iDreamPost
android-app
ios-app

OTT Suggestion: OTTలో దీ బెస్ట్ మిస్టరీ డెత్‌ సినిమా! ఇది నచ్చాలంటే సినిమా నాలెడ్జ్ ఉండాలి!

  • Published Apr 24, 2024 | 6:16 PM Updated Updated Apr 26, 2024 | 6:18 PM

ఓటీటీ లోకి వచ్చే తెలుగు, తమిళ మలయాళ చిత్రాలు అందరు చూస్తూనే ఉంటున్నారు. అయితే ఈ ఏడాది ఆస్కార్ అవార్డుతో పాటు.. వందకు పైగా ఎన్నో అవార్డులను అందుకున్న ఓ హాలీవుడ్ చిత్రం తెలుగులో ఓటీటీ లోకి అందుబాటులోకి రానుంది.

ఓటీటీ లోకి వచ్చే తెలుగు, తమిళ మలయాళ చిత్రాలు అందరు చూస్తూనే ఉంటున్నారు. అయితే ఈ ఏడాది ఆస్కార్ అవార్డుతో పాటు.. వందకు పైగా ఎన్నో అవార్డులను అందుకున్న ఓ హాలీవుడ్ చిత్రం తెలుగులో ఓటీటీ లోకి అందుబాటులోకి రానుంది.

  • Published Apr 24, 2024 | 6:16 PMUpdated Apr 26, 2024 | 6:18 PM
OTT Suggestion: OTTలో దీ బెస్ట్ మిస్టరీ డెత్‌ సినిమా! ఇది నచ్చాలంటే సినిమా నాలెడ్జ్ ఉండాలి!

ప్రతి వారం డిఫరెంట్‌ జానర్‌ చిత్రాలు.. ఓటీటీ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాయి, ఈ క్రమంలో.. ఓటీటీల్లో బాగా ఆదరణ పొందుతున్న చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఓటీటీ లలో క్రైమ్, సస్పెన్స్ జోనర్స్ కు చెందిన చిత్రాలు ఎన్నో ఉన్నా కూడా.. వాటిలో ప్రేక్షకులకు కిక్ ఇచ్చే సినిమాలు మాత్రం కొన్ని మాత్రమే ఉంటాయి. ఇప్పటివరకు ఇలాంటి ఎన్నో సినిమాలను మూవీ లవర్స్ ఆదరించారు. ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు.. ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డుతో పాటు వందకు పైగా అవార్డులు అందుకున్న ఫ్రెంచ్‌ కోర్డు డ్రామా మూవీ ఒకటి ఓటీటీ లో అందుబాటులో ఉంది. తెలుగులో కూడా ఈ చిత్రం మంచి వ్యూవర్ షిప్ తో దూసుకుపోతుంది. మరి ఇంతకీ ఆ చిత్రం ఏంటి. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలను చూసేద్దాం.

మిస్టరీ డెత్ గా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా పేరు.. “అనాటమీ ఆఫ్ ఏ ఫాల్”. ప్రతి క్షణం తర్వాత ఏమి జరుగుతుందా అని ఉత్కంఠ భరితంగా సాగే సన్నివేశాలతో సాగే ఈ సినిమా అందరికి చెమటలు పట్టించడం ఖాయం. ఈ సినిమా 2023 లో వచ్చింది. క్రైమ్, సస్పెన్స్ మూవీ లవర్స్ కు బెస్ట్ ఛాయస్. ఈ సినిమా ఆస్కార్‌తో పాటు వందకుపైగా అవార్డులు గెలుచుకుంది . టీవల 96వ ఆస్కార్ ఆవార్డుల్లో అయితే విభాగాల్లో అకాడమీ అవార్డుకు నామినేట్‌ అయిన ఈ చిత్రం బెస్ట్‌ ఒరిజిన‌ల్ స్క్రీన్‌ప్లే విభాగంలో అవార్డును అందుకుంది. ఇక ఈ చిత్రం ఈ మధ్యనే ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్‌తో పాటు ఇండియన్ లాంగ్వేజ్స్ అయిన తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఒక మంచి వర్త్ వాచింగ్ సినిమా అనిపించడం ఖాయం.

ఈ సినిమా కథేంటంటే.. క్రమ క్రమంగా అప్పుడప్పుడే రచయితగా ఎదుగుతున్న.. సాండ్రా హల్లర్‌ తన భర్త, కుమారుడు, పెట్ డాగ్ తో కలిసి హిమలయాల్లో నివస్తుంది. ఆమె ఒక మంచి పేరొందిన రచయిత్రి. కానీ ఆమె భర్త అకస్మాత్తుగా మరణించడం చేత. ఆమె జీవితం ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతుంది. పైగా ఆమె భర్తను తానె చంపినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటుంది. దీనితో ఆమె ఆ కేసు నుంచి ఎలా బయటపడుతుంది ! ఆమెను ఆమె నిర్ధోషిగా ఎలా నిరూపించుకుంటుంది! అసలు ఆ హత్య ఎవరు చేశారు ! ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను ప్రతి క్షణం మిస్ చేయకుండా పూర్తిగా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.