iDreamPost
అలాంటిది రంగుల్లో లవకుశ తీయాలన్న ఆలోచన నిర్మాత శంకర్ రెడ్డికి వచ్చింది. ఆయనకు 1934లో అదే టైటిల్ తో వచ్చిన చిత్రమంటే ఎంతో మక్కువ. దాన్ని కలర్ లో మంచి క్యాస్టింగ్ తో రీమేక్ చేస్తే చరిత్రలో నిలిచిపోతుందని నమ్మకం. ఎన్ని లక్షలు అవసరమవుతాయో తెలియదు
అలాంటిది రంగుల్లో లవకుశ తీయాలన్న ఆలోచన నిర్మాత శంకర్ రెడ్డికి వచ్చింది. ఆయనకు 1934లో అదే టైటిల్ తో వచ్చిన చిత్రమంటే ఎంతో మక్కువ. దాన్ని కలర్ లో మంచి క్యాస్టింగ్ తో రీమేక్ చేస్తే చరిత్రలో నిలిచిపోతుందని నమ్మకం. ఎన్ని లక్షలు అవసరమవుతాయో తెలియదు
iDreamPost
1958. తెలుగులో నలుపు తెలుపులో సినిమాలు తీయడమే పెద్ద బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారంగా ఉండేది. అలాంటిది రంగుల్లో లవకుశ తీయాలన్న ఆలోచన నిర్మాత శంకర్ రెడ్డికి వచ్చింది. ఆయనకు 1934లో అదే టైటిల్ తో వచ్చిన చిత్రమంటే ఎంతో మక్కువ. దాన్ని కలర్ లో మంచి క్యాస్టింగ్ తో రీమేక్ చేస్తే చరిత్రలో నిలిచిపోతుందని నమ్మకం. ఎన్ని లక్షలు అవసరమవుతాయో తెలియదు. అయినా ధైర్యం చేసి దర్శకులు సి పుల్లయ్య గారిని కలిస్తే ఆయన సంతోషంగా చేద్దామనే అభయం ఇచ్చారు. ఎన్టీఆర్, అంజలిదేవి, కాంతారావు, చిత్తూరు నాగయ్య, రేలంగి, గిరిజ తదితరులు ప్రధాన పాత్రల్లో తారాగణం సెట్ చేసుకున్నారు. సదాశివబ్రహ్మం సంభాషణలతో స్క్రిప్ట్ సిద్ధం చేయించారు. ఏకకాలంలో తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించేలా మొత్తం ప్లాన్ చేసుకున్నారు.
12 పాటలు 20కి పైగా పద్యాలతో ఘంటసాల గారు శతాబ్దాల పాటు నిలిచిపోయే పాటలు కంపోజ్ చేశారు. లవుడిగా మాస్టర్ నాగరాజు, కుశుడిగా మాస్టర్ సుబ్రహ్మణ్యం ఆడిషన్స్ లో అద్భుతంగా నటించి ఎంపికయ్యారు. చెన్నై వాహిని స్టూడియోలో మొదలైన షూటింగ్ కొంత కాలం సవ్యంగానే సాగింది. కానీ శంకర్ రెడ్డి శక్తికి మించిన బడ్జెట్ కావడంతో ఆయన ఒకదశ దాటాక చేతులెత్తేశారు.ఏకంగా నాలుగేళ్లు బ్రేక్ పడింది. తీసిన నెగటివ్ ని ల్యాబ్ లో భద్రపరిచారు. మరో నిర్మాత సుందర్ లాల్ నహతా ఆర్థిక సహకారంతో లవకుశ పూర్తి చేసేందుకు రంగం సిద్ధమయ్యింది. 1963 వచ్చేసింది. ఈలోగా పుల్లయ్య అనారోగ్యం బారిన పడటంతో మిగిలిన భాగం పూర్తి చేసే బాధ్యతను ఆయన వారసుడు సిఎస్ రావు తీసుకున్నారు. ఎన్నో అవరోధాలు ఆటంకాల మధ్య ఎట్టకేలకు లవకుశ పూర్తయ్యింది.
ఎన్టీఆర్,అంజలి దేవిలతో పాటు ఇతర సీనియర్లందరూ గొప్ప సహకారం అందించారు. రెమ్యునరేషన్లు పట్టించుకోలేదు. టెక్నీషియన్లు ప్రాణం పెట్టారు. 1963 మార్చి 29 లవకుశ రిలీజయ్యింది. జనం ఎడ్ల బండ్లు వేసుకుని క్యారియర్లు కట్టుకుని జాతరకు వచ్చినట్టు థియేటర్లకు పోటెత్తారు. రద్దీతో సినిమా హాళ్లు కిటకిటలాడాయి. ఏకంగా 62 సెంటర్లలో వంద రోజులు ఆడటం రికార్డు. 18 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ఆడటం ఎవర్ గ్రీన్ ల్యాండ్ మార్క్. పైసా అణాలు ఉన్న రోజుల్లోనే కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి తెలుగు సినిమా లవకుశనే. రిపీట్ రిలీజ్ లోనూ ఇది సృష్టించిన సంచలనాలు మాములుగా ఉండేవి కాదు. గ్రామ్ ఫోన్ రికార్డులు, ఆడియో క్యాసెట్లు, వీడియో క్యాసెట్లు అన్నింటిలోనూ అమ్మకాల పరంగా లవకుశని దాటే సినిమా రాలేదంటే అతిశయోక్తి కాదు
Also Read : Vamsanikokkadu : ఫ్యామిలీ ప్లస్ మాస్ కాంబినేషన్ – Nostalgia