iDreamPost
android-app
ios-app

Amazon Prime Releases: ఈ వారం ప్రైమ్ OTT లో విడుదల కాబోయే ఈ సినిమాలను.. మిస్ కాకండి

  • Published May 01, 2024 | 6:54 PM Updated Updated May 01, 2024 | 6:54 PM

ఓటీటీ లోకి ఎన్నో సిరీస్ లు , సినిమాలు వస్తూనే ఉన్నాయి.మరి వాటిలో ఏమి చూడాలి అనే కన్ఫ్యూజన్ అందరికి ఉంటుంది. అయితే, ఈ వారం ఓటీటీ లోకి రాబోయే సినిమాలలో ఈ సినిమాలాను , సిరీస్ లను మాత్రం అస్సలు మిస్ కాకండి.

ఓటీటీ లోకి ఎన్నో సిరీస్ లు , సినిమాలు వస్తూనే ఉన్నాయి.మరి వాటిలో ఏమి చూడాలి అనే కన్ఫ్యూజన్ అందరికి ఉంటుంది. అయితే, ఈ వారం ఓటీటీ లోకి రాబోయే సినిమాలలో ఈ సినిమాలాను , సిరీస్ లను మాత్రం అస్సలు మిస్ కాకండి.

  • Published May 01, 2024 | 6:54 PMUpdated May 01, 2024 | 6:54 PM
Amazon Prime Releases: ఈ వారం ప్రైమ్ OTT లో విడుదల కాబోయే ఈ సినిమాలను..  మిస్ కాకండి

వీకెండ్ వచ్చిందంటే రెండు రోజులు ముందు నుంచే ఏ సినిమా ఏ ఓటీటీ లోకి వచ్చింది, ఏ ఏ సినిమాలకు ఎంత రేటింగ్ వచ్చింది అనే విషయాలను చెక్ చేస్తూ ఉంటారు మూవీ లవర్స్. దానికి సంబంధించిన అప్ డేట్స్ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పటికే ఈ వారం ఏ ఏ సినిమాలు, సిరీస్ లు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉంటున్నాయి అనే లిస్ట్ వచ్చేసింది. మూవీ లవర్స్ కూడా దానికి తగినట్టు ప్లాన్ చేసుకునే ఉంటారు. మరి వాటిలో ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియో లో మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలేంటో.. ఆ సినిమాల కథేంటో చూసేద్దాం.

ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవ్వబోతున్నాయి. వాటిలో మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ కూడా ఉండడంతో .. దానిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోయే సినిమాలు/ సిరీస్ ల జాబితా ఇలా ఉంది.

1. అంబర్ గర్ల్స్ స్కూల్ (హిందీ సిరీస్) – మే 01
ఈ సినిమాను ఖచ్చింతంగా టీనేజీ గర్ల్స్ చూడాల్సిన సినిమా. ఓ అమ్మాయి యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత తనకు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంది. అనేది అంతా కూడా ఈ సినిమాలో చూపిస్తారు. ఈ సినిమా అమెజాన్ మినీ టీవీ లో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

2. ద ఐడియా ఆఫ్ యూ (ఇంగ్లీష్ సినిమా) – మే 02
ఇది 2024లో వచ్చిన ఓ రొమాంటిక్ కామెడీ చిత్రం.. మైఖేల్ షోల్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో మే 2 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రొమాన్స్ , కామెడీ జోనర్స్ ఇష్టపడే వారు ఈ సినిమాను చూసేయొచ్చు.

3. క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – మే 03
ఇది ఒక ఇంగ్లీష్ సిరీస్, ఈ మధ్య కాలంలో సిరీస్ లను ఇష్టపడే వారు ఎక్కువగా ఉన్నారు. కొరియన్ సిరీస్ లను చూసేవారికి ఈ ఇంగ్లీష్ సిరీస్ ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పటికే ఈ సిరీస్ రెండు సీజన్స్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు మూడవ సీజన్ ను మే 3 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈలోపు మొదటి రెండు సీజన్స్ ను మిస్ అయినా వారుంటే వెంటనే చూసేయండి.

4. ఉమన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – మే 03
ప్రతి ఒక్క మహిళా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. ఇది ఒక డాక్యుమెంటరీ మూవీ.. డాక్యుమెంటరీ మూవీ అంటేనే అవి రియల్ లైఫ్ స్టోరీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని చిత్రాలను రూపొందిస్తు ఉంటారు. కాబట్టి డాక్యుమెంటరీస్ చూసే ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది. మే 3 నుంచి స్ట్రీమింగ్ కాబోయే ఈ సినిమాను అసలు మిస్ చేయకండి.

వీటితో పాటు ఇంకా ఎన్నో వెబ్ సిరీస్ లు , సినిమాలు వివిధ రకాల ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉన్నాయి. మరి ఈ సినిమాలు, సిరీస్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.