Swetha
ఓటీటీ లోకి అనేక సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఆ సినిమాలో హీరో కోసమో హీరోయిన్ కోసమో చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో తాజాగా కాంతారా మూవీ హీరోయిన్ నటించిన కొత్త సినిమా ఒకటి ఓటీటీ లోకి వచ్చేసింది. దానికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.
ఓటీటీ లోకి అనేక సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఆ సినిమాలో హీరో కోసమో హీరోయిన్ కోసమో చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో తాజాగా కాంతారా మూవీ హీరోయిన్ నటించిన కొత్త సినిమా ఒకటి ఓటీటీ లోకి వచ్చేసింది. దానికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.
Swetha
కన్నడ మూవీ గా వచ్చిన కాంతారా సినిమా .. అటు ఒరిజినల్ లాంగ్వేజ్ తో పాటు ఇటు తెలుగులోనూ ఎంత సక్సెస్ అయిందో తెలియనిది కాదు. ఈ సినిమా సక్సెస్ కారణంగా.. ఈ సినిమాలో నటించిన నటి నటులందరికి కూడా ప్రత్యేక గుర్తింపు లభించింది. దీనితో వారికీ మంచి ఆఫర్లు క్యూ కట్టాయని చెప్పి తీరాలి. ఇక ఈ క్రమంలో కాంతారా సినిమాలో న్యాచురల్ యాక్టింగ్ తో.. ఒక కానిస్టేబుల్ పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్న హీరోయిన్.. సప్తమి గౌడ. ఈ క్రమంలో ఆమెకు అటు కన్నడతో పాటు తెలుగులోనూ మంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా ఈ అమ్మడు నటించిన లేటెస్ట్ ఫిల్మ్ “యువ”. ఈ సినిమా ఇటీవలే థియేటర్ లో రిలీజ్ అయింది. కానీ అప్పుడే ఈ సినిమా ఓటీటీ లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అయిపోతుంది. మరి ఈ సినిమా ఏ ఓటీటీ లోకి వచ్చేసిందో చూసేద్దాం.
యువ సినిమా.. మార్చి 29 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వం వహించాడు. కాగా, ఈ సినిమాను ప్రముఖ కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమాతో రాజ్‌కుమార్ ఫ్యామిలీ నుంచి కొత్త వారసుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దీనితో కన్నడ నాట ఈ సినిమాపై.. భారీగా హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సప్తమి గౌడ.. ఎప్పటిలానే అందరిని మెప్పించింది. ఇక ఈ సినిమా థియేటర్ లో హిట్ టాక్ సంపాదించుకుంది. అయినా కూడా యువ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజుల లోపే.. సరిగ్గా ఇరవై ఆరు రోజుల వ్యవధిలోనే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా వచ్చేసింది. దీనితో అందరు ఆశ్చర్య పోతున్నారు. యువ సినిమా శుక్రువారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
యువ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో ఒక రెజ్లర్.. ఒకానొక సమయంలో హీరోపై మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడనే.. ఆరోపణలు వస్తాయి. ఈ క్రమంలో అతనిని రెజ్లింగ్ నుంచి తొలగిస్తారు. దీనితో అతని తండ్రి అతనిని ద్వేషించడం మొదలు పెడతాడు. కానీ, రెజ్లింగ్ కు దూరం అయినా కూడా ఇంజినీరింగ్ పూర్తి చేసి.. కుటుంబ ఆర్ధిక పరిస్థితుల కారణంగా.. ఒక ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తుంటాడు. మరోవైపు స్టాక్ మార్కెటింగ్ పేరుతో హీరో తండ్రిని కొందరు మోసం చేస్తారు. అప్పుడు హీరో తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు ! ఆ మోసగాళ్ళతో ఎలా పోరాటం చేశాడు ! ఇందులో హీరోయిన్ పాత్ర ఏంటి ! అసలు రెజ్లింగ్ లో ఉన్నపుడు హీరోపై నిందలు వేసింది ఎవరు ! అన్నదే ఈ మూవీ స్టోరీ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.