iDreamPost
android-app
ios-app

Love Guru OTT: OTT లోకి విజయ్ ఆంటోని లవ్ గురు.. ఆ ప్లాట్ ఫార్మ్ లోనే స్ట్రీమింగ్..

  • Published Apr 20, 2024 | 11:43 AM Updated Updated Apr 26, 2024 | 6:21 PM

వరుసగా ఓటీటీ లోకి ఎన్నో సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా విజయ్ ఆంటోని నటించిన లవ్ గురు సినిమా కూడా ఓటీటీ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. మరి ఆ సినిమా ఎప్పుడు ఏ ఓటీటీ లోకి రానుందో చూసేద్దాం.

వరుసగా ఓటీటీ లోకి ఎన్నో సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా విజయ్ ఆంటోని నటించిన లవ్ గురు సినిమా కూడా ఓటీటీ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. మరి ఆ సినిమా ఎప్పుడు ఏ ఓటీటీ లోకి రానుందో చూసేద్దాం.

  • Published Apr 20, 2024 | 11:43 AMUpdated Apr 26, 2024 | 6:21 PM
Love Guru OTT: OTT లోకి విజయ్ ఆంటోని లవ్ గురు.. ఆ ప్లాట్ ఫార్మ్ లోనే స్ట్రీమింగ్..

బిచ్చగాడు సినిమాతో.. విజయ్ ఆంటోని తెలుగు నాట ఎంత పేరు సంపాదించుకున్నాడో తెలియనిది కాదు. ఈ క్రమంలోనే బిచ్చగాడు-2 సినిమాతో కూడా యూనానిమస్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడూ లేటెస్ట్ గా.. విజయ్ ఆంటోనీ నటించిన సినిమా లవ్ గురు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్ లో రిలీజ్ అయింది. థియేటర్ లో మిక్సెడ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఓటీటీ లోకి రానున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఓటీటీ లోకి ఎన్ని సినిమాలు వచ్చినా సరే.. కొత్త సినిమా వస్తుందంటే అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే లవ్ గురు సినిమా కూడా త్వరలో ఓటీటీ లోకి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు ఎక్కడ ఏ ప్లాట్ ఫార్మ్ స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

లవ్ గురు సినిమా ముందుగా తమిళంలో.. రోమియో పేరుతో రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత తెలుగులో లవ్ గురు పేరుతో తెరకెక్కింది. ఈ సినిమాలో విజయ్ కు జోడిగా.. మృణాళిని రవి హీరోయిన్ గా నటించింది. ఇక విజయ్ ఆంటోనీ ఇప్పటివరకు యాక్షన్ థ్రిల్లర్ కథలతోనే ప్రేక్షకులను అలరించాడు. కానీ, ఈ సినిమాలో మాత్రం వాటి అన్నిటికి భిన్నంగా.. ఒక మంచి రొమాంటిక్ స్టోరీ టచ్ తో ముందుకు వచ్చాడు. కానీ కొంతమేరకు ఇది ఒక రొటీన్ కావడంతో ఈ సినిమా ఊహించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం తమిళ వెర్షన్ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఏప్రిల్ చివరి వారం నుంచి ఆహ స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక లవ్ గురు సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో ఒక బిజినెస్ మెన్.. కుటుంబ బాధ్యతల కారణంగా ప్రేమ, పెళ్లి లాంటి అన్ని బంధాలకు దూరంగా ఉంటాడు. అతనికి ముప్పై ఐదేళ్లు దాటిన తర్వాత పెద్దలచేత నిర్ణయించబడిన అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. ఆమెకు ఇష్టం లేకపోయినా కూడా ఈ పెళ్లి చేసుకుంటుంది ఆ అమ్మాయి. తనని తానూ ఒక హీరోయిన్ గా చేసుకోవాలన్నది తన కోరిక.. ఈ క్రమంలో ఆమెను అర్ధం చేసుకున్న హీరో.. తానే ఒక హీరోగా, నిర్మాతగా మారి ఒక సినిమాను తీయాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది! అనుకున్నట్లుగానే వారివురు సినిమాను తీసారా లేదా ! ఇష్టం లేకుండా అతనిని పెళ్లి చేసుకున్న ఆమె చివరికి అతనిని భర్తగా అంగీకరిస్తుందా లేదా ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేంత వరకు ఆగాల్సిందే. మరి లవ్ గురు సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.