Criminal : భార్యను హత్య చేసిన డాక్టర్ కథ

Criminal : భార్యను హత్య చేసిన డాక్టర్ కథ

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేసే ప్రయత్నంలో ఉండగా ఫ్యుజిటివ్ చూశారు. అప్పటికే చిరంజీవిని డైరెక్ట్ చేసిన అనుభవం ఉన్నప్పటికీ అది కేవలం హిందీ వెర్షన్ కు పరిమితమయ్యింది. అలా కాకుండా ఈసారి మల్టీ లాంగ్వేజ్ మూవీని ప్లాన్ చేసుకున్నారు. ఫ్యుజిటివ్ ఆధారంగా 'క్రిమినల్'ను అల్లుకున్నారు. మెయిన్ పాయింట్ ని యధాతథంగా తీసుకుని ఇక్కడి మాస్ ఆడియెన్స్ కోసం ట్రయాంగులర్ లవ్ స్టోరీని జోడించారు.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేసే ప్రయత్నంలో ఉండగా ఫ్యుజిటివ్ చూశారు. అప్పటికే చిరంజీవిని డైరెక్ట్ చేసిన అనుభవం ఉన్నప్పటికీ అది కేవలం హిందీ వెర్షన్ కు పరిమితమయ్యింది. అలా కాకుండా ఈసారి మల్టీ లాంగ్వేజ్ మూవీని ప్లాన్ చేసుకున్నారు. ఫ్యుజిటివ్ ఆధారంగా 'క్రిమినల్'ను అల్లుకున్నారు. మెయిన్ పాయింట్ ని యధాతథంగా తీసుకుని ఇక్కడి మాస్ ఆడియెన్స్ కోసం ట్రయాంగులర్ లవ్ స్టోరీని జోడించారు.

హాలీవుడ్ సినిమాలు ఇప్పుడంటే ఓటిటిలో విచ్చలవిడిగా దొరికి ఏది ఎక్కడి కాపీనో ఈజీగా గుర్తుపడుతున్నాం కానీ ఒకప్పుడు ఆ ఛాన్స్ లేదు. వీడియో క్యాసెట్లు రెగ్యులర్ గా చూసే అలవాటు ఉన్న వాళ్లకు మాత్రమే ఈ సౌలభ్యం దక్కేది. అందుకే అంత వేగంగా ఈ కహానీలు బయటికి వచ్చేవి కావు. ఓ మంచి ఉదాహరణ చూద్దాం. 1993 ఇంగ్లీష్లో ‘ఫ్యుజిటివ్’ అనే మూవీ వచ్చింది. హారిసన్ ఫోర్డ్ హీరోగా నటించిన ఈ క్రైమ్ ఎంటర్ టైనర్ కు ఉత్తమ సహాయనటుడి క్యాటగిరిలో ఆస్కార్ అవార్డు దక్కింది. కమర్షియల్ గానూ ఇది బ్లాక్ బస్టరే. ఆ సమయంలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేసే ప్రయత్నంలో ఉండగా ఫ్యుజిటివ్ చూశారు.

అప్పటికే చిరంజీవిని డైరెక్ట్ చేసిన అనుభవం ఉన్నప్పటికీ అది కేవలం హిందీ వెర్షన్ కు పరిమితమయ్యింది. అలా కాకుండా ఈసారి మల్టీ లాంగ్వేజ్ మూవీని ప్లాన్ చేసుకున్నారు. ఫ్యుజిటివ్ ఆధారంగా ‘క్రిమినల్’ను అల్లుకున్నారు. మెయిన్ పాయింట్ ని యధాతథంగా తీసుకుని ఇక్కడి మాస్ ఆడియెన్స్ కోసం ట్రయాంగులర్ లవ్ స్టోరీని జోడించారు. సుభాష్ ఘాయ్ సౌదాగర్ తో పరిచయమైన మనీష కొయిరాలా నాగార్జునకు భార్యగా, కీలకమైన ఇన్స్ పెక్టర్ పాత్రలో రమ్యకృష్ణలను హీరోయిన్లుగా తీసుకున్నారు. నాజర్ మరో ఆఫీసర్ గా ముఖ్యమైన క్యారెక్టర్ దక్కించుకున్నారు. సంభాషణలు సాయినాథ్ తోటపల్లి అందించగా కీరవాణి స్వరాలు సమకూర్చారు. చంటి ఇండస్ట్రీ హిట్ తరువాత మంచి ఉత్సాహం మీదున్న నిర్మాత కెఎస్ రామారావు క్రిమినల్ కి భారీ బడ్జెట్ కేటాయించుకున్నారు

పేదల కోసం అమ్మ హాస్పిటల్ కట్టి సేవ చేయాలనుకుంటున్న డాక్టర్ అజయ్(నాగార్జున)మీద భార్య డాక్టర్ శ్వేత(మనీష కొయిరాలా)ను హత్య చేసిన నేరం మోపబడి రుజువవుతుంది. దీంతో అతను జైలుకు వెళ్లే దారిలో పోలీసుల నుంచి తప్పించుకుని స్వంతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ మర్డర్ వెనుక ఉన్నది తన స్నేహితుడైన డాక్టర్ ప్రతాప్(శరత్ బాబు)అని తెలుసుకుని షాక్ తింటాడు. అసలు నేరస్థులను ప్రపంచానికి చూపిస్తాడు. ఇంగ్లీష్ లో ఉన్నంత యాక్షన్, ట్విస్టులు తెలుగులో తగ్గిపోయాయి. కీరవాణి స్వరపరిచిన తెలుసా మనసా పాట దశాబ్దాలు దాటినా మర్చిపోలేని ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయింది. మాస్ లో ఫాలోయింగ్ పెరిగిన నాగార్జునని క్రిమినల్ గా ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో రిసీవ్ చేసుకోలేకపోయారు. 1994 ఆక్టోబర్ 14న కృష్ణ ‘పోలీస్ అల్లుడు’తో పాటు అదే రోజు విడుదలైన క్రిమినల్ అల్లరి అల్లుడు, వారసుడు, హలో బ్రదర్ స్థాయిలో లేకపోవడంతో యావరేజ్ అయ్యింది. హిందీ వెర్షన్ 1995లో రిలీజ్ చేశారు.

Also Read : Gudi Gantalu : అపార్థం ఎంతటి పతనమో చూపించిన సినిమా – Nostalgia

Show comments