iDreamPost
android-app
ios-app

చాలా ఏళ్ళ తరువాత సుధీర్ ఖాతాలో ఒక షో! ఇలా అయిపోయావ్ ఏంటి అన్న?

  • Published Apr 03, 2024 | 10:17 AM Updated Updated Apr 03, 2024 | 10:32 AM

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ తో సుడిగాలి సుధీర్ బాగా ఫేమస్ అయిపోయాడు. ఆ తర్వాత ఢీ ప్రోగ్రాంలో కనిపిస్తూ.. మల్టీటాలెంటెడ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు సుధీర్ కొత్తగా ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ తో సుడిగాలి సుధీర్ బాగా ఫేమస్ అయిపోయాడు. ఆ తర్వాత ఢీ ప్రోగ్రాంలో కనిపిస్తూ.. మల్టీటాలెంటెడ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు సుధీర్ కొత్తగా ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

  • Published Apr 03, 2024 | 10:17 AMUpdated Apr 03, 2024 | 10:32 AM
చాలా ఏళ్ళ తరువాత సుధీర్ ఖాతాలో ఒక షో! ఇలా అయిపోయావ్ ఏంటి అన్న?

ఓటీటీ అనగానే అందరికి గుర్తొచ్చేది కేవలం సినిమాలు, సిరీస్ లు మాత్రమే కానీ.. ఓటీటీలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి.. రకరకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆహ ఓటీటీలో ఇండియన్ ఐడల్ తెలుగు, చెఫ్ మంత్ర, అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే, ఫ్యామిలీ ధమాకా, నేను సూపర్ వుమన్, డ్యాన్స్ ఐకాన్ లాంటి ఎన్నో రియాల్టీ షోలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో .. బుల్లితెర కామెడీ షో ద్వారా.. అలాగే ఇతర టీవీ షోస్ ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇక ఇప్పటివరకు బుల్లి తెరమీద ప్రేక్షకులను అలరించిన సుడిగాలి సుధీర్ ఇకపై ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరించనున్నాడు. సుడిగాలి సుధీర్.. సర్కార్ అనే ఒక రియాలిటీ షో కు హోస్ట్ గా వ్యవహరించనున్నాడు.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ .. రియాలిటీ షోస్ కు పెట్టింది పేరు. ఈ క్రమంలోనే త్వరలో సర్కార్ అనే మరో రియాలిటీ షోతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతుంది. ఈ షో కు సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు.. స్వయంగా ఆహా ప్లాట్ ఫార్మ్ అనౌన్స్ చేసింది. ఇప్పటికే సర్కార్ షో విజయవంతంగా మూడు సీజన్స్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు నాలుగవ సీజన్ కు కొత్త హోస్ట్ గా సుడిగాలి సుధీర్ ను ఎంపిక చేసింది. గతంలో ఈ షోకి ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా వ్యవహరించారు. ఇక ఇప్పుడు ఆ బాధ్యత సుడిగాలి సుధీర్ వంతైంది. అందరిని ఎంటర్టైన్ చేసే సుధీర్ ఇకపై సెలెబ్రిటీలపై ప్రశ్నలు సందించనున్నాడన్నమాట. ఇక స్పాంటేనిటీకి పెట్టింది పేరు సుధీర్. ఈ విషయం అందరికి తెలిసిందే. ఖచ్చితంగా ఈ షోను సుధీర్ విజయవంతంగా నడిపిస్తాడని అంతా భావిస్తున్నారు. త్వరలోనే ఈ షో ప్రారంభం కానుంది.

A show on Sudhir's account after many years!

ఇక సర్కార్ షో విషయానికొస్తే.. 2021లో ఈ షో స్టార్ట్ అయింది. ఇది ఒక సెలెబ్రిటీ గేమ్ షో.. తమిళంలో ఈ షో కు.. జీవా హోస్ట్ గా వ్యవహరించాడు. తెలుగులో ఈ షో ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. గత సీజన్ లో.. రానా, సాయి పల్లవి, సిద్దూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, శ్రీ విష్ణు, ప్రియమణి, సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లాంటి సెలబ్రిటీలు ఈ షోకి వచ్చారు. ఇక ఇప్పుడు సుధీర్ ఈ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి..ఈ షో మరింత ఎంటర్టైనింగ్ గా ఉంటుందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా సుధీర్ ఆహ ఓటీటీలో కామెడీ స్టార్ ఎక్స్‌ఛేంజ్ షోకి హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక ఇప్పుడు సర్కార్ షో తో మరొక్కసారి అందరిని ఎంటర్టైన్ చేయనున్నాడు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetMarsbahisgalabetHoliganbet