iDreamPost
android-app
ios-app

Ramachari : కనకవర్షం కురిపించిన కన్నడ చంటి

  • Published Feb 14, 2022 | 11:11 AM Updated Updated Dec 06, 2023 | 1:22 PM

ఈ సమస్యల పరిష్కారానికి తనకో ఆపద్భాందవుడు లాంటి సినిమా కావాలి. తమిళంలో రిలీజై దుమ్ము రేపుతున్న చిన్న తంబీ గురించి విన్నారు. కన్నడలో తీస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఆలోచించకుండా ఉరుకుల పరుగుల మీద చెన్నై వెళ్ళిపోయారు.సినిమా చూశాక మతి పోయింది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ సినిమాలకు కర్ణాటకలో మంచి ఆదరణ ఉంటుంది.

ఈ సమస్యల పరిష్కారానికి తనకో ఆపద్భాందవుడు లాంటి సినిమా కావాలి. తమిళంలో రిలీజై దుమ్ము రేపుతున్న చిన్న తంబీ గురించి విన్నారు. కన్నడలో తీస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఆలోచించకుండా ఉరుకుల పరుగుల మీద చెన్నై వెళ్ళిపోయారు.సినిమా చూశాక మతి పోయింది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ సినిమాలకు కర్ణాటకలో మంచి ఆదరణ ఉంటుంది.

Ramachari : కనకవర్షం కురిపించిన కన్నడ చంటి

కన్నడ హీరో రవిచంద్రన్ స్వీయ దర్శకత్వంలో శాంతి క్రాంతి అనే భారీ పాన్ ఇండియా సినిమా తీశారు. ఇప్పుడంటే ఒక భాషలో తీసి వేరే లాంగ్వేజ్ లో డబ్బింగ్ చేసి దానికా ట్యాగ్ తగిలిస్తున్నారు కానీ నిజానికి ఇది మొదట తీసుకొచ్చింది ఈయనే. తెలుగులో నాగార్జున, కన్నడలో తను, తమిళం హిందీలో రజినీకాంత్ హీరోలుగా అప్పట్లోనే కోట్ల రూపాయల బడ్జెట్ తో ఖర్చు వెనుకాకుండా తీసుకుంటూ పోయారు. నాన్న వీరాస్వామి పెద్ద ప్రొడ్యూసర్. ఈ ప్రాజెక్టులో ఆయన ప్రమేయం లేదు. అనారోగ్యంతో ఉన్నారు. కొడుకు నమ్మకాన్ని కాదనకుండా చూస్తున్నారు. బ్యాంకు బాలన్సులన్నీ అయిపోయాయి. అప్పులు పుట్టడం లేదు. ఉన్న కొద్దిపాటి ఆస్తులమ్మడం ఒక్కటే మిగిలింది.

షూటింగ్ పూర్తి కావొస్తున్న టైంకి రవిచంద్రన్ కి ఇది ఆడదని అర్థమైపోయింది. థియేటర్లలో వచ్చాక దీన్నెంత దారుణంగా ప్రేక్షకులు తిరస్కరించబోతున్నారో కళ్ళముందు కనిపించేసింది. అలా అని వెనక్కు వెళ్లే పరిస్థితి లేదు. రీ షూట్ అంతకన్నా సాధ్యం కాదు. రిలీజైతే తనకు చావే గతి. పైగా నాన్న ఆపరేషన్ కోసం ఆయన్ను అమెరికా తీసుకెళ్లాలి. దానికీ సొమ్ములు లేవు. అంత దారుణమైన పరిస్థితి. ఈ సమస్యల పరిష్కారానికి తనకో ఆపద్భాందవుడు లాంటి సినిమా కావాలి. తమిళంలో రిలీజై దుమ్ము రేపుతున్న చిన్న తంబీ గురించి విన్నారు. కన్నడలో తీస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఆలోచించకుండా ఉరుకుల పరుగుల మీద చెన్నై వెళ్ళిపోయారు.

సినిమా చూశాక మతి పోయింది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ సినిమాలకు కర్ణాటకలో మంచి ఆదరణ ఉంటుంది. ఆలస్యం చేయకుండా చిన్న తంబీ హీరోయిన్ ఖుష్భూకి ఫోన్ చేశారు. రవిచంద్రన్ తీసిన రణధీర, ఆంజద గండు, యుగపురుష, శాంతి క్రాంతిలో కథానాయికగా నటించడం వల్ల ఆ స్నేహం వుంది. అంత పెద్ద హీరో హక్కులు ఇప్పించమని స్వయంగా అడగ్గానే తమిళ నిర్మాతతో మాట్లాడించి కేవలం లక్ష రూపాయలకు డీల్ కుదిరేలా సహాయం చేసింది. కానీ రవిచంద్రన్ దగ్గర 35 వేలే ఉన్నాయి. ఇంకా 65 వేలు కావాలి. కోట్లు మార్చిన చేతులవి. ఇప్పుడు వేలకు దేహీ అనే దుస్థితి. స్నేహితులు డిస్ట్రిబ్యూటర్లను అడిగి ఏదోలా కిందా మీద చేసి మిగిలిన డబ్బు సర్దేశారు. శాంతి క్రాంతి పక్కన పెట్టి రామాచారి టైటిల్ తో చిన్నతంబి రీమేక్ ని వేగంగా తీశారు.

దర్శకత్వం తనే చేయగలిగినా ఒత్తిడి తట్టుకోలేక ఆ బాధ్యతను రాజేంద్రబాబుకి అప్పగించారు. హంసలేఖ అద్భుతమైన పాటలు ఇచ్చారు. హీరోయిన్ గా ఖుష్బూనే అనుకున్నారు కానీ చిన్న తంబీ దెబ్బకు చాలా బిజీ అయిపోవడంతో సాధ్యం కాలేదు. ఆ స్థానంలో మాలాశ్రీ వచ్చి చేరింది. రామాచారి అయిపోయింది. శాంతి క్రాంతి పూర్తి చేయడం కోసం వచ్చినకాడికి రామాచారిని అమ్మేశారు. 1991 జూలైలో రిలీజ్ చేస్తే థియేటర్ల దగ్గర జనం జాతర. హౌస్ ఫుల్ కలెక్షన్లతో వస్తున్న రిపోర్టులు చూసి రవిచంద్రన్ కు నోటమాట రాలేదు. డిస్ట్రిబ్యూటర్లకు కనక వర్షం కురుస్తోంది. పోటీ సినిమాలన్నీ బెంబేలెత్తిపోయాయి. లహరి కంపెనీకి ఆడియో క్యాసెట్ల ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. వారానికి బదులు రోజుకో ఫ్రెష్ బ్యాచ్ తయారు చేయాల్సి వచ్చింది.

రామాచారి దెబ్బకు రవిచంద్రన్ కోరుకున్న దానికన్నా చాలా ఎక్కువ డబ్బు వచ్చేసింది. నాన్నకు విదేశాల్లో చికిత్స పూర్తయ్యింది. శాంతి క్రాంతి కోసం పంపిణీదారులు క్యూలో నిలబడ్డారు. మూడు భాషల్లోనూ విపరీతమైన క్రేజ్. ఏం జరగబోతోందో తెలిసినా మరీ అత్యాశకు వెళ్లకుండా సినిమాను రీజనబుల్ గా అమ్మేశారు. సెప్టెంబర్ లో విడుదలయ్యింది. దారుణమైన టాక్. అభిమానులే ఇదేం సినిమా అని తిట్టిపోశారు. చాలా చోట్ల వారానికే బాక్సులు వెనక్కు వచ్చాయి. రవిచంద్రన్ దేనికైతే భయపడ్డారో అంతకు మించే జరిగింది. రామాచారి దీనికి ముందు రక్షకుడిగా ఉండకపోయి ఉంటే ఈయన కెరీర్ అక్కడితోనే సమాప్తమయ్యేది.

శాంతి క్రాంతి అంత ఘోరంగా దెబ్బా తిన్నా రామాచారి వల్ల వచ్చిన ఇమేజ్, మార్కెట్ రవిచంద్రన్ కు ఎన్నో అవకాశాలను అడ్వాన్సులను తీసుకొచ్చి ఇచ్చింది. పూర్తిగా కోలుకునే వెసులుబాటు ఇచ్చింది. రీ రిలీజులు, వీడియో క్యాసెట్ల అమ్మకాల్లోనూ రామాచారి సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆంధ్ర కర్ణాటక బోర్డర్ లో ఉండే ఊళ్లలో కూడా బ్లాక్ టికెట్లు అమ్మే రేంజ్ లో ఆడింది. ఈ వైభవాన్ని కళ్లారా చూసిన తండ్రి వీరాస్వామి 1992లో కన్నుమూశారు. కట్ చేస్తే ఈ సినిమానే తెలుగులో చంటిగా రీమేక్ చేస్తే వెంకటేష్ కు ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలవడం మరోసారి చెప్పుకోవాల్సిన చరిత్ర

Also Read : Sardar Paparayudu : ఎన్టీఆర్ సినిమాల్లో ఆణిముత్యం – Nostalgia