iDreamPost
అందులో కూడా ఆసక్తికరమైన విశేషాలు ఉంటాయి. అలా ఓసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్ళొద్దాం. 1991. ఇప్పట్లా ఆన్ లైన్ ప్రపంచం లేని థియేటర్ లోకం. కేబుల్ టీవీ కూడా మొదలుకాని కాలం. కేవలం వీడియో క్యాసెట్లు మాత్రమే ప్రత్యాన్మయంగా ఉండేవి.
అందులో కూడా ఆసక్తికరమైన విశేషాలు ఉంటాయి. అలా ఓసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్ళొద్దాం. 1991. ఇప్పట్లా ఆన్ లైన్ ప్రపంచం లేని థియేటర్ లోకం. కేబుల్ టీవీ కూడా మొదలుకాని కాలం. కేవలం వీడియో క్యాసెట్లు మాత్రమే ప్రత్యాన్మయంగా ఉండేవి.
iDreamPost
ఎప్పుడూ సంక్రాంతి సినిమాల పోటీ ముచ్చట్లే కాదు అప్పుడప్పుడూ వేరే నెలల సంగతులు కూడా చూడాలి. అందులో కూడా ఆసక్తికరమైన విశేషాలు ఉంటాయి. అలా ఓసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్ళొద్దాం. 1991. ఇప్పట్లా ఆన్ లైన్ ప్రపంచం లేని థియేటర్ లోకం. కేబుల్ టీవీ కూడా మొదలుకాని కాలం. కేవలం వీడియో క్యాసెట్లు మాత్రమే ప్రత్యాన్మయంగా ఉండేవి. చిరంజీవితో పాటు బాలయ్య, నాగ్, వెంకీలు ఫుల్ ఫామ్ లో ఉన్న సమయం. డిసెంబర్ వచ్చింది. ఏడాది చివరి కాబట్టి భారీ చిత్రాలేవీ షెడ్యూల్ లో లేవు. అన్నీ జనవరి పండగను టార్గెట్ చేసుకుని దీన్ని వదిలేశాయి. దీంతో చిన్న సినిమాలకు ఇది మంచి అవకాశంగా కనిపించింది.
ముందుగా 4న కాట్రగడ్డ రవితేజ దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రప్రసాద్ ‘కొబ్బరిబొండం ‘ అనూహ్య విజయం సాధించి మనీషా బ్యానర్ కు కాసులు కురిపించింది. డైరెక్టర్ కాకముందు ఎస్వి కృష్ణారెడ్డికి సంగీతపరంగా మంచి పేరు తీసుకొచ్చింది. మరుసటి రోజు చెప్పుకోదగ్గ అంచనాలతో కృష్ణ రమేష్ బాబుల కాంబినేషన్ లో వచ్చిన ‘నా ఇల్లే నా స్వర్గం’ నిరాశపరిచింది. ఫ్యామిలీ జానర్ అయినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. 11న రిలీజైన ‘అత్తింట్లో అద్దె మొగుడు’ నటకిరీటికి ఏమంత ఉపయోగపడలేదు. 20న నరేష్ హీరోగా రూపొందిన ‘పిచ్చి పుల్లయ్య’ చూసి జనం దాదాపు అదే స్టేజికి వెళ్లారు. దెబ్బకు రెండో వారానికే బాక్సులు వాపస్.
క్రిస్మస్ కానుకగా 25న కమల్ హాసన్ ‘గుణ’ వచ్చింది. లోకనాయకుడు అద్భుతంగా నటించినప్పటికీ కథాకథనాలు మరీ నెమ్మదిగా సాగడంతో పాటు మేకింగ్ స్టైల్ తెలుగు జనానికి అంతగా ఎక్కలేదు. ఫలితం ఫ్లాప్. రెండు రోజులు ఆలస్యంగా అసలే అంచనాలు లేకుండా విడుదలైన ‘అమ్మ రాజీనామా’కు మంచి స్వాగతం లభించింది. శారద ప్రధాన పాత్రలో దాసరి తీసిన ఎమోషనల్ డ్రామా హిట్ క్యాటగిరీలో పడింది. డబ్బింగ్ సినిమాల్లో విజయ్ కాంత్ ‘సిటీ పోలీస్'(20న విడుదల) కమర్షియల్ గా పాస్ కాగా ప్రేతాత్మ, గూండా గ్యాంగ్, భాగ్యరాజ్ దొంగోడు, ఫారెస్ట్ ఆఫీసర్ లు సోసోగా ఆడాయి. ఫైనల్ గా కొబ్బరిబొండం, అమ్మ రాజీనామా విన్నర్స్ గా నిలిచాయి
Also Read : Satya : గూండా వ్యవస్థకు తిరగబడిన నిరుద్యోగి – Nostalgia