iDreamPost
android-app
ios-app

సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..?

ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి క్రైమ్, సస్పెన్స్, హర్రర్, థ్రిల్లర్ మూవీస్. ఈ జోనర్ మూవీస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఓటీటీ లవర్స్. అలాంటి వారి కోసమే ఓ తెలుగు థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. ఇంతకు ఆ మూవీ ఏంటంటే..?

ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి క్రైమ్, సస్పెన్స్, హర్రర్, థ్రిల్లర్ మూవీస్. ఈ జోనర్ మూవీస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఓటీటీ లవర్స్. అలాంటి వారి కోసమే ఓ తెలుగు థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. ఇంతకు ఆ మూవీ ఏంటంటే..?

సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. ఎక్కడ  స్ట్రీమింగ్ అవుతుందంటే..?

ప్రస్తుతం ఓటీటీలో అనేక సినిమాలు సందడి చేస్తున్నాయి. గత డిసెంబర్‌లో విడుదలై కలెక్షన్లలో రికార్డులు సృష్టించిన రెండు సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లోకి వచ్చేశాయి. నెల రోజులు కూడా తిరగకుండానే ప్రభాస్-ప్రశాంత్ నీల్ సినిమా సలార్ ఓటీటీలోకి వచ్చి వ్యూస్ పరంగా రికార్డుల మోత మోగిస్తోంది. అలాగే గత డిసెంబర్ 1న విడుదలైన రణబీర్-సందీప్ రెడ్డి వంగా చిత్రం యానిమల్ ఈ జనవరి 26 నుండి సందడి చేస్తుంది. రెండు కూడా నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే కొన్ని డబ్బింగ్ సినిమాలు మంచి వ్యూస్ రాబట్టుకుంటున్నాయి. మోహన్ లాల్- జీతూ జోసెఫ్ కోర్టు డ్రామా నేరు సినిమా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు క్రైమ్, ధ్రిల్లర్, సస్పెన్స్ మూవీలదే హవా.

అయితే తెలుగులో ఇలాంటి సినిమాలు ఓటీటీలోకి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. మొన్న దూత అనే వెబ్ సిరీస్ ట్రెమండస్ వ్యూస్ సంపాదించుకుంది. చివరి వరకు సస్పెన్స్ మెయిన్‌టైన్ చేశాడు దర్శకుడు విక్రమ్ కుమార్. ఇందులో నాగ చైతన్య నటన కూడా చాలా డిఫరెంట్ షేడ్‌లో ఉంది. అయితే ఇప్పుడు ఓ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. ఇంతకు ఆ మూవీ ఏంటంటే.. అధర్వ. కార్తీక్ రాజు (ఆపరేషన్ గోల్డ్ ఫిష్, కౌసల్య కృష్ణ మూర్తి ఫేం), సిమ్రాన్ చౌదరి జంటగా నటించిన ఈ మూవీ యానిమల్ సినిమా విడుదల రోజే రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా వచ్చినట్లు కానీ పోయినట్లు కానీ తెలియదు. కానీ ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అప్పట్లో విడుదల ట్రైలర్ మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది.

A crime thriller coming to OTT

జనవరి 25 నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా.. నూతల పాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సుభాష్ నూతల పాటి నిర్మించారు. ఇక కథ విషయానికి వస్తే.. ఓ హీరోయిన్ హత్య జరుగుతుంది. అలాగే మరికొన్ని హత్యలు చోటుచేసుకుంటాయి. అయితే ఈ హత్యలు ఎవరు చేశారో కనుక్కునేందుకు క్లూస్ టీం రంగంలోకి దిగుతుంది. అయితే హత్య జరిగిన తర్వాత.. ఆ ప్రాంతంలో జనసంచారం వల్ల క్లూస్ మిస్ అవుతుంటాయి. ఒక కేసుకు క్లూస్ ఎంత కీలక పాత్ర పోషిస్తాయో ఈ సినిమాలో చూపించారు. మరెందుకు ఆలస్యం ఓటీటీలో చూసేయండిక. మూవీ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetpark girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetMadridbetjojobetgrandpashabet girişJojobetjojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş