాన్ తెలుగు వెర్షన్ ఓటీటీలో విడుదల అయ్యే వరకూ ఆగాల్సిందే.