iDreamPost
android-app
ios-app

ఓటీటీలోకి కామెడీ ఎంటర్టైనర్ ‘మై డియర్ దొంగ’..స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

  • Published Apr 04, 2024 | 9:42 PM Updated Updated Apr 04, 2024 | 9:42 PM

My Dear Donga Movie OTT Release Date: ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని ఓటీటీ రాజ్యమేలుతుంది. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సీరిస్ లతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి.

My Dear Donga Movie OTT Release Date: ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని ఓటీటీ రాజ్యమేలుతుంది. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సీరిస్ లతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి.

  • Published Apr 04, 2024 | 9:42 PMUpdated Apr 04, 2024 | 9:42 PM
ఓటీటీలోకి కామెడీ ఎంటర్టైనర్ ‘మై డియర్ దొంగ’..స్ట్రీమింగ్  ఎప్పుడు? ఎక్కడంటే?

ఒకప్పుడు సినిమా థియేటర్లకు వెల్లి కొత్త సినిమాలు చూడాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది.  కానీ కాలం మారింది.. ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని ఎంటర్‌టైన్‌మెంట్  రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఇప్పుడు కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ చూసే అవకాశం లభిస్తుంది. భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల సినిమాలు, వెబ్ సీరీస్ చూసేందుకు ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా కామెడీ, హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చే సినిమాలు, వెబ్ సీరీస్ కి మంచి ఆధరణ లభిస్తుంది. తాజాగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘మై డియర్ దొంగ’ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మూవీ స్ట్రీమిండ్ ఎప్పుడు, ఎక్కడ ? అనే విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ యంగ్ నటుడు అభినవ్ గోమటం హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా’ మూవీతో హీరోగా వెండితెరపై తన సత్తా చాటాడు. ఫిబ్రవరి 23 న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ అయిన కొద్ది రోజులకే గోమటం నటించిన ‘మై డియర్ దొంగ’ మూవీ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ గా తెరకెక్కిన ఈ మూవీ బి ఎస్ సర్వజ్జ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో షాలిని కొండేపూడి హీరోయిన్ గా నటిస్తుంది. దివ్యశ్రీపాద ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ నవ్వులు పూయిస్తుంది. ఈ మూవీ ధియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్.  ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో ఏప్రిల్ రెండో వారంలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చింది ఆహా.

అభినవ్ గోమటం హీరోగా నటించిన మై డియర్ దొంగ మూవీ ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ‘ఎక్కడి దొంగలు అక్కడే ఉండండీ… ఎందుకంటే అసలైన దొంగ ఏప్రిల్ 19న వచ్చేస్తున్నాడు’ అంటూ క్యాప్షన్ ఇస్తూ స్పేషల్ పోస్టర్ విడుదల చేసింది ఆహా. ఈ మూవీ ఆహా, కేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ లో ఓ అమ్మాయి ఉన్న ఇంట్లోకి దొంగతనం కోసం వెళ్లి అక్కడే అనుకోని పరిస్థితుల్లో బందీగా మారిపోతాడు. అలా ఆ అమ్మాయితో స్నేహం ఏర్పడుతుంది… తర్వాత ఇద్దరి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వారి స్నేహం ఎంత వరకు వెళ్తుంది? అనేది సినిమా చూడాల్సిందే. మరి ఏప్రిల్ 19 వరకు సినిమా కసం వెయిట్ చేయాల్సిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom