iDreamPost
android-app
ios-app

Prasanna Vadanam OTT: ఆ OTTలోకి ప్రసన్నవదనం మూవీ ఫిక్స్! కానీ.. ధియేటర్ లో మిస్ కాకండి!

  • Published May 03, 2024 | 1:02 PM Updated Updated May 03, 2024 | 1:02 PM

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఎంత ఫాస్ట్ గా ఉంటున్నాయంటే.. థియేటర్ లో సినిమాలు రిలీజ్ కాకముందే, లేదా సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ సంపాదించుకుంటున్నప్పుడే ఆయా సినిమాల డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేస్తున్నాయి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన ప్రసన్న వదనం సినిమా ఓటీటీ పార్టనర్ కూడా ఫిక్స్ అయిందట.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఎంత ఫాస్ట్ గా ఉంటున్నాయంటే.. థియేటర్ లో సినిమాలు రిలీజ్ కాకముందే, లేదా సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ సంపాదించుకుంటున్నప్పుడే ఆయా సినిమాల డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేస్తున్నాయి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన ప్రసన్న వదనం సినిమా ఓటీటీ పార్టనర్ కూడా ఫిక్స్ అయిందట.

  • Published May 03, 2024 | 1:02 PMUpdated May 03, 2024 | 1:02 PM
Prasanna Vadanam OTT: ఆ OTTలోకి ప్రసన్నవదనం మూవీ  ఫిక్స్! కానీ.. ధియేటర్ లో మిస్ కాకండి!

ఓటీటీ సినిమాలకు ఈ మధ్య ఎక్కువ ఆదరణ లభిస్తుంది. దీనితో థియేటర్ లో విడుదల అయ్యే సినిమాల కోసం ఎలా ఎదురుచూస్తున్నారో.. ఓటీటీలో విడుదల అయ్యే సినిమాల కోసం కూడా అదే రేంజ్ లో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. థియేటర్ లో సినిమాలు విడుదల కాకముందే డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసుకుంటున్నారు. దాదాపు నెల రోజుల లోపే .. బడా హీరోల చిత్రాలు సైతం ఓటీటీ లో ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు సుహాస్ నటించిన తాజా చిత్రం “ప్రసన్న వదనం”. మే 3 న ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేశారు . ప్రస్తుతం ఈ సినిమా గురించి అంతటా .. పాజిటివ్ టాక్ నడుస్తున్న క్రమంలో .. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఓటీటీ పార్టనర్ ఏంటో చూసేద్దాం.

ఇండస్ట్రీలో ఎటువంటి బాక్గ్రౌండ్ లేకుండా.. స్వతహాగా కష్టపడుతూ మంచి పేరు సంపాదించుకునే వారు.. చాలా తక్కువమంది ఉంటారు. అటువంటి వారిలో ఒకరు హీరో సుహాస్. విభిన్నమైన కథలతో తనదైన శైలిలో సుహాస్ సినిమాలను చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇటీవల అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో హిట్ అందుకున్న సుహాస్.. ఇక ఇప్పుడు “ప్రసన్నవదనం” సినిమాతో అందరిని అలరించాడు. ప్రస్తుతం ఈ సినిమా అంతటా కూడా పాజిటివ్ నడుస్తుంది. ఈ సినిమాకు అర్జున్ వైకే దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో సుహాస్ తో పాటు.. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ ఫిమేల్ లీడ్స్ లో నటించారు. అయితే థియేటర్స్ లో హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ “ఆహ” కొనుగోలు చేసిందట. ఇక ఓటీటీ రూల్స్ ప్రకారం ఏ సినిమా అయినా థియేటర్ లో విడుదల అయిన.. నెల రోజుల తర్వాత ఓటీటీ లోకి వస్తుంది. ప్రసన్న వదనం సినిమా విషయంలోనూ అదే జరగనుంది. అయితే థియేటర్ లో మాత్రం ఈ సినిమాను అస్సలు మిస్ కాకండి.

ఇక ప్రసన్న వదనం సినిమా కథేంటంటే.. ఈ సినిమాలో సుహాస్ రేడియో జాకీగా పనిచేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో హీరో పేస్ బ్లైండ్ నెస్ అనే సమస్యతో బాధపడుతూ ఉంటాడు. దీనితో ఎవరిని సరిగా గుర్తుపట్టలేకపోతాడు. కానీ, అతని సమస్యను ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఈ క్రమంలో అతని కళ్ళ ముందు ఓ హత్య జరుగుతుంది. అతనికి ఉన్న లోపం వలన ఆ హత్య చేసిన వారిని అతను గుర్తుపట్టలేకపోతాడు. కానీ దాని గురించి మాత్రం పోలీసులకు చెప్పాలనుకుంటాడు. ఆ తర్వాత ఏమి జరిగింది! కథ ఎలా ముందుకు సాగింది ! దీనిలో సస్పెన్స్ తో పాటు.. ఇంకా ఏ జోనర్స్ ఉన్నాయి ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఎలాగూ వీకెండ్ కాబట్టి ఓటీటీ లోకి వచ్చే లోపు ఈ సినిమాను థియేటర్స్ లో చూసేయండి. మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.