iDreamPost
android-app
ios-app

OTT Suggestion: OTTలో బో*ల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్! కంపెనీ లేకుండా ఒక్కరే చూస్తే బెటర్!

  • Published Apr 25, 2024 | 9:22 PM Updated Updated Apr 26, 2024 | 2:12 PM

ఎప్పటికప్పుడు ఓటీటీ లోకి ఏం సినిమాలు వస్తున్నాయి.. ఎక్కడ వస్తున్నాయి అనే అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాలను మిస్ అయ్యే ఛాన్స్ అసలు లేదు. ఈ క్రమంలో గతంలో వచ్చిన కొన్ని మంచి సినిమాలను, సిరీస్ లను మాత్రం మూవీ లవర్స్ మిస్ అవుతున్నారు.

ఎప్పటికప్పుడు ఓటీటీ లోకి ఏం సినిమాలు వస్తున్నాయి.. ఎక్కడ వస్తున్నాయి అనే అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాలను మిస్ అయ్యే ఛాన్స్ అసలు లేదు. ఈ క్రమంలో గతంలో వచ్చిన కొన్ని మంచి సినిమాలను, సిరీస్ లను మాత్రం మూవీ లవర్స్ మిస్ అవుతున్నారు.

  • Published Apr 25, 2024 | 9:22 PMUpdated Apr 26, 2024 | 2:12 PM
OTT Suggestion: OTTలో బో*ల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్! కంపెనీ లేకుండా ఒక్కరే చూస్తే బెటర్!

అప్పటికి ఇప్పటికీ సినిమాలకు ఉండే క్రేజ్ తగ్గలేదు కానీ.. వెబ్ సిరీస్ లకు ఉండే క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఇప్పటివరకు అన్ని జోనర్స్ లో అనేక రకాల వెబ్ సిరీస్ లు వచ్చాయి. కొన్ని ఫ్యామిలీతో కలిసి చూసేవైతే మరికొన్ని ఒంటరిగా చూసేవి.. మరికొన్ని ఉంటాయి. సిరీస్ అంటే హాలీవుడ్ బాలీవుడ్ కంటెంట్ వైపు చూసే మూవీ లవర్స్ కు.. తెలుగులో కూడా అద్భుతమైన సిరీస్ లు ఉన్నాయని తెలియజేస్తున్నారు మేకర్స్. రేటింగ్ మాయలో పడిపోయి ఇలాంటి కొన్ని సిరీస్ లను మిస్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా ఈ కోవకు చెందిందే. తెలుగులో ఒక బోల్డ్ కంటెంట్ తో ఉన్న ఈ సిరీస్ ను మీరు మిస్ అయినట్లే.. ఒక మంచి సిరీస్ ను మిస్ అయినట్లే. మరి ఆ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాల గురించి చూసేద్దాం.

ఈ సిరీస్ పేరు “ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్”. ఈ సిరీస్ ఆహా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ లో ప్రియదర్శి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని చెప్పి తీరాలి. మొత్తం ఏడు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ కూడా ఎక్కడ బోర్ కొట్టించకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి. తెలుగులో ఇటువంటి కంటెంట్ తో సిరీస్ లను తీయడం అంటే రిస్క్ తో కూడుకున్న పని అని చెప్పాలి. అసలు ఈ సిరీస్ ఎందుకు చూడాలి.. ఈ సిరీస్ కథేంటి అనే విషయానికొస్తే.. ఈ సిరీస్ మొత్తం కూడా రాజమండ్రి బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు. పోసాని కృష్ణ మురళి.. బి గ్రేడ్ సినిమాలను రూపొందిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆ సినిమాలో నటించడానికి వచ్చిన మీనా అనే ఒక అమ్మాయిని అతని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వీరిద్దరి మధ్య వయసు బేధం ఎక్కువ ఉండడంతో.. ఆమె ఇంటి దగ్గరలో ఉండే ఒక కుర్రాడితో ప్రేమలో పడుతుంది.

మరో పక్క అదే ఇంట్లో కార్ డ్రైవర్ గా పని చేస్తున్న ప్రియదర్శి ఎప్పటికైనా ఒక మంచి రిసార్ట్ పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఇంతలో మీనా ప్రేమ విషయం ఆమె భర్తకు తెలిసిపోతుంది. దీనితో అతను వీరిద్దరూ కలిసి ఉన్న సమయంలో వాళ్ళను చంపాలని ప్రయత్నం చేస్తాడు. కానీ మీనా ఎదురుతిరిగి అతనిని చంపేసి.. ఆ హత్య కేసులో ప్రియదర్శిని ఇరికిస్తుంది. ఈ కేసు నుంచి అతను ఎలా బయటపడ్డాడు ! వీళ్ళ బండారం బయట పడిందా లేదా ! మీనా ఏమైంది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక ఆసక్తికరమైన అంశం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ ను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişİmajbetultrabetjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetcasibom