iDreamPost
android-app
ios-app

స్ఫూర్తి నింపేలా రికార్డు సృష్టించిన అభిమానం

  • Published Dec 22, 2020 | 1:47 AM Updated Updated Dec 22, 2020 | 1:47 AM
  • Published Dec 22, 2020 | 1:47 AMUpdated Dec 22, 2020 | 1:47 AM
స్ఫూర్తి నింపేలా రికార్డు సృష్టించిన అభిమానం

పుట్టిన రోజు సందర్భంగా వైఎస్‌ జగన్‌కు ఆయన అభిమానులు విలువైన బహుమతి ఇచ్చారు. జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలకే ప్రతి ఏడాది ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడుగానీ, ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి గానీ వివిధ సేవా కార్యక్రమాలతో వైఎస్‌ జగన్‌ను ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి కొనసాగింపుగా సోమవారం వైఎస్‌ జగన్‌ జన్మదినాన్ని జరిపారు. భారీ స్థాయిలో రక్తదానం చేశారు.

రక్తదానం చేయడంలో వైఎస్‌ జగన్‌ అభిమానులు రికార్డు సృష్టించారు. దేశంలో ఇప్పటి వరకూ ఒక్క రోజులో చేసిన రక్తదానం 10,500 యూనిట్లు కాగా, నిన్న జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం నుంచి రాత్రి 7 గంటలకు 34,723 యూనిట్ల రక్తం ఆయన అభిమానులు దానం చేశారు. ఈ కార్యక్రమం వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఇంటర్నేషన్‌లో చోటు దక్కించుకునేలా రక్తదానం చేసిన అభిమానులు  వైఎస్‌ జగన్‌కు పుట్టిన రోజు బహుమానం ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ రక్తదాన సిబిరాలు ఏర్పాటు చేశారు. కేక్‌లు కట్‌ చేయడంతో పాటు ఉదయం నుంచి రక్తదాన సిబిరాలను నిర్వహించారు. ఏపీతోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలోనూ వైఎస్‌ జగన్‌ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు రక్తదానం చేశారు. మొత్తం మీద 278 కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరగడం విశేషం. వైఎస్‌ జగన్‌పై ఉన్న అంతులేని అభిమానం వేలాది మంది ప్రాణాలు నిలిపేందుకు తోడ్పడేలా చేయడం రాజకీయాల్లో గుర్తుండిపోతుంది. ఈ కార్యక్రమం ఇతరుల్లో స్ఫూర్తి నింపుతుందనడంలోనూ సందేహం లేదు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio