iDreamPost
android-app
ios-app

OTTలోకి అబ్బబ్బ హారర్ కామెడీ .. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..

  • Published May 11, 2024 | 11:55 AM Updated Updated May 11, 2024 | 11:55 AM

ఓటీటీ లవర్స్. కామెడీ హారర్ మూవీస్ కోసం ఎదురు చూస్తున్నారా.. అలాంటి వారి కోసమే ఈ చిత్రం. ఫిబ్రవరిలో విడుదలైన ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కండిషన్స్ అప్లై..

ఓటీటీ లవర్స్. కామెడీ హారర్ మూవీస్ కోసం ఎదురు చూస్తున్నారా.. అలాంటి వారి కోసమే ఈ చిత్రం. ఫిబ్రవరిలో విడుదలైన ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కండిషన్స్ అప్లై..

  • Published May 11, 2024 | 11:55 AMUpdated May 11, 2024 | 11:55 AM
OTTలోకి అబ్బబ్బ హారర్ కామెడీ .. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..

ఇటీవల హార్రర్‌లో కామెడీని మిక్స్ చేసి  మిక్సీ వేసి తిప్పేస్తున్నాయి ఇండియన్ చిత్రాలు. హార్రర్ అంటే భయపెట్టాలా ఏంటీ.. నవ్విస్తూ కూడా భయపెట్టొచ్చు అని నిరూపిస్తున్నాయి. అందుకు ఉదాహరణలు లారెన్స్ తెరకెక్కించే ముని ఫ్రాంచైజ్ మూవీస్. ఇందులో కామెడీతో పాటు కాన్సెప్ట్, అంతకు మించి భయం కనిపిస్తుంటాయి. చెమటలు పట్టిస్తూనే కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఇలాంటి చిత్రాల కోసం ఓటీటీలో వల వేసి పడుతున్నారు సినీ ఆడియన్స్. వీకెండ్స్ వస్తే చాలు..ఇలాంటి చిత్రాలు ఏమన్నా వచ్చాయా అని సెర్చ్ చేస్తున్నారు. హార్రర్ కామెడీ జోనర్ మూవీ కావాలంటే అలాంటి ఓ సినిమా ఓటీటీకి వచ్చేసింది. అయితే ఇక్కడ చిన్న మెలిక కూడా ఉంది .. అదేంటో చూడండి.

కన్నడలో ఇటీవల థియేటర్లలో రిలీజైన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అండ్ హార్రర్ కామెడీ అబ్బబ్బ. పేరు వినడానికి ఇలా ఉందే.. సినిమా కూడా కొత్తగా ఉండబోతుంది. ఫిబ్రవరి 16న థియేటరల్లో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఇది 2015లో మలయాళ హఇట్ ‘అది కప్పియారే కూటమణి’కి రీమేక్. ఇందులో లికిత్ శెట్టి, అమృత అయ్యంగార్, అనూష రాజ్ హీరో హీరోయిన్లుగా నటించారు. కేయం చైతన్య ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన మూడు నెలలకు ఓటీటీలో ప్రత్యక్షమైంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఫ్రీగా కాదు.. రెంటల్ విధానంలో. ఈ సినిమా చూడాలంటే.. ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు 79 రూపాయలు చెల్లించాల్సి వుంటుంది. ఫ్రీగా చూడాలంటే.. మే 17 నుండి చూడొచ్చు. దీనికి ఐదు, ఆరు రోజుల గడువు మాత్రమే ఉంది.

అబ్బబ్బ సినిమాకు 10కి 9.5 ఐఎండీబీ రేటింగ్ రావడం గమనార్హం. దీన్ని తమిళంలో కూడా హాస్టల్ పేరుతో రీమేక్ చేశారు. ఇందులో అశోక్ సెల్వన్, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లు. అంతలా పలు ఇండస్ట్రీల్లో రీమేక్ కారణమైన ఈ సినిమా ఫ్లాట్ హారర్ కామెడీ కావడం. ఇక అబ్బబ్బ కథ విషయానికి వస్తే.. షర్మిల (అనూషరాజ్‌) అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు కార్తిక్/దిలీప్ (లిఖిత్ శెట్టి). కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా షర్మిలకు మరో అబ్బాయితో పెళ్లి ఫిక్సవుతుంది. ఈ ఇద్దరి సంభాషణలను కాలేజీ క్యాంటీన్ లో విన్న అఖిల(అమృత అయ్యంగార్‌)మీ ఇద్దర్ని కలిపే పూచీ తనది అని చెబుతుంది. అయితే తనను హీరో ఉండే బాయ్స్ హాస్టల్ లోకి తీసుకెళ్లాలని కండీషన్ పెడుతుంది. అక్కడకు వెళ్లాక.. పరిస్థితులు ఏంటీ అనేది మిగిలిన కథ. అసలు అఖిల బాయ్స్ హాస్టల్‌కు ఎందుకు వెళ్లింది..? ఆమెను ఎందుకు దెయ్యం అని మిగిలిన బాయ్స్, హాస్టల్ వార్డెన్ అనుకున్నారో తెరపై చూడండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom