iDreamPost
android-app
ios-app

చిన్నారుల మామగా… పలికించే పాలకుడిగా!

చిన్నారుల మామగా… పలికించే పాలకుడిగా!

పుట్టగానే ఎవరికీ మాటలు రావు. కానీ వారికి మాటలు రావాలంటే స్పష్టంగా వినిపించాలి. చెవితో పాటు గొంతులో ఏ సమస్య ఉన్న వారికి జీవితాంతం వినిపించదు. మాట్లాడలేరు. బధిరులుగా మిగిలిపోతారు. అయితే ఈ సమస్యను తల్లిదండ్రులు చిన్నారుల్లో గుర్తించడానికి దాదాపు 3, 4 ఏళ్లు పడుతుంది. అప్పటికే వారు ఒకరకమైన భాషకు, సైగలకు అలవాటు పడుతున్నారు. ఒకవేళ చిన్నారులకు వినిపించడం, లేదని మాట్లాడడం లేదని తల్లిదండ్రులు గుర్తించిన, దాని చికిత్సకు అయ్యే వ్యయం చాలా ఎక్కువ. దీంతో ఎక్కువ మంది చిన్నారులు బదిరులుగానే మిగిలిపోతున్నారు. ఇప్పుడు ఈ సమస్య మీద ముఖ్యమంత్రి జగన్ సీరియస్గా దృష్టి సారించారు. చిన్నారుల విషయాల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే ముఖ్యమంత్రి జగన్ తాజాగా చిన్నారుల్లో బధిరులు లేని ఆంధ్రప్రదేశ్ ను సాధించే దిశగా ఓ ముందడుగు వేశారు.

ఇలా చేస్తే మాటలు వస్తాయి

చిన్నారులకు మాటలు రావాలంటే వారికి ఎదుటి వారి మాటలు స్పష్టంగా వినిపించాలి. కనీసం 65 నుంచి 75 శాతం మధ్యలో వినికిడి శక్తి ఉంటే చిన్నారులకు మాటలు వస్తాయి. ఏ మాత్రం తక్కువ ఉన్నా వారు ఎదుటి వారి మాటలను పట్టించుకోరు వినిపించుకోరు. దీంతో ఆటోమేటిక్ గా మాట్లాడ్డం కూడా ఆగిపోతుంది. గొంతులో ఎలాంటి సమస్య లేకుండా స్పష్టంగా వినిపించకపోవడం తో వారు మాట్లాడడం అనే విషయాన్ని మర్చిపోతారు. దీంతో వారు భాష మీద కాదు… కనీసం మాట మీద కూడా దృష్టి సారించాలని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో వారు శాశ్వత బధీరులుగా తయారవుతారు. దీనికి ఒక్కటే మార్గం చిన్నారికి ఐదు సంవత్సరాల లోపు వయసు లోపే వారికి స్పష్టంగా వినిపించేలా ఒక కీలక ఆపరేషన్ చేయించాలి. దానినే జర్మన్ టెక్నాలజీ కాక్లియర్ ఇంప్లాంటేషన్ అంటారు. ఈ ఆపరేషన్ చెవికి పైభాగంలో చేస్తారు. శరీరంలోకి ముఖ్యంగా మెదడు పై భాగాన ఓ చిన్న పరికరాన్ని లోపల అమర్చి, బయట కూడా మరో పరికరాన్ని కనిపించేలా ఉంచుతారు. పైనుండే లోపల ఉండే యంత్రానికి స్పష్టంగా ధ్వనులను పంపడం ద్వారా చిన్నారులకు అన్నీ స్పష్టంగా వినిపిస్తాయి.

కాక్లియర్ ఆపరేషన్ ఎంతో వ్యయం

జర్మన్ టెక్నాలజీతో వచ్చే ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఎంతో వ్యయంతో కూడుకున్నది. చెవి పైభాగం లో శరీరం లోపల పెట్టే యంత్రం మంచిది, శరీరానికి ఏ హానీ చేయనిది అయితే ఆపరేషన్ వ్యయం కూడా పెరుగుతూ ఉంటుంది. మెటల్, సిల్వర్, కాపర్ వంటి లోహలతో తయారు చేసిన యంత్రాలు దాని ధర ఆధారంగా సుమారు 8 లక్షల నుంచి 30 లక్షల వరకు ఆపరేషన్ వ్యయం ఉంటుంది. దీంతో అంత డబ్బును భరించలేక పేదలు పిల్లలను ఆపరేషన్ వరకూ తీసుకు వెళ్లలేకపోతున్నారు. కొందరికి అయితే అసలు ఈ ఆపరేషన్ ఉన్నట్లు కూడా తెలియదు.

ఆరోగ్య శ్రీ లో పెట్టారు!

కాక్లియర్ ఇంప్లాంటేషన్ ను మొదట ఎవరికి వారు వ్యక్తిగతంగా చేయించుకునేవారు. అయితే వైద్యం విస్తృతం అవడంతో పాటు అందరికీ ఈ వైద్యం గురించి తెలియడంతో దీనికి డిమాండ్ ఏర్పడింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఎక్కువగా బధిరులు గా మారుతున్నారని లెక్కలు తెలడంతో పాటు.. దీని అవసరాన్ని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి వైద్యులు చెప్పడంతో ఆయన కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ను ఆరోగ్యశ్రీ లోకి తీసుకు వచ్చారు. సుమారు 30 వేల మంది పిల్లలకు పైగా ఆరోగ్యశ్రీలో ఈ ఆపరేషన్లు చేయించుకున్నట్లు లెక్కలు ఉన్నాయి. అయితే ఆరోగ్య శ్రీ లో ప్రధాన నిబంధన గా ఈ ఆపరేషన్ చేయించుకోవాలంటే మూడు ఏళ్ళు దాటకుండానే చిన్నారిని తీసుకురావాల్సి ఉంది. అయితే మూడేళ్ల వరకు పిల్లలు మాట్లాడతారని భ్రమలోనే తల్లిదండ్రులు ఉంటున్నారు. ఆరు గుర్తించే సరికి వారికి మూడేళ్లు దాటిపోతున్నాయి. ఈ విషయం మీద దృష్టి సారించే లోపే వైయస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం చెందడం తర్వాత ఈ విషయం పక్కన పెట్టడం జరిగింది.

మళ్ళీ జగన్ దృష్టి

చెవిటి మూగ పిల్లల వైకల్యం పై మళ్లీ జగన్ దృష్టి పెట్టడం అభినందించాల్సిన విషయం. అందులోనూ అత్యంత వ్యయం అయ్యే జర్మనీ టెక్నాలజీ కాక్లియర్ ఇంప్లాంటేషన్ ను విస్తృతంగా అమలు చేసేందుకు, ఆంధ్రప్రదేశ్ను బదిరుల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు జగన్ బృహత్తరమైన అడుగు వేయడం అంతా స్వాగతించాల్సిన విషయం. ఏకంగా కంటి వెలుగు కార్యక్రమం తరహాలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా ప్రారంభిస్తే ఎక్కడా చెవిటి మూగ వైకల్యం ఉన్న పిల్లలు కనిపించరు. దీనిపై గ్రామాల్లో సైతం విస్తృతంగా ప్రచారం చేసి అందరినీ మేల్కొలిపి కాక్లియర్ ఇంప్లాంటేషన్ కు ఒప్పించగలిగితే అద్భుతం సాకారం అవుతుంది అనడంలో సందేహం లేదు. అందులోనూ ప్రతి బోధన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసేలా అవసరమైన సదుపాయాలు ఉండాలని జగన్ చెప్పడంతో ఈ ప్రక్రియ నిరంతరంగా సాగుతుందని అర్థమవుతోంది. అన్నీ ఉన్నా చెవిటి మూగ వైకల్యంతో ప్రత్యేక పిల్లలుగా వెనకబడిన చిన్నారుల ఆత్మధైర్యం నింపడానికి ముఖ్యమంత్రి పూనుకోవడం జగన్ కు పిల్లలపై ఉన్న ప్రత్యేక శ్రద్ధను తెలియజేస్తోంది.