Idream media
Idream media
స్వతంత్ర భారతదేశంలో ప్రధాన మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చాలా మంది పని చేశారు. అయితే అందులో ప్రజా నాయకులుగా పేరొందిన వారు అంతి కొద్ది మందే ఉన్నారు. రాజకీయ నాయకులు అయ్యేందుకు అనేక మార్గాలున్నాయి. కానీ ప్రజా నాయకులు అవ్వాలంటే.. ప్రజలను ముందుండి నడిపించాలి. ఆపత్కాలంలో తానున్నాననే భరోసాను ప్రజల్లో నింపాలి. ఇలాంటి నేతలు బహు అరుదుగా కనిపిస్తారు. వారికి దేశ వ్యాప్తంగా మంచి ఆధరణ లభిస్తుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్రంలోనే కాదు.. సరిహద్దు రాష్ట్రాలలోనూ మంచి క్రేజ్ ఉంది. ఏళ్ల తరబడి ముఖ్యమంత్రులుగా పని చేసిన వారు పొందలేని ప్రజాధారణ వైఎస్ జగన్‌కు మాత్రమే ఎలా సాధ్యమైంది..? ప్రజల మన్ననలను పొందడానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఏం పని చేశారు..? కేవలం పథకాలు అమలు చేయడం వల్లే ఈ ఆధరణ వచ్చిందా..? అంటే కాదనే చెప్పాలి.
ఆపత్కాలంలో ప్రజల్లో ధైర్యాన్ని నింపి.. నడిపించడంతోనే సీఎం వైఎస్ జగన్‌కు ఈ స్థాయిలో ఆధరణ వచ్చింది. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన 9 నెలలకే కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చింది. యావత్ ప్రపంచం వణికిపోయింది. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్, ఇటలీ లాంటి దేశాలే ప్రజలకు చికిత్స అందించడంలో చేతులెత్తాశాయి. మన దేశంలోనూ కరోనా కేసులు ఎక్కువగా నమోదైన రాష్ట్రాలలో దాదాపు ఇదే పరిస్థితి. కానీ ఏపీలో కేసులు నమోదైనా.. ప్రజలు భయపడలేదు. కారణం.. చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టడం. పరీక్షలు చేయడం, ఆస్పత్రులు సిద్ధం చేయడం.. ఉచితంగా చికిత్స.. ఇలా ప్రజలకు కొండంత ధైర్యాన్ని నింపారు వైఎస్ జగన్. కరోనా సమయంలో ఏపీలో ఉంటే మంచిదనే భావన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ ప్రజలు అనుకోవడం ఆపత్కాలంలో సీఎం జగన్ సాగించిన పాలన ఓ గీటురాయి.
Also Read : కేంద్రం వదేలిసినా.. జగన్ ఆపన్నహస్తం
చంద్రబాబు హాయంలో మూలనపడిన 108 అంబులెన్స్‌లకు ప్రాణం పోసి.. ప్రతి మండలానికి ఒకటి చొప్పన వాహనం కూడా కరోనా సమయంలో వైసీపీ సర్కార్ అందుబాటులోకి తెచ్చింది. కరోనా పాజిటివ్ బాధితులను తరలించడానికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా సీఎం వైఎస్ జగన్ ఏర్పాట్లు చేశారు. ఇక పరీక్షల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గరీష్టంగా పరీక్షలు చేసి.. మహమ్మారిని కట్టడి చేశారు. బాధితులకు ఉచితంగా వైద్యమే కాదు, పౌష్టికాహారం కూడా అందించారు. ఇంటికి వెళ్లేటప్పుడు ఆర్థిక సాయం కూడా చేశారు.
తాజాగా వ్యాక్సిన్ విషయంలోనూ సీఎం వైఎస్ జగన్ వేసిన అడుగు ఆయన్ను ప్రజా నాయకుడుగా నిలుపుతోంది. ప్రజలను నడిపించే నాయకుడుగా పేరు తెచ్చిపెడుతోంది. దేశంలో కోవాక్జిన్, కోవిషీల్ట్ అనే రెండు వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వ్యాక్సిన్‌పై ప్రజల్లో అనేక సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుందోనన్న భయం వారిలో ఉంది.
ప్రజల్లో నెలకొన్న సందేహాలు, భయాలు తొలగిపోయేలా.. ముందు వ్యాక్సిన్ తీసుకునేందుకు సీఎం వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ఈ రోజు నుంచి పట్టణ వార్డు సచివాలయాల్లో 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. వైఎస్ జగన్‌కు వ్యాక్సిన్ వేయడం ద్వారా ఆ కార్యక్రమం ప్రారంభమైంది. గుంటూరులోని భరత్‌పేట వార్డు సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ తన సతీమణి వైఎస్ భారతితో కలసి వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చే సచివాలయాల్లోనే తాను వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సీఎం వైఎస్ జగన్.. ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏమీ కాదని, కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా ఉండవచ్చనే ఆలోచనను సీఎం వైఎస్ జగన్ ప్రజల్లో కలిగించారు. ఏకంగా ముఖ్యమంత్రే సచివాలయంలో వ్యాక్సిన్ తీసుకోవడంతో ప్రజలు ఎలాంటి సందేహాలు లేకుండా వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read : చరిత్రను తిరగరాస్తున్న వైఎస్ జగన్