iDreamPost
android-app
ios-app

OTT Release: రెండు నెలల తర్వాత.. ఓటీటీలోకి హిట్ సినిమా! స్ట్రీమింగ్ ఎందులో అంటే?

  • Published Dec 23, 2023 | 9:26 PM Updated Updated Dec 23, 2023 | 9:26 PM

రెండు నెలల తర్వాత ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ రాబోతోంది. మరి ఆ చిత్రం ఏ ఓటీటీలో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతోందో.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

రెండు నెలల తర్వాత ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ రాబోతోంది. మరి ఆ చిత్రం ఏ ఓటీటీలో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతోందో.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

  • Published Dec 23, 2023 | 9:26 PMUpdated Dec 23, 2023 | 9:26 PM
OTT Release: రెండు నెలల తర్వాత.. ఓటీటీలోకి హిట్ సినిమా! స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. దీంతో థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన, మెప్పించలేకపోయిన సినిమాలను సినీ ప్రియులు ప్రముఖ ఓటీటీల్లో ఇంట్లోనే కూర్చుని చూస్తున్నారు. ఇక థియేటర్లలో మిస్సైన సూపర్ హిట్ సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తాయా, వాటిని ఎప్పుడు చూద్దామా? అని ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. అలాంటి సినిమానే త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దమవుతోంది. విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. మరి ఆ హిట్ చిత్రం ఏది? ఏ ఓటీటీలో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

12th ఫెయిల్.. నిజ జీవిత కథతో తీసిన ఈ మూవీ తెలుగులో అనుకున్నంత విజయం సాధించలేదు. అయితే హిందీలో మాత్రం అద్భుతమైన విజయం సాధించింది. ఇంటర్మీడియట్ తప్పిన ఓ కుర్రాడు.. తన జీవితంలో ఐపీఎస్ ఎలా అయ్యాడు? అన్నదే ఈ మూవీ కథ. చాలా మందికి ఈ సినిమా చూసేటప్పుడు గుండె తడి కావడం ఖాయం. అంతలా ఈ మూవీ ప్రేక్షకుల హృదయాలను మెలిపెట్టింది ఈ చిత్రం.

కాగా.. అక్టోబర్ 27న హిందీలో రిలీజ్ అవ్వగా.. నవంబర్ 3న తెలుగులో విడుదలైంది. అయితే అదే టైమ్ లో పొలిమేర 2, కీడాకోలా లాంటి సినిమాలు రావడంతో.. ఈ మూవీకి పెద్దగా థియేటర్లు దొరకలేదు. దీంతో త్వరగానే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది ఈ చిత్రం. దీంతో ఈ సినిమాను మిస్ అయిన అభిమానులు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. డిసెంబర్ 29న ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మరి థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో మాత్రం 12th ఫెయిల్ మూవీని అస్సలు మిస్ కాకండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom